Indian Railways: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతున్నది. అత్యాధునిక టెక్నాలజీతో ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతోంది. ఒకప్పుడు స్ట్రీమ్ రైలు ఇంజిన్లతో మొదలైన రైల్వే ప్రయాణం.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా విద్యుదీకరణ జరుపుకుంటున్నది. పలు డివిజన్లలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవాళ(ఫిబ్రవరి 3న) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్(CSMT) వేదికగా భారతీయ రైల్వే విద్యుదీకరణ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నది రైల్వేశాఖ. తొలి విద్యుత్ రైలు పట్టాలెక్కిన ముంబై రైల్వే స్టేషన్ లోనే ఈ వేడుకలు జరపనున్నట్లు భారతీయ రైల్వే సంస్థ వెల్లడించింది.
పూర్తి మహిళా సిబ్బందితో నడిచిన రాజ్య రాణి ఎక్స్ ప్రెస్
ఇక విద్యుదీకరణకు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజ్య రాణి ఎక్స్ ప్రెస్ రైలును పూర్తి మహిళా సిబ్బంది ఆపరేట్ చేశారు. లోకో పైలెట్స్ మొదలుకొని, స్టేషన్ మాస్టర్, టీటీఈలు, ట్రైన్ గార్డులు అంతా మహిళలే బాధ్యతలు వహించారు. నాందేడ్-ముంబై CSMT రైలును నడిపించారు. “భారతీయ రైల్వేలలో విద్యుత్ ట్రాక్షన్ 100 సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తుగా, రాజ్య రాణి ఎక్స్ ప్రెస్‌ను పూర్తిగా మహిళా సిబ్బంది నడిపారు” అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది రైల్వేశాఖ. ముంబైలో బయల్దేరిన ఈ రైలు నాందేడ్ వరకు ప్రయాణించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహిళా శక్తికి నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Women Leading the Way!
Marking 100 years of Electric Traction in Indian Railways, the Rajya Rani Express was operated recently by an all-women crew. pic.twitter.com/Qo8dg3Lp9P
— Ministry of Railways (@RailMinIndia) February 2, 2025
ఫిబ్రవరి 3న అందుబాటులోకి తొలి ఎలక్ట్రిక్ రైలు
ఫిబ్రవరి 3, 1925న తొలి ఎలక్ట్రిక్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్(CSMT)- కుర్లా మధ్య ఈ రైలు పరుగులు తీసింది. భారతీయ రైల్వేలో ఇదో కీలక మైలు రాయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3 విద్యుదీకరణకు శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నది రైల్వేశాఖ. తొలి విద్యుత్ రైలు పట్టాలెక్కిన ముంబై రైల్వే స్టేషన్ లోనే ఈ వేడుకలు జరపనున్నట్లు భారతీయ రైల్వే సంస్థ వెల్లడించింది. “వందేళ్ల విద్యుదీకరణ వేడుకలను ఫిబ్రవరి 3న ముంబై రైల్వే స్టేషన్ లో ప్రారంభిస్తున్నాం. ఉదయాన్ని రన్ నిర్వహిస్తాం. ఆ తర్వాత స్మారకోత్సవం జరుపుతాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ లో టెక్నికల్, ఇతర సెమినార్లు నిర్వహిస్తాం. ఆ తర్వాత పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం” అని రైల్వే CRPO నీలా వెల్లడించారు.
Read Also: గిన్నిస్ రికార్డుల్లోకి ఢిల్లీ రైల్వే స్టేషన్, కారణం ఏంటో తెలుసా?
శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో భారతీయ రైల్వే విద్యుదీకరణ వైపు మొగ్గు చూపింది. ప్రస్తుతం భారతీయ రైల్వే 1500V DC సిస్టమ్ నుంచి అధునాతన 25kV AC నెట్ వర్క్ కు మారింది. వేగాన్ని మెరుగుపరచడం, ఖర్చులను తగ్గించడం, కర్బన ఉద్గారాలను కంట్రోల్ చేసే లక్ష్యంతో విద్యుదీకరణను విస్తరించారు. దేశంలోని కొన్ని జోన్లలో నూటికి నూరుశాతం విద్యుదీకరణతో రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పటికే అత్యాధునిక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన భారతీయ రైల్వే బ్రాడ్ గేజ్ విద్యుదీకరణను చేపట్టింది. దేశ వ్యాప్తంగా ఈ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బ్రాడ్ గేజ్ నెట్ వర్క్ లో దాదాపు 97 శాతం విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వందశాతం గ్రీన్ రైల్ నెట్ వర్క్ లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు తెలిపారు.
Read Also: భారతీయ రైల్వేలో విద్యుదీకరణకు 100 ఏండ్లు, ఛత్రపతి శివాజీ టెర్మినల్ లో శతాబ్ది ఉత్సవాలు!