BigTV English

OTT Movie : ఈ టెక్నాలజికి మతి పోవాల్సిందే …ఎవ్వరినీ వదిలి పెట్టదు … పది నిమిషాల్లో అల్లకల్లోలం

OTT Movie : ఈ టెక్నాలజికి మతి పోవాల్సిందే …ఎవ్వరినీ వదిలి పెట్టదు … పది నిమిషాల్లో అల్లకల్లోలం

OTT Movie : టెక్నాలజీ ఈరోజుల్లో ఊహకు అందని రీతిలో అభివృద్ధి చెందుతూ ఉంది. దీనివల్ల ఎంత మంచి జరుగుతుందో, కొన్ని లోపాలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ లో టెక్నాలజీ ఉపయోగించి నేరస్థుల్ని, రహస్యాలని చిటికలో కనిపెడతారు. వీటి ద్వారా వచ్చే లాభనష్టాలతో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ మూవీ పేరు ‘ది సర్కిల్’ (The Circle). ఈ 2017 లో వచ్చిన ఈ టెక్నో-థ్రిల్లర్ మూవీకి జేమ్స్ పోన్‌సోల్ట్ దర్శకత్వం వహించారు. ఇందులో ఎమ్మా వాట్సన్, టామ్ హాంక్స్, జాన్ బోయెగా, కరెన్ గిల్లాన్, ఎల్లార్ కోల్ట్రేన్, ప్యాటన్ ఓస్వాల్ట్, గ్లెన్ హెడ్లీ నటించారు. EuropaCorp ద్వారా ఏప్రిల్ 28, 2017న థియేటర్లలో విడుదలైంది. $18 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, ప్రపంచవ్యాప్తంగా $40.7 మిలియన్లు వసూలు చేసింది. ఇది దర్శకుడు పోన్‌సోల్ట్ కు అత్యధిక వసూళ్లు చేసిన ఫీచర్‌గా నిలిచింది.ఈ సినిమా ఒక శక్తివంతమైన టెక్ కంపెనీలో పనిచేసే ఒక యువతి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

మే హాలండ్ అనే యువతి ‘ది సర్కిల్’ అనే ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత ప్రభావవంతమైన టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తుంది. ఈ కంపెనీని ఈమాన్ బెయిలీ, టామ్ స్టెంటన్ నడుపుతారు. ఈ కంపెనీ సోషల్ మీడియా, డేటా సేకరణ, వ్యక్తిగత గోప్యతను ఒకే వేదికలో అనుసంధానం చేసే సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. మే ఈ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తుంది. కెరీర్‌లో ఈ అవకాశాన్ని ఒక పెద్ద విజయంగా భావిస్తుంది ఈ అమ్మాయి. ది సర్కిల్‌లో మే పని చేస్తూ ఉన్నప్పుడు, ఆమె కంపెనీ పారదర్శకత, సిద్ధాంతాలకు ఆకర్షితురాలవుతుంది. ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రజలు తమ జీవితాలను పూర్తిగా బహిరంగంగా ఉంచుకోవాలని, అది ప్రపంచాన్ని మారుస్తుందని నమ్ముతుంది. ఈ ఆలోచనను ప్రోత్సహించడానికి, ది సర్కిల్ సీచేంజ్ అనే కొత్త సాంకేతికతను మే పరిచయం చేస్తుంది.

ఇది చిన్న కెమెరాల ద్వారా ప్రతిదీ రికార్డ్ చేసి, ప్రతి ఒక్కరి జీవితాన్ని పర్యవేక్షించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అందరిలో చైతన్యం తెచ్చేందుకు మే తన జీవితాన్ని పూర్తిగా బహిరంగంగా ఉంచడానికి అంగీకరిస్తుంది. ఆమె ఏం చేసినా ప్రతి క్షణం కెమెరాల ద్వారా ప్రపంచానికి ప్రసారం అవుతుంది. అయితే, ఈ ప్రక్రియలో ఆమె తన వ్యక్తిగత సంబంధాలను కోల్పోతుంది. ఆమె తల్లిదండ్రులు ఏకాంతంగా ఉన్న వీడియో బయటకు వస్తుంది. ఆ తరువాత తన చిన్ననాటి స్నేహితున్ని కూడా కోల్పోతుంది. ఇలా జరగడంతో ఆమెకు ది సర్కిల్ కంపెనీ పై సందేహాలు కలుగుతాయి. మే ఒక ఉద్యోగి సహాయంతో కంపెనీ చీకటి రహస్యాలను కనుగొంటుంది. వీటి గురించి బయట ప్రపంచానికి చెప్పాలనుకుంటుంది. చివరికి మే అనుకున్నది సాధిస్తుందా ? అనే విషయం తెలుసుకోవాలని అనుకుంటే ‘ది సర్కిల్’ (The Circle) అనే ఈ మూవీని చూడండి.

 

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×