BigTV English

OTT Movie : 2 ఓటీటీల్లోకి 105 కోట్ల రివేంజ్ డ్రామా… ఆ సీన్లు కూడా… ఒక్కో ట్విస్టుకు మైండ్ బ్లాక్

OTT Movie : 2 ఓటీటీల్లోకి 105 కోట్ల రివేంజ్ డ్రామా… ఆ సీన్లు కూడా… ఒక్కో ట్విస్టుకు మైండ్ బ్లాక్
Advertisement

OTT Movie : యాక్షన్ థ్రిల్లర్ అభిమానులకు ‘బద్లాపూర్’ సినిమా ఓటీటీలో హీట్ పుట్టిస్తోంది. వరుణ్ ధావన్, నవాజుద్దీన్ సిద్దిఖీ కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. షాకింగ్ ట్విస్ట్‌లు, రివేంజ్ తో అభిమానులను చూపు తిప్పుకోకుండా చేసిన ఈ సినిమా 2015 లో దాదాపు ఇరవై కోట్ల బడ్జెట్ తో 105 కోట్లు వసూలు చేసింది. 2016 స్టార్‌డస్ట్ అవార్డ్స్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గెలుచుకున్నాడు. వరుణ్ ధావన్ బెస్ట్ యాక్టర్ కు నామినేట్ అయ్యాడు. భార్యా పిల్లలను చంపిన ఒక కిల్లర్ ను అంతం చేసే దిశగా ఈ స్టోరీ నడుస్తుంది. మరి ఈ సినిమాకి సీక్వెల్ వస్తోందని మేకర్స్ ప్రకటించడంతో, ఈ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఓటీటీలో ‘బద్లాపూర్’ సినిమాపై ఓ లుక్ వేస్తునారు ప్రేక్షకులు. ఇది ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…


కథలోకి వెళ్తే

ముంబైలో రఘు ఒక సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. తన భార్య మిషా, కొడుకు రాబిన్‌తో సంతోషంగా ఉంటాడు. ఒక రోజు బ్యాంక్ దోపిడీలో మిషా, రాబిన్‌ను లియాకత్ అతని అనుచరుడు హర్మన్ హత్య చేస్తారు. ఈ సంఘటనతో రఘు దుఃఖంలో మునిగిపోతాడు. ప్రతీకారం కోసం బద్లాపూర్‌కు వెళ్తాడు. లియాకత్‌ను పట్టుకోవడానికి పోలీసులతో కలిసి పనిచేస్తాడు. ఈ క్రమంలో లియాకత్ అరెస్ట్ అవుతాడు, కానీ హర్మన్ తప్పించుకుంటాడు. లియాకత్‌ను జైలులో జీవితాన్ని గడుపుతాడు. 15 సంవత్సరాల తర్వాత, లియాకత్ జైలు నుండి విడుదలవుతాడు.  ఆ తరువాత కూడా రఘు అతన్ని వెంబడిస్తాడు. ఇప్పడు రివేంజ్ దాహాన్ని కసితీరా తీర్చుకోవాలనుకుంటాడు.


లియాకత్ గర్ల్‌ఫ్రెండ్ జిమ్మీ, హర్మన్ భార్య కోమల్ ను ఉపయోగించి, లియాకత్ జీవితాన్ని మరింత నాశనం చేస్తాడు. జిమ్మీని లియాకత్‌ను బాధపెట్టడానికి ఒక సాధనంగా రఘు వాడుకుంటాడు. కానీ జిమ్మీ రఘు ఇలా ఎందుకు చేస్తున్నాడో గ్రహిస్తుంది.లియాకత్ ఇప్పుడు రఘు ప్రతీకారానికి ఎదురుతిరుగుతాడు. ఇది ఒక థ్రిల్లింగ్ క్లైమాక్స్‌కు దారితీస్తుంది. రఘు, లియాకత్ మధ్య చివరి ముగింపు ఒక షాకింగ్ ట్విస్ట్‌తో హైలైట్ అవుతుంది. ఆతరువాత రఘు తన గతాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటో ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

‘బద్లాపూర్’ (Badlapur)  2015లో విడుదలైన యాక్షన్-థ్రిల్లర్ చిత్రం. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో వరుణ్ ధావన్ (రఘు), నవాజుద్దీన్ సిద్దిఖీ (లియాకత్), హుమా ఖురేషీ (జిమ్మీ), యామీ గౌతమ్ (మిషా), రాధికా ఆప్టే (కోమల్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2015 ఫిబ్రవరి 20న విడుదలై, IMDbలో 7.4/10 రేటింగ్‌ ను పొందింది. ప్రస్తుతం జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : హనీమూన్ లో కొత్త జంట… దెయ్యం ఎంట్రీతో గుండెల్లో గుబులు… క్లైమాక్స్ వరకు అరాచకమే గురూ

Related News

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×