Rashmika Mandanna : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల ఈ అమ్మడు పెళ్లి గురించి రోజుకో వార్త చక్కర్లు కొడుతుంది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోతో డేటింగ్ లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. కానీ ఈమె మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య వాళ్లిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా ఆమె పెళ్లి గురించి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఆమె స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతుందని లీక్ చేశారు. ఇంతకీ ఆయన ఎవరి పేరు చెప్పారో తెలుసుకుందాం..
రష్మిక మందన్న తన అందం, అభినయం తో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. కోట్లాదిమంది యూత్ గుండెల్లో కలల రాణిగా ముద్ర వేసుకుంది. తన సినిమాల తో పాటుగా సోషల్ మీడియా లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇటు సౌత్ లో, అటు నార్త్ లో.. మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్.. ఇటీవల అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 సినిమాతో మరింత పాపులాటిని సొంతం చేసుకుంది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కానీ లవ్ మ్యాటర్ మాత్రం ఎప్పుడు వైరల్ అవుతూ వస్తుంది. రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో తొలుత నిశ్చితార్థం చేసుకుంది. ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన వీరి ప్రేమాయణానికి పెళ్లి పీటలు ఎక్కముందే ఎండ్ కార్డ్ పడిపోయింది.
ఇక ఇప్పుడేమో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే పలు సందర్భాలలో ఇన్ డైరెక్ట్ గా తాము రిలేషన్ లో ఉన్నామంటూ ఇచ్చిన విషయం కూడా తెలిసింది. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.. తాజాగా ఈ విషయం పై ప్రొడ్యూసర్ నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి గెస్ట్ గా వచ్చారు. ఈ సమయంలో బాలకృష్ణ రష్మిక గురించి ప్రస్తావన తీసుకురాగా.. ప్రొడ్యూసర్ నాగ వంశం మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో హీరో ను పెళ్లి చేసుకుంటుందని తెలుసు సార్, కానీ, ఎవరో ఏంటో అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా అని అన్నారు. అంటే విజయ్ దేవరకొండ నే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. పెళ్లి ఎప్పుడు అని కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. మొత్తానికి రష్మిక, విజయ్ పెళ్లి అనే మ్యాటర్ లీక్ అయ్యింది. మరి ఈ వార్తలపై అమ్మడు త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది.