BigTV English

OTT Movie : అమ్మ బాబోయ్… వీడు పిల్లాడు కాదు కిల్లర్… నెవర్ బిఫోర్ సైకో థ్రిల్లర్

OTT Movie : అమ్మ బాబోయ్… వీడు పిల్లాడు కాదు కిల్లర్… నెవర్ బిఫోర్ సైకో థ్రిల్లర్

OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చివరివరకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితిలో స్టోరీ నడుస్తుంటుంది. ఇప్పుడు మనము చెప్పుకోబోయే బాలీవుడ్ సినిమా లో ఒక మధ్యతరగతి కుటుంబం లో జరిగే మిస్టరీ హత్యల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ 89 నిమిషాల సినిమా సస్పెన్స్, ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకుంటుంది. రియల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా హార్ట్ బీట్ ని పెంచుతుంది. ఈ సినిమాపేరు ? స్టోరీ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


జీ 5లో స్ట్రీమింగ్

‘బరోట్ హౌస్’ (Barot House) హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. బగ్స్ భార్గవ డైరెక్షన్‌లో, అమిత్ సద్ (అమిత్ బరోట్), మంజరి ఫడ్నిస్ (భావన బరోట్), ఆర్యన్ మెంగ్జీ (మల్హార్) ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా 2019 ఆగస్ట్ 7న ZEE5లో రిలీజ్ అయ్యింది. హిందీ, తమిళ డబ్బింగ్‌తో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. IMDb లో 7.2/10 రేటింగ్ ను పొందింది. ఈ సినిమా 2020 ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిల్మ్, అమిత్ సద్‌కి బెస్ట్ యాక్టర్ నామినేషన్స్ పొందింది. ET బ్రాండ్ ఈక్విటీ స్పాట్ అవార్డ్స్ 2020లో బెస్ట్ ఓటీటీ లాంగ్ ఫార్మాట్ ఫిల్మ్‌ బ్రాంజ్ అవార్డ్ గెలుచుకుంది.


స్టోరీలోకి వెళ్తే

అమిత్ బరోట్ తన భార్య భావన, తల్లి, నలుగురు పిల్లలు—మల్హార్ (ఆర్యన్ మెంగ్జీ), శ్రేయ, శ్రుతి, స్నేహలతో డామన్‌లోని ప్రశాంతంగా ఉండే బరోట్ హౌస్‌లో నివసిస్తుంటాడు. పుట్టిన రోజు వేడుకలో శ్రేయ మాయమవుతుంది. మరుసటి రోజు ఆమె శవం స్మశానంలో దొరుకుతుంది. పోలీసులు అమిత్ తమ్ముడు అజయ్, పొరుగువాడు ఆంథోనీపై అనుమానిస్తారు. త్వరలోనే రెండో కూతురు శ్రుతి కూడా చనిపోతుంది. అమిత్, భావన మానసికంగా కుంగిపోతారు. పోలీసులు మాత్రం అజయ్‌ని మళ్లీ అనుమానిస్తారు. అయితే అమిత్ తన కొడుకు మల్హార్‌పై అనుమానం వస్తుంది. ఎందుకంటే మల్హార్ తన చిన్న చెల్లి స్నేహను ఆడుతూ నీళ్ళల్లో ముంచబోయాడు. అమిత్ కోపంతో మల్హార్‌ని ప్రశ్నిస్తే, అతను హత్యలు చేశానని ఒప్పుకుంటాడు. ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ లోకి వెళ్తాడు అమిత్.

ఈ సమయంలో ఆంథోనీ కొడుకు రోషన్ కూడా హత్యకు గురవుతాడు. అమిత్ మల్హార్‌ని రక్షించడానికి తానే నేరం చేశానని చెప్తాడు. కానీ పోలీసులు మల్హార్‌ని జువెనైల్ హోమ్‌కి పంపుతారు. సైకాలజిస్ట్ మల్హార్‌ని పరిశీలిస్తే, అతని వీపుపై గాయాలు, డస్ట్‌బిన్‌లో అమిత్ హత్యలు చేస్తున్న డ్రాయింగ్స్ కనిపిస్తాయి. మల్హార్ తన తండ్రిని రక్షించడానికి నటిస్తున్నాడని పోలీసులకు అనుమానం వస్తుంది. భావన, ఆంథోనీ మధ్య అఫైర్ అనుమానం, అమిత్ శ్రేయ, శ్రుతిని ఆంథోనీ పిల్లలుగా భావించాడని బయటపడుతుంది. అమిత్‌ని అరెస్ట్ చేస్తారు, మల్హార్‌ని విడుదల చేస్తారు. కానీ మల్హార్ స్నేహను బావిలో పడేయడం భావన చూస్తుంది. చివర్లో అమిత్ జైలు నుంచి విడుదలవుతాడు. మల్హార్ మళ్లీ అరెస్ట్ అవుతాడు. అమిత్, భావన మరో ముగ్గురు అమ్మాయిలను దత్తత తీసుకొని, బరోట్ హౌస్‌ని వదిలేస్తారు. మల్హార్‌కి మానసిక సమస్య ఉందని సైకాలజిస్ట్ లు అనుమానిస్తారు. కానీ అతని హత్యల వెనక కారణం రహస్యంగానే మిగిలిపోతుంది.

Read Also : పెళ్ళైన నెలకే భర్త మృతి… అర్ధరాత్రి అలాంటి అమ్మాయి ఇంటికి అనామకుడు… ఫీల్ గుడ్ తమిళ మూవీ

Related News

HHVM OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన హరిహర వీరమల్లు… ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : శవంపై కోరిక… ఏకంగా బాయ్ ఫ్రెండ్ ముందే దాంతో ఆ పని… ఇదెక్కడి దిక్కుమాలిన సినిమా మావా

OTT Movie : చచ్చే ముందు ఇదేం పిచ్చి కోరిక మావా ? అక్కడక్కడా ఆ సీన్స్ కూడా… ఊహించని క్లైమాక్స్

OTT Movie : ట్రైన్ లో 59 మంది సజీవ దహనం… చరిత్ర దాచిన నిజాలు ఈ సిరీస్ లో బట్టబయలు… ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

×