BigTV English
Advertisement

OTT Movie : మనుషులను తినే భూతాలు… ప్రపంచం చివరి దశలో… అదిరిపోయే అడ్వెంచర్ థ్రిల్లర్

OTT Movie : మనుషులను తినే భూతాలు… ప్రపంచం చివరి దశలో… అదిరిపోయే అడ్వెంచర్ థ్రిల్లర్

OTT Movie : అడ్వెంచర్ సినిమాలు మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. చిన్న పిల్లలతో సహా ఈ సినిమాలు చూసే విధంగా ఉంటాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఒక జపనీస్ అడ్వెంచర్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. విజువల్స్ తో రచ్చ చేసిన ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


జియో సినిమా (Jio cinema)

ఈ అడ్వెంచర్ జపనీస్ మూవీ పేరు ‘ఎటాక్ అన్ టైటాన్‘ (Attack on Titan). ఈ మూవీలో జైంట్ భూతాలు మనుషులను తినేస్తూ ఉంటాయి. ఆసక్తికరంగా సాగే ఈ స్టోరీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో సినిమా (Jio cinema) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

భూమి మీద మనుషులపై పెద్ద ఆకారంలో ఉండే భూతాలు దాడి చేస్తాయి. మనుషులందరినీ చాలావరకు చంపేసి తినేస్తాయి. వీళ్లంతా తమ రక్షణ కోసం, చుట్టూ ఒక గోడను నిర్మించుకుంటారు. అలా బ్రతికున్న వాళ్ళు ఆ గోడ లోపల ఉంటారు. ఆ భూతాలు గోడ వల్ల లోపలికి రాకుండా ఉంటాయి. అయితే కొంతకాలం తర్వాత హీరో హీరోయిన్ అక్కడి నుంచి బయటికి వెళ్లాలనుకుంటారు. కాపలాగా ఉండే సోల్జర్స్ వాళ్ళని అడ్డుకుంటారు. ఈలోగా ఒక పెద్ద భూతం ఆ గోడను పగలగొట్టుకుని వస్తుంది. దానితో పాటు చాలా భూతాలు లోపలికి వస్తాయి. అక్కడ ఉన్న వాళ్ళని చంపి తిని పోతాయి. హీరో, హీరోయిన్ ఆ తర్వాత భూతాలను ఎలా చంపాలో ట్రైనింగ్ తీసుకుంటారు. అక్కడ ఉన్న కొద్దిపాటి సైన్యంతో, వాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. చివరికి ఆ భూతాలను వీళ్ళు ఎదుర్కొంటారా? ఆ భూతాలు ఎక్కడ నుంచి వచ్చాయి? మిగతా మనుషుల పరిస్థితి ఏంటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ జియో సినిమా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూడాల్సిందే.

నిజానికి ఈ సినిమా స్టోరీ వింటుంటే ‘బిఎఫ్జి’ అనే హాలీవుడ్ సినిమా గుర్తుకు వస్తోంది. ఇది ఒక యానిమేటెడ్ ఫాంటసీ మూవీ. ఒక చిన్న పిల్ల జనాలకు కలలను ఇచ్చే పెద్ద భూతానికి చిక్కుతుంది. ఆ పిల్ల తనని చూడటంతో, ఆ భూతం భూతాల దేశానికి ఈ పిల్లను ఎత్తుకెళ్తుంది. తీరా అక్కడికి వెళ్ళాక మనుషులను తినే భూతాలు ఈ పిల్లను తినడానికి ట్రై చేస్తాయి. ఆ భూతాల దిబ్బలో పాపని ఎత్తుకెళ్లిన ఒకే ఒక్క భూతం మంచిది. మిగతా భూతాలకు చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి తినడమే పని. ఇలాంటి రాక్షస భూతాల పని పట్టడానికి ఆ పాప, ఈ జైంట్ భూతం మహారాణి హెల్ప్ తీసుకుంటాయి. ఇలా ఫాంటసీ సినిమాలను ఇష్టపడే వారికి ఇప్పుడు మనం చెప్పుకున్న జపనీస్ మూవీ కూడా తప్పకుండా నచ్చుతుంది. అయితే ఈ సినిమా వేరు, ఇప్పుడు మనం మూవీ సజెషన్ లో చెప్పుకున్న సినిమా వేరు. కాబట్టి ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ లవర్స్ డోంట్ మిస్.

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×