OTT Movie : హాలీవుడ్ ఫాంటసీ సినిమాలు ప్రేక్షకులను మరో ప్రపంచం లోకి తీసుకెళ్తాయి. ఈ సినిమాలను పిల్లలైతే కల్లార్పకుండా చూస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక థ్రిల్లర్ ఫాంటసీ మూవీలా ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడు బిజీగా ఉండడం వల్ల, వారి కొడుక్కి ఒక బేబీసిట్టర్ ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి మూవీ మరో లెవెల్ లో సాగుతూ ఉంటుంది. ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ఫ్లిక్స్ (Netflix) లో
ఈ హాలీవుడ్ ఫాంటసీ సైకాలజీకల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బేబీసిట్టర్’ (Baby sitter). 2017 లో వచ్చిన ఈ టీన్ బ్లాక్ కామెడీ మూవీకి McG దర్శకత్వం వహించగా, బ్రియాన్ డఫీల్డ్ రచించారు. ఇందులో సమారా వీవింగ్, జుడా లూయిస్, హనా మే లీ, రాబీ అమెల్, బెల్లా థోర్న్ నటించారు. ఇందులో భయం ఎక్కువగా ఉండే అబ్బాయి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ ఫాంటసీ సైకాలజీకల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
తల్లిదండ్రులు ఎప్పుడు బిజీగా ఉండటంతో, వీరి కుమారుడికి బేబీ సిట్టర్ ని ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రులు కూడా తనతో సమయం గడపకపోవడంతో, గోల్ ఒంటరిగా బాధపడుతుంటాడు. అతనిలో రోజు రోజుకూ భయం ఎక్కువగా ఉంటుంది. బేబీసిట్టర్ ఏర్పాటు చేస్తే భయం తగ్గుతుందని తల్లిదండ్రులు భావిస్తారు. ఈ క్రమంలోనే బి అనే అమ్మాయిని బేబి సిస్టర్ గా అపాయింట్ చేస్తారు. అయితే బేబీసిట్టర్ లు రాత్రిపూట పార్టీలు చేసుకుంటారని, గోల్ తో అతని గర్ల్ ఫ్రెండ్ చెప్తుంది. తాను పడుకున్న బి ఏం చేస్తుందో సైలెంట్ గా చూడాలనుకుంటాడు. బి అతనికి పాలు ఇచ్చి పడుకోబెడుతుంది. అయితే ఆ పాలు తాగకుండా గోల్ ఉంటాడు. అందులో బేబీసిట్టర్ మత్తుకలిపి ఉంటుంది. ఆ తరువాత గోల్ తనని రహస్యంగా చూసి షాక్ అవుతాడు. అనుకున్నట్టే బీ తన ఫ్రెండ్స్ ని తీసుకొని పార్టీ చేసుకుంటూ ఉంటుంది.
ఒక మిస్టరీ బుక్ తో మంత్రాన్ని చదువుతూ ఉంటుంది. వెంటనే అక్కడున్న ఒక మనిషిని కత్తితో పొడుస్తుంది బీ. అప్పుడు ఒక దయ్యం తనకి కావలసిన కోర్కెలు తీరుస్తుంది. ఇది చూసి బిత్తరపోతాడు గోల్. ఆ తర్వాత పేరెంట్స్ ఇంటికి తిరిగి వస్తారు. అయితే ఇల్లు ఎలా ఉందో, అలానే ఉంటుంది. గోల్ తల్లిదండ్రులతో జరిగిన విషయం చెప్తాడు. తల్లిదండ్రులు అతనికి మానసిక ప్రాబ్లం ఉందని అనుకుంటారు. చివరికి గోల్ విషయంలో ఇవన్నీ నిజంగానే జరిగి ఉంటాయా? అతని భయాలు తగ్గే మార్గం లేదా? బేబీసిట్టర్ తో గోల్ప్రయాణం ఎంతవరకు వెళ్తుంది. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బేబీసిట్టర్’ (Baby sitter) అనే ఈ ఫాంటసీ సైకాలజీకల్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.