OTT Movie : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలలో మలయాళం సినిమాలకు ఇప్పుడు క్రేజ్ ఎక్కువగా ఉంది. తెలుగులో కూడా మలయాళం నటులు నటించడం మొదలుపెట్టారు. ఫహద్ ఫాజిల్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి నటులను అంత ఈజీగా మర్చిపోలేము. వీళ్ళు తమ నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరయ్యారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన జోజు జార్జ్ నటించిన పని మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే హీరో ప్రధాన పాత్ర పోషించిన ఒక మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ మలయాళం మూవీ పేరు ‘ఆనుమ్ పెన్నుమ్’ (Annum Pennum). మూడు విభాగాలను కలిగి ఉన్న ఈ మలయాళ మూవీకి వేణు, ఆషిక్ అబు, జే కె దర్శకత్వం వహించారు. ఈ మూవీ మూడు వేర్వేరు కాలక్రమాల నేపథ్యంలో స్త్రీ-పురుషుల సంబంధాల కథలను చెబుతుంది. ప్రతి సెగ్మెంట్, ద్రోహం, కామంపై స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీలో పార్వతి తిరువోతు, ఆసిఫ్ అలీ, జోజు జార్జ్, సంయుక్త, రోషన్ మాథ్యూ, దర్శన రాజేంద్రన్, ఇంద్రజిత్ సుకుమారన్, నేడుముడి వేణు, కవియూర్ పొన్నమ్మ, బాసిల్ జోసెఫ్ వంటి నటులు ఉన్నారు. డిఫరెంట్ స్టోరీలతో ఈ మూవీ రన్ అవుతుంది. స్వాతంత్రం రాకముందే ఈ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
పారు ఇంటిని పోలీసులు తగలబెట్టేస్తారు. ఆ మంటల్లో పారు తన తల్లిదండ్రులను కోల్పోతుంది. అక్కడ నుంచి మరో ఊరికి వెళ్తుంది. ఒక ఇంట్లో పనులు చేసుకుంటూనే, కమ్యూనిస్ట్ కార్యకలాపాలు సాగిస్తుంది. అయితే ఆ ఇంట్లో రాఘవన్, పారుతో ఎలాగైనా గడపాలి అనుకుంటాడు. అక్కడే ఉండే వాసు అనే వ్యక్తి తనని ప్రేమిస్తుంటాడు. మాధవన్ అనే వ్యక్తి పారు దగ్గరికి వచ్చి ఒక లెటర్ ఇస్తాడు. దానిని అక్కడే పని చేసే మరో వ్యక్తికి ఇవ్వాలని చెప్తాడు. ఆ లెటర్ అతనికి ఇస్తుంది పారు. మరోవైపు రాఘవన్, పారుని ఎవరూ లేని ఒకచోటికి రమ్మంటాడు. అయితే పారు ఆ సమయంలో వాసుతో ఏకాంతంగా గడుపుతుంది. ఆ తరువాత రాఘవన్ కి బుద్ధి చెబుతుంది. మొదటి స్టోరీ ఇలా సాగిపోతుంది. రెండో స్టోరీలో… కృష్ణ ఒక తేయాకు కంపెనీలో పని చేస్తుంటాడు. అక్కడే ఉండే రోసియమ్మ అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమె కూడా ఇతన్ని ఇష్టపడుతుంది. ఒకరోజు ఏకాంతంగా గడిపే ప్రయత్నం చేస్తాడు కృష్ణన్. అందుకు ఆమె నేను ఎప్పుడూ ఇలా చేయను అని చెప్తుంది. తనమీద ఇష్టం లేదనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కృష్ణ. జాబ్ కి కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. అయితే ఈ స్టోరీలో క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. ఈ ట్విస్ట్ తెలియాలంటే ఈ మూవీని చూడండి.