BigTV English
Advertisement

OTT Movie : చూస్తుండగానే తుడిచి పెట్టేసే సునామీ… మిస్ అవ్వకుండా చూడాల్సిన సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : చూస్తుండగానే తుడిచి పెట్టేసే సునామీ… మిస్ అవ్వకుండా చూడాల్సిన సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : ఓటీటీలో హాలీవుడ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. యాక్షన్, హారర్, థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, సునామీలో చిక్కుకుపోయే కొంత మంది మనుషుల చుట్టూ తిరుగుతుంది. అక్కడ పెద్ద షార్క్ చేపలు వీళ్ళను వెంబడిస్తాయి. ఈ సినిమా చివరి వరకూ, టెన్షన్ తో చెమటలు పట్టిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ ఆస్ట్రేలియన్ హారర్ మూవీ పేరు ‘బైట్ 3డి’ (Bait 3D). 2012 లో వచ్చిన ఈ మూవీకి కింబుల్ రెండాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో షార్ని విన్సన్, జేవియర్ శామ్యూల్, ఫోబీ టోంకిన్, జూలియన్ మెక్‌ మహాన్ వంటి నటులు నటించారు. ఈ సినిమా స్టోరీ ఒక సముద్రతీర పట్టణంలో జరుగుతుంది. అక్కడ ఒక సునామీ వల్ల ఒక గ్రాసరీ స్టోర్‌ లో, కొన్ని షార్క్ లు అక్కడ ఉన్నవారిని వెంబడిస్తాయి. ఇది ఆస్ట్రేలియాలో తెరకెక్కిన మొదటి 3D సినిమా. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

జోష్ అనే వ్యక్తి సముద్ర తీరంలో లైఫ్‌ గార్డ్‌ గా జాబ్ చేస్తుంటాడు. అతనికి రోరీ అనే స్నేహితుడు ఉంటాడు. తన సోదరి టీనాను పెళ్లి చేసుకోమని జోష్ ని అడుగుతాడు. ఈ క్రమంలో ఒక పెద్ద వైట్ షార్క్ దాడిలో రోరీ చనిపోతాడు. ఈ ఘటన జోష్‌ ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అతను లైఫ్‌ గార్డ్ ఉద్యోగాన్ని వదిలేసి, ఒక గ్రాసరీ స్టోర్‌ లో పని చేయడం మొదలు పెడతాడు. ఒక రోజు టీనా తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌ తో, జోష్‌ పని చేసే స్టోర్‌ కి వస్తుంది. అదే సమయంలో ఇద్దరు దొంగలు స్టోర్‌ ని దోచేందుకు ప్రయత్నిస్తారు. ఈ సందర్భంలో ఒక భారీ సునామీ ఆ పట్టణాన్ని తాకుతుంది. దీని వల్ల జోష్ పని చేసే స్టోర్‌ నీటితో నిండిపోతుంది. ఈ సునామీతో పాటు 12-అడుగుల పెద్ద వైట్ షార్క్‌ లు కూడా స్టోర్‌ లోకి వస్తాయి.

Read Also : బ్లడ్ బాయిల్ అయ్యేలా చేసే రివేంజ్ డ్రామా… తెలుగులో ఏ ఓటీటీలో ఉందంటే?

స్టోర్‌లో చిక్కుకున్న వారిలో జోష్, టీనాతో పాటు మరికొంత మంది ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు బయట పడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, షార్క్‌ లు ఒక్కొక్కరినీ వేటాడతాయి. స్టోర్‌ లోని ఒక విద్యుత్ వైర్ విరిగిపోవడంతో వారందరూ కరెంట్ షాక్ కు గురయ్యే ప్రమాదం వస్తుంది. అక్కడ కొంతమంది పవర్ ఆఫ్ చేయడానికి వెళతారు. అయితే షార్క్ దాడిలో తీవ్రంగా గాయపడతారు. చివరికి వీళ్ళంతా ఆ రాకాసి షార్క్ ల నుంచి తప్పించుకుంటారా ? జోష్ టీనా ను కాపాడతాడా ? అ స్టోర్ లో ఎటువంటి సంఘటనలు జరుగుతాయి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×