E-Paper
Advertisement

రాత్రికి రాత్రే రాక్ స్టార్ శవంగా… తీరా శవం దగ్గరకు వెళ్తే ఊహించని షాక్… డార్క్ హారర్ థ్రిల్లర్

రాత్రికి రాత్రే రాక్ స్టార్ శవంగా… తీరా శవం దగ్గరకు వెళ్తే ఊహించని షాక్… డార్క్ హారర్ థ్రిల్లర్
Advertisement

Dark Comedy Horror on OTT: 1986లో ఆస్ట్రేలియా సమ్మర్‌లో ఓ బీచ్ హౌస్‌లో ఫ్రెండ్స్ పార్టీ… కాలేజ్‌లో సీట్ రావడంతో ఫుల్ సెలబ్రేషన్స్… కానీ సరదాగా మొదలైన ఆ రాత్రి కాస్తా రక్తపాతం, ప్రతీకారం, ప్రాణాల కోసం పరుగులుగా మారితే? పైగా ఓ క్రూరమైన ప్రాంక్ కారణంగా ఒక్కొక్కరి పరిస్థితి దారుణంగా మారితే? ఇలాంటి డార్క్ కామెడీ, హారర్, సర్వైవల్ ఎలిమెంట్స్ కలిసిన ఆస్ట్రేలియన్ మూవీ ‘Penny Lane Is Dead’. 1980ల Ozploitation హారర్ సినిమాల స్టైల్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు Shudderలో స్ట్రీమింగ్ అవుతోంది. టైటిల్ చూస్తేనే ఏదో పెద్ద ప్రమాదం జరగబోతోందని అర్థమవుతుంది. అసలు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ జీవితాలను నాశనం చేసిన ఆ రాత్రి ఏం జరిగింది? ప్రాంక్ ఎక్కడికి దారితీసింది? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

పెన్నీ లేన్‌కు యూనివర్సిటీలో సీట్ రావడంతో ఆమె తన బెస్ట్ ఫ్రెండ్స్ టోనీ, అమీతో కలిసి ఓ బీచ్ హౌస్‌లో పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టే ముందు ముగ్గురూ కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. పెన్నీ, టోనీ మధ్య స్నేహం కంటే ఎక్కువ బంధం కూడా ఉంటుంది. మొదట అంతా సరదాగానే సాగుతుంది. కానీ పెన్నీకి ఇష్టం లేని విధంగా ఆమె కజిన్ క్యాట్ అక్కడికి రావడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది.

Advertisement

క్యాట్‌కు పెన్నీపై ఉన్న అసూయ, కోపం అప్పటికే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆమె తెచ్చిన డ్రగ్ కలిపిన కప్‌కేక్‌లతో చేసిన ప్రాంక్ పరిస్థితిని అదుపు తప్పేలా చేస్తుంది. పెన్నీ స్పృహ కోల్పోవడంతో టోనీ, అమీ క్యాట్‌ను అక్కడి నుంచి పంపించేస్తారు. కానీ ఆమె అంత తేలిగ్గా వెళ్లిపోదు. తన క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న బాయ్‌ఫ్రెండ్ అంగస్‌కు ఫోన్ చేస్తుంది. అంగస్ తనతో పాటు మరికొందరిని తీసుకుని తిరిగి రావడంతో ఆ బీచ్ హౌస్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.

ఇక అక్కడి నుంచి మొదలయ్యేది అసలు నరకం. సరదా పార్టీ కాస్తా రక్తపాతంగా మారుతుంది. ప్రాణాల కోసం తప్పించుకోవడానికి ప్రయత్నించే టోనీ, అమీకి ఒక్కో అడుగు ప్రమాదంగా మారుతుంది. మరోవైపు క్యాట్ అసలు విలనా? లేక ఆమెను కూడా తన పరిస్థితులే అలా మార్చాయా? పెన్నీ, టోనీ బంధం ఈ హింస నుంచి బయటపడగలదా? చివరికి ఆ ఒక్క రాత్రిలో ఎవరు బ్రతుకుతారు? ఎవరు బలవుతారు? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు ట్విస్ట్.

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

మియా కేట్ రస్సెల్ దర్శకత్వం వహించి, కథ కూడా రాసిన ‘Penny Lane Is Dead’లో సోఫియా రైట్-మెండెల్సన్, బెయిలీ స్పాల్డింగ్, తహ్లీ ఫెరెడే, అలెగ్జాండ్రా జెన్సన్, బెన్ ఓ’టూల్ తదితరులు నటించారు. సినిమా రన్‌టైమ్ సుమారు 90 నిమిషాలు. హారర్, మిస్టరీ, థ్రిల్లర్‌తో పాటు డార్క్ కామెడీ టచ్ ఉన్న ఈ మూవీకి R రేటింగ్ ఉంది. ఇక ‘Penny Lane Is Dead’ 2026 ఆగస్టు 28 నుంచి Shudderలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇంగ్లీష్ ఒరిజినల్‌గా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. 80s హారర్, డార్క్ కామెడీ, బ్లడీ స్లాషర్, ఒకే రాత్రిలో జరిగే సర్వైవల్ కథలు ఇష్టపడేవారికి ‘Penny Lane Is Dead’ డిఫరెంట్ హారర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

Read Also: పిల్లలను ఎత్తుకెళ్లే సీరియల్ కిల్లర్… 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ… తెలుగులో సైకో థ్రిల్లర్ స్ట్రీమింగ్

Tags

Related News

మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్

మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో పదే పదే వినిపించే సీక్రెట్ విజిల్… శబ్దంతో కోచ్ కొంపముంచిన లేడీ

కూతురి సీక్రెట్ డైరీతో స్టేజ్‌పై జోకులు… నిజం తెలిసి నిలదీసిన కూతురికి షాకింగ్ ట్విస్ట్… తెలుగులోనే ఈ సిరీస్

ఒంటరి తండ్రిని వదిలేసి పార్టీకి వెళ్లాలనుకున్న కొడుకు… చివరికి అదే తండ్రి కోసం మారిపోయిన కథ

పెళ్లాం, అత్త, ఇద్దరు కూతుళ్లను కాల్చేసిన డాక్టర్… తీరా ఆరా తీస్తే దేశాన్నే షాక్ చేసిన క్రైమ్ స్టోరీ

బ్యాచిలరెట్ పార్టీలో దాగుడుమూతల ఆట… పెళ్లికూతురు వేసిన ప్లాన్‌కు రాత్రికి రాత్రే స్నేహితులు బలి

పియానో నేర్చుకోవడానికి వెళ్లి ప్రేమలో… చివరికి లైవ్ షోలోనే గట్టిగా ఇచ్చిపడేసింది

Big Stories

Advertisement
×