BigTV English

OTT Movie : రక్తపుటేరులు పారిస్తున్న మర్మమైన దీవి… ఈ మూవీని చూస్తే పార్ట్స్ ప్యాక్ ఐపోతాయి

OTT Movie : రక్తపుటేరులు పారిస్తున్న మర్మమైన దీవి… ఈ మూవీని చూస్తే పార్ట్స్ ప్యాక్ ఐపోతాయి

OTT Movie : భయపెడుతూ ఎంటర్టైన్ చేసే హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలు చూస్తున్నంత సేపు పార్ట్స్ ప్యాక్ అవుతుంటాయి. అలా భయపడుతూనే ఈ సినిమాలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో తన చెల్లెల్ని డబ్బు కోసం కొంతమంది కిడ్నాప్ చేస్తారు. ఆ అమ్మాయిని ఒక భయంకరమైన దీవిలో పెడతారు. హీరో తనని వెతికే క్రమంలో స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘అపోస్టల్‘ (Apostle). ఈ మూవీని గారెత్ ఎవాన్స్ రచించి, దర్శకత్వం వహించారు. ఇందులో డాన్ స్టీవెన్స్, లూసీ బోయిన్‌టన్, మార్క్ లూయిస్ జోన్స్, బిల్ మిల్నర్, క్రిస్టీన్ ఫ్రోసేత్, పాల్ హిగ్గిన్స్, మైఖేల్ షీన్ నటించారు. ఒక బ్రిటీష్ వ్యక్తి భయంకరమైన  ద్వీపంలోని కల్ట్ నుండి తన సోదరిని రక్షించడానికి ప్రయత్నించినప్పుడు ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లెక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఒక డబ్బు ఉన్న అమ్మాయిని కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. ఆమెను ఒక భయంకరమైన దీవిలో బందిస్తారు. చూడటానికి ఆ దీవిలో కొంతమంది దైవ ప్రచారం చేస్తున్నట్టుగా ఉంటుంది. అయితే అక్కడ ఆచారాలు చాలా భయంకరంగా ఉంటాయి. అందులో బయట ప్రపంచానికి మంచివాళ్ళుగా కనిపిస్తూ, లోపల క్రూరమైన పనులు చేసే పెద్ద మనుషులు కూడా ఉంటారు. హీరో ఆ దీవికి తన చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్తాడు. హీరో ఆ దీవికి ఒక టూరిస్ట్ గా వెళ్తాడు. అక్కడ నివసిస్తున్న వాళ్ళ ఆచారాలు, పద్ధతులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అనుమానం వస్తే చిత్రహింసలు పెట్టి మరీ చంపుతారు అక్కడున్నవాళ్ళు. వాళ్లతో ఉంటూనే కిడ్నాప్ అయిన చెల్లెల్ని వెతికే పనిలో పడతాడు హీరో. ఆ దీవిలో పంటలు కూడా సరిగ్గా పండవు. పుట్టిన పిల్లలు కూడా చనిపోతూ ఉంటారు. జంతువులు అంగవైకల్యంతో పుడుతూ ఉంటాయి.

ఆహారం దిగుమతి చేసుకోవడం కోసమే ఆ వ్యక్తులు డబ్బు కోసం కిడ్నాప్ చేసి ఉంటారు. ఆ ప్రాంతంలో కొన్ని భయంకరమైన ఆకారాలు కూడా హీరోకి కనబడతాయి. హీరో అక్కడికి చెల్లి కోసం వచ్చాడని కనిపెడతారు ఆ ఊరి పెద్దలు. అతడు ఎదురుగా రాకపోతే, తనని చంపేస్తామని బెదిరిస్తారు ఆ దీవి పెద్దలు. చివరికి హీరో తన చెల్లెల్ని కాపాడతాడా ? ఆ దీవిలో ఉన్న మర్మం ఏమిటి? ఆ దీవి నుంచి వీళ్ళిద్దరూ బయటపడతారా? ఈ విషయలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లెక్స్ (Netflix) లో స్ట్రీమింగ్  అవుతున్న ‘అపోస్టల్’ (Apostle) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Su from so OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×