OTT Movie : హారర్ సినిమాలను చూడటానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే వీటిని ఒంటరిగా చూడటానికి ధైర్యం చేయరు. అందులోనూ రాత్రిపూట అయితే ఇక అంతే సంగతులు. చూసే వాళ్ళకి, చూపించే వాళ్ళకి పై ప్రాణాలు పైకే పోతాయి. ఇందులో కొన్ని భయపెట్టే సన్నివేశాలకు కొందరికి అయితే ప్యాంట్లు కూడా తడిచిపోతాయి. అన్ని సినిమాలు అలా ఉండక పోయినా, కొన్ని సినిమాలు ఇలానే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ కూడా వణుకు పుట్టిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బ్యాగ్‌హెడ్’ (Baghead). 2023 లో వచ్చిన ఈ హారర్ మూవీకి ఆల్బెర్టో కొరెడోర్ దర్శకత్వం వహించారు. ఇందులో ఫ్రెయా అల్లాన్, పీటర్ ముల్లన్, జెరెమీ ఇర్విన్, రూబీ బార్కర్, ఆన్నే ముల్లర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా కథ ఐరిస్ లార్క్ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాను 2017 లో విడుదలైన ఒక షార్ట్ ఫిల్మ్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
ఐరిస్ లార్క్ అనే అమ్మాయి, తన తండ్రి ఓవెన్ లార్క్ మరణం తర్వాత బెర్లిన్‌లోని ఒక పబ్‌ను వారసత్వంగా పొందుతుంది. నిజానికి ఓవెన్ ఒక స్కాట్లాండ్ వ్యక్తి. అతను ‘ది క్వీన్స్ హెడ్’ అనే పబ్‌ను నడుపుతూ ఉంటాడు. ఈ పబ్‌లో ఒక రహస్యం దాగి ఉంటుంది. దాని బేస్‌మెంట్‌లో ‘బ్యాగ్‌హెడ్’ అనే ఒక వింత జీవి నివసిస్తుంది. ఇది ఆకారాలను మార్చగలదు. ఈ జీవి చనిపోయిన వారి రూపంలోకి మారి, వారితో రెండు నిమిషాల పాటు మాట్లాడే అవకాశాన్ని ఇస్తుంది. ఓవెన్ ఈ జీవిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. అతను బేస్‌మెంట్‌లోకి వెళ్లి, దానిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టబోతాడు. కానీ బ్యాగ్‌హెడ్ అతన్ని స్వయంగా కాల్చుకునేలా చేస్తుంది. దీనితో ఓవెన్ అక్కడికక్కడే మరణిస్తాడు. ఆ తర్వాత అతని కూతురు ఐరిస్ తన తండ్రి మరణం గురించి తెలుసుకుని, పబ్‌ను నడపడానికి బెర్లిన్‌కు వస్తుంది. ఆమె బెర్లిన్ కి వచ్చి పబ్ తో పాటు ఆ జీవికి కూడా సంరక్షకురాలిగా ఉంటుంది.
ఐరిస్‌కు తన తండ్రి చనిపోయే ముందు ఒక వీడియో వదిలిపెడతాడు. అందులో తనని బ్యాగ్‌హెడ్ గురించి హెచ్చరిస్తాడు. ఈ జీవి చనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలదని, కానీ రెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం మాట్లాడితే, అది బలపడి బేస్‌మెంట్ నుండి బయటకు రాగలదని అందులో ఉంటుంది. అయితే ఐరిస్ ఈ జీవిని ఉపయోగించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటుంది. ఆమె స్నేహితురాలు కేటీ కూడా ఐరిస్ తో చేరుతుంది. ఆ తరువాత నీల్ అనే వ్యక్తి చనిపోయిన తన భార్య సారాతో మాట్లాడాలని ఐరిస్ వద్దకు వస్తాడు. అతను బ్యాగ్‌హెడ్‌కు ఒక వస్తువును ఇచ్చి, ఆమెను సారాగా మార్చమని కోరతాడు. కానీ రెండు నిమిషాల నియమాన్ని ఉల్లంఘించడంతో, అక్కడ భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి. చివరికి బ్యాగ్‌హెడ్ వల్ల ఐరిస్ కు ప్రమాదం జరుగుతుందా ? దానికి ఆ శక్తి నిజంగానే ఉందా ?ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడండి.