BigTV English

Comedy Movie OTT: ఆస్తి కోసం తండ్రి పెట్టిన కండీషన్.. కడుపు చెక్కలయ్యేలా నవ్వించే సీన్లు..

Comedy Movie OTT: ఆస్తి కోసం తండ్రి పెట్టిన కండీషన్.. కడుపు చెక్కలయ్యేలా నవ్వించే సీన్లు..

Comedy Movie OTT: తమిళ ఇండస్ట్రీలో ఇటీవల రిలీజ్ అవుతున్న ప్రతి మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. కామెడీ చిత్రాలు ఎక్కువగా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి.. ఈ మధ్య వచ్చిన ప్రతి మూవీ కాసుల వర్షం కురిపించాయి. ఈ ఏడాది కూడా రిలీజ్ అవుతున్న సినిమాలు పర్వాలేదనిపిస్తున్నాయి. తాజాగా మరో కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ మూవీ పేరేంటో? స్ట్రీమింగ్ ఎక్కడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

తమిళ ఇండస్ట్రీలోకి జర్నీ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఆ మూవీ భారీ సక్సెస్ ను అందుకోవడం తో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈయన నటించిన ప్రతి మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా జై హీరోగా సీనియర్ యాక్టర్ సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో బేబీ అండ్ బేబీ సినిమా వచ్చింది. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న థియేటర్ల లో రిలీజైంది. ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ దక్కింది. అయితే ఇప్పుడు ఓటీటీ లోకి రిలీజ్ అయ్యేందుకు డేట్ ను లాక్ చేసుకుంది.. మార్చి 21 న అంటే రేపే శుక్రవారం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. డబుల్ ఫన్‍కు రెడీగా ఉండండి. బేబీ అండ్ బేబీ మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ అవనుంది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..


స్టోరీ విషయానికొస్తే..

బేబీ అండ్ బేబీ చిత్రం రెండు జంటల మధ్య సాగుతుంది.. ఈ మూవీలో ఒక ఫ్యామిలీ ఉంటుంది అందులో ఇద్దరు కొడుకులు ఉంటారు ఒక జంటకు మాత్రమే కొడుకు పుడతాడు. ఎవరైతే వారసులను కంటారో వారికే ఆస్తి తగ్గుతుందని తండ్రి కండిషన్ పెట్టి ఉంటాడు.. మరో కొడుకుకి పాప పుడుతుంది. పాప తో పాటు ఊరెళ్లేందుకు విమానాశ్రయానికి వస్తారు. ఆడపిల్ల అదృష్టం అని భావించి తన మనవరాలికి మొత్తం ఆస్తి రాసిచ్చేందుకు గుణ తండ్రి ముత్తయ్య అనుకుంటాడు. ఎయిర్పోర్టులో ఇద్దరు పిల్లలు మారిపోతారు. ఈ విషయాన్ని వారి కుటుంబ పెద్దల నుంచి దాచేందుకు నానా తంటారు పడతారు శివ, గుణ. ఇక, ఆ పిల్లలను వారసులుగా ప్రకటించడం ఆ రెండు కుటుంబ సభ్యుల్లోని కొందరికి నచ్చదు. వారు వేరే ప్లాన్లు వేస్తుంటారు. కొడుకులకు ఆస్తి రాకుండా మిగతా వాళ్ళు ప్లాన్లు ఎలా వర్కౌట్ అవుతాయి.. చివరికి ఆస్తి ఎవరికి దక్కింది అన్నది ఈ సినిమా స్టోరీ. స్టోరీ లైన్ కాస్త పాతగానే ఉండటంతో థియేటర్లలో యావరేజ్ గానే ఆడింది. నెల తర్వాత ఓటిటిలోకి వచ్చేస్తున్న ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

Big Stories

×