BigTV English

Naga Chaitanya: శోభిత టాలెంట్ ను తొక్కేస్తున్నారు.. భార్యపై చైతూ ఊహించని కామెంట్స్..!

Naga Chaitanya: శోభిత టాలెంట్ ను తొక్కేస్తున్నారు.. భార్యపై చైతూ ఊహించని కామెంట్స్..!

Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా రెండవ వివాహం తర్వాత ఆయన జీవితం మారిపోవడమే కాకుండా అదృష్టం కూడా ఆయనను వరించింది. అటు తన సినీ ప్రయాణంలో ‘తండేల్’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నాగచైతన్య.. ఇటు శోభితను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.మొత్తానికి అయితే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఇప్పుడు పలు వెకేషన్స్ కి వెళ్తూ లైఫ్ ని , పార్ట్నర్ షిప్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2022 లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. ఆ పరిచయం కాస్త గత ఏడాది డిసెంబర్లో పెళ్లిగా మారింది. ఇక ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తున్నారు. చిన్నచిన్న ఫంక్షన్లలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.


తెలుగు నేర్పించమని నా భార్యను అడుగుతూ ఉంటాను – చైతూ..

తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట.. ఒకరి గురించి మరొకరు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ క్రమంలోనే నాగచైతన్య తన భార్య శోభిత గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. నాగచైతన్య మాట్లాడుతూ..” నేను చెన్నైలోనే బాల్యమంతా గడిపేయడం, ఉన్నత విద్యను అక్కడే పూర్తి చేయడం కారణంగా తమిళ్ ఎక్కువగా మాట్లాడడం అలవాటైపోయింది. బయటకు వెళ్తే ఇంగ్లీష్, తమిళ్లోనే ఎక్కువగా మాట్లాడతాను. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతాను. ఇక శోభిత తెలుగు ముందైతే నా భాష దేనికి పనికిరాదు. ఆమెకు తెలుగు చాలా బాగా వచ్చు. ఆమెను తెలుగు నేర్పించమని ఎప్పుడూ అడుగుతూ ఉంటాను.


నా భార్య చాలా తెలివైనది- చైతూ..

ముఖ్యంగా శోభిత చాలా తెలివైన అమ్మాయి. ఆ తెలివిని తనకు కూడా ఇవ్వమని అడుగుతూ ఉంటాను. ముఖ్యంగా నా భార్య ఫోటోలలో పెద్దగా నవ్వదు. ఎందుకలా ఉంటావు. అని అడిగితే..కాస్త నవ్వుతూ.. “నవ్వుతూ ఫోటోలు దిగవచ్చు. కానీ లోపల నేను నవ్వుతూనే ఉంటాను. మీరు ఎవరు దానిని చూడలేకపోతున్నారు”. అని నాతో చెబుతుంది. ఇక మా పెళ్లి తంతు మొత్తాన్ని ఆమె దగ్గరుండి మరీ ప్లాన్ చేసింది అంటూ భార్యపై ప్రశంసల కురిపిస్తూ కామెంట్స్ చేశారు అక్కినేని నాగచైతన్య. మొత్తానికైతే శోభిత గురించి ఆమె టాలెంట్ గురించి చెప్పడంతో అక్కినేని అభిమానులు కూడా కొత్త కోడలు చాలా తెలివైన అమ్మాయి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరికొంతమంది మన వైజాగ్ అమ్మాయి కదా ఆ మాత్రం తెలివి ఉండాల్సిందేలే అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి సినీ కెరియర్ విషయానికి వస్తే.. ఒకరి తర్వాత ఒకరు సినిమాలు ప్రకటిస్తున్నారు. అటు కెరియర్ పరంగా దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా శోభితకు టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో భారీ పాపులారిటీ ఉంది కాబట్టి అక్కడ ఈమెకు వరుసగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి తర్వాత కూడా వృత్తిని కొనసాగిస్తూ తమలోని ఫ్యాషన్ నిరూపించుకుంటుంది ఈ జంట.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×