BigTV English

OTT Movie : పేరుకు మాత్రమే పెళ్లి… భార్య ఒకరితో, భర్త మరొకరితో…

OTT Movie : పేరుకు మాత్రమే పెళ్లి… భార్య ఒకరితో, భర్త మరొకరితో…

OTT Movie : బాలీవుడ్ నుంచి డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయి. సౌత్ సినిమాలు బాలీవుడ్ కి పోటీ ఇస్తున్నా, బాలీవుడ్ నుంచి కూడా మంచి కంటెంట్ తో మూవీలు వస్తున్నాయి. బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక మూవీ మంచి టాక్ తెచ్చుకుని ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ఫ్లిక్స్ (Netflix)

2022లో విడుదలైన ఈ బాలీవుడ్ మూవీ పేరు ‘బదాయి దో‘ (Badhaai Do). జంగ్లీ పిక్చర్స్‌ బ్యానర్ పై వినీత్ జైన్ నిర్మించిన ఈ సినిమాకు, హర్షవర్దన్ కులకర్ణి దర్శకత్వం వహించాడు. రాజ్‌కుమార్ రావు, భూమి ఫెడ్నేకర్, సీమా పహ్వా, షీబా చ‌డ్డా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను 2022  ఫిబ్రవరి 11న విడుదల చేశారు. బదాయి దో 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి అవార్డులు అందుకుంది. లెస్బియన్ కథాంశంతో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

సుమన్ అనే అమ్మాయి పిటి టీచర్ గా పనిచేస్తుంది. 30 సంవత్సరాలు దాటి పోవడంతో ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లికి ఒత్తిడి చేస్తుంటారు. మరోవైపు సర్దన్ ది కూడా ఇదే పరిస్థితి. పోలీస్ ఆఫీసర్ గా ఉంటూ ఇతనికి కూడా పెళ్లి వయసు దాటి పోతూ ఉంటుంది. ఈ క్రమంలో సుమన్ ఆన్లైన్లో ఒక అమ్మాయి తో చాటింగ్ చేస్తుంది. కొద్దిరోజుల తర్వాత ఆ అమ్మాయిని కలవాలి అనుకుంటుంది. అయితే కలిసిన తర్వాత తను అమ్మాయి కాదు అబ్బాయి అని తెలుస్తుంది. అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి సుమన్ ని తనతో మాట్లాడాలని, లేకపోతే నువ్వు లెస్బియన్ అని అందరికీ చెప్తాను అని బెదిరిస్తాడు. ఈ విషయం పోలీస్ స్టేషన్ కి వెళ్లి సర్దన్ కి కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ చూసిన సర్దన్ ఒక ఉపాయం ఆలోచిస్తాడు. తను కూడా లెస్బియన్ కావడంతో ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుని, ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుదామని ఆమెతో చెప్తాడు. ఈ ఐడియా తనకి కూడా నచ్చడంతో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అయితే హనీమూన్ కి తన బాయ్ ఫ్రెండ్ కబీర్ ను తెచ్చుకొని, ఆనందంగా గడుపుతాడు సర్దన్. ఇది చూసి సుమన్ కూడా చాలా సంతోషిస్తుంది.

ఆ తర్వాత సుమన్ కి రిమ్ జిమ్ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరూ రిలేషన్ మొదలు పెట్టుకుంటారు. అయితే పెళ్లి జరిగి చాలాకాలం అవడంతో, పిల్లలు ఎందుకు పుట్టలేదని ఇంట్లో వాళ్ళు ప్రశ్నిస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అనుకుంటారు. కుటుంభ సభ్యుల ఒత్తిడితో వీళ్ళిద్దరూ ఒక బాబుని దత్తత తీసుకోవాలనుకుంటారు. పిల్లలు పుట్టే అవకాశం లేదని ఇంట్లో నమ్మించాలనుకుంటారు. ఆ తర్వాత రెండు కుటుంబాలలో, వీళ్ళు లెస్బియన్స్ అని తెలిసిపోతుంది. చివరికి సుమన్, సర్దన్ రిలేషన్ ఏమవుతుంది? వీళ్ళిద్దరూ దత్తత తీసుకోవడానికి కుటుంభ సభ్యులు ఒప్పుకుంటారా? వీరి లైఫ్ ఎటు వెళ్తుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘బదాయి దో’ (Badhaai Do) మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT: నేరుగా ఓటీటీలోకి రాబోతున్న కొత్త మూవీ.. అదిరిపోయే క్యాప్షన్!

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు .. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Netflix Top Movies: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 మూవీస్ ఇవే.. ట్రెండింగ్ లో ఆ మూవీ..!

OTT Movie : 1 గంట 54 నిమిషాల మిస్టరీ థ్రిల్లర్… రన్నింగ్ ట్రైన్ లో ఊహించని ట్విస్టులు… బుర్రకు పదును పెట్టే కథ

OTT Movie : ఒంటరి అమ్మాయిలతో జల్సా… ఒక్కొక్కరు ఒక్కోలా … క్లైమాక్స్ బాక్స్ బద్దలే

OTT Movie : వింత జంతువుతో అమ్మాయి సరసాలు… ఫ్రెండ్ తో కలిసి పాడు పని… ఇది అరాచకమే

OTT Movie : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా

OTT Movie : గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ… క్రిమినల్ కే సపోర్ట్… మతిపోగోట్టే ట్విస్టులున్న లీగల్ థ్రిల్లర్

Big Stories

×