Akkineni Akhil: ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామంది యంగ్ హీరోలకు ఒక్క హిట్ అవసరం. అలాంటిది కెరీర్ ప్రారంభించినప్పటి నుండి అస్సలు ఒక్క హిట్ కూడా పడని అఖిల్ అక్కినేని పరిస్థితి ఏంటో ప్రేక్షకులు ఇప్పటికే చూస్తున్నారు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. అప్పటికే నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చి లవర్ బాయ్ ఇమేజ్‌తో సెటిల్ అయ్యి మాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ తర్వాత రెండో వారసుడిగా అఖిల్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. లాంచ్ అయితే జరిగింది కానీ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. దీంతో అన్నయ్య నాగచైతన్య స్టైల్‌నే ఫాలో అయిపోవాలని ప్రయత్నాల్లో ఉన్నాడట అఖిల్.
ఇంట్రెస్టింగ్ అప్డేట్
బ్యాక్ టు బ్యాక్ వరుస ఫ్లాపులు రావడంతో తన తరువాతి సినిమాను సైలెంట్‌గా పూర్తి చేయాలని అఖిల్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు అఖిల్ అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా బయటికి రాలేదు. సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటున్నా కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ బయటికి రాకుండా మూవీ టీమ్ జాగ్రత్త పడుతోంది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని సినిమా ఇప్పటికే ప్రారంభమయినా కూడా దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియకండా మేకర్స్ జాగ్రత్తపడుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది.
అన్న బాటలో
చాలాకాలంగా హైదరాబాద్‌లోనే అఖిల్ అప్‌కమింగ్ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఇక హైదరాబాద్‌లో షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్తూరులో తరువాతి షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇది చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న కథ అని తాజాగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అందుకే చిత్తూరు యాసలో మాట్లాడడానికి అఖిల్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడట. ఇటీవల అఖిల్ అన్న నాగచైతన్య (Naga Chaitanya) కూడా ‘తండేల్’ (Thandel) సినిమాలో శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారులు మాట్లాడే యాసలో మాట్లాడడం కోసం చాలా కష్టపడ్డాడు. ఆ పాత్రకు తను న్యాయం చేశాడని చైతూపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు అదే బాధ్యతను అఖిల్ తీసుకోనున్నాడు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ప్రమోషన్స్ ప్రారంభించిన నిధి.. మరి మిగతావారి పరిస్థితి.?
యాక్టింగ్‌పై ట్రోల్స్
చిత్తూరు యాసలో మాట్లాడడం అంత ఈజీ కాకపోయినా దానికోసం ఇప్పటినుండే కష్టపడుతున్నాడట అఖిల్ అక్కినేని (Akhil Akkineni). తన అప్‌కమింగ్ సినిమా ఒక గ్రామంలో జరిగే రొమాంటిక్ డ్రామా అని సమాచారం. చిత్తూరు జిల్లాలోని భరతం మెట్టా అనే గ్రామంలో సెట్ చేసిన కథ అని తెలుస్తోంది. హైదరాబాద్‌లో షెడ్యూల్ పూర్తయిన తర్వాత తరువాతి షెడ్యూల్‌ను ఏప్రిల్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే అఖిల్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘ఏజెంట్’ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకోవడంతో తనపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఇందులో తెలంగాణ యాసలో మాట్లాడడానికి ప్రయత్నించిన అఖిల్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ‘ఏజెంట్’లో అఖిల్ యాక్టింగ్ మరీ దారుణంగా ఉందని, అస్సలు బాలేదని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.