OTT Movie : కామెడీ జానర్లో తెరకెక్కే హారర్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఈ సినిమా అంతా ఒక ఆత్మ చుట్టూ తిరుగుతుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సరదాగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే ..
జీ 5 (ZEE5)లో
ఈ తమిళ హారర్ కామెడీ మూవీ పేరు ‘బయమా ఇరుక్కు'(Bayama Irukku). 2017లో విడుదలైన ఈ మూవీకి జవహర్ దర్శకత్వం వహించారు. ఇది థాయ్ సినిమా ‘పీ మాక్’ (Pee Mak)కు రీమేక్ గా రూపొందింది. ఇందులో సంతోష్ ప్రతాప్, రేష్మి మీనన్ ప్రధాన పాత్రల్లో నటించగా, కోవై సరళ, రాజేంద్రన్, భరణి, జగన్, లొల్లు సభా జీవా సహాయక పాత్రల్లో నటించారు. సి. సత్య సంగీతం సమకూర్చగా, మహేంద్రన్ ఎడిటింగ్ చేశారు. ఈ సినిమా 2015 లో పూర్తయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల 2017 సెప్టెంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ జీ 5 (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
జై తన గర్భిణీ భార్య లేఖను ఒక పట్టణంలో వదిలి, ఆమె తల్లిదండ్రులను వెతకడానికి శ్రీలంకకు వెళ్తాడు. అక్కడ ఒక దాడిలో రాజ్, అజిత్, మణి, శివలను రక్షిస్తాడు. వారు అతనికి మంచి స్నేహితులుగా ఉంటారు. ఇంతలో ఇంట్లో లేఖ ఒంటరిగా ప్రసవ వేదనలతో సహాయం కోసం అరుస్తుంది. కానీ శక్తి లేకపోవడంతో, ఆమె అరుపులు ఎవరికీ వినపడవు. ఇక జై తన స్నేహితులను తన ఇంటికి తీసుకొస్తాడు. అక్కడ లేఖ ఇప్పటికే ఒక బిడ్డను కని, వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అయితే స్నేహితులు త్వరలోనే లేఖ చనిపోయి, ఆమె ఆత్మగా ఇంట్లో ఉందని గ్రహిస్తారు. కానీ జైకి ఆమె ఇంకా బతికే ఉందని నమ్మకం ఉంటుంది. ఈ విషయం తెలిసిన స్నేహితులు జైని ఆమె ఆత్మ నుండి రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఆ ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి.
Read Also : వీడి కష్టాలు పగవాడికి కూడా రావొద్దు సామీ… మస్ట్ వాచ్ ఐఎండీబీ లో రేటింగ్ 9
లేఖ నిజంగానే ఆత్మ అని తెలుసుకోవడానికి ఎక్కువ టైమ్ పట్టదు. ఆమె భయంకర రూపంలో కనిపించి, జై స్నేహితులపై దాడి చేస్తుంది. వాళ్ళు ఆ ఇంటి నుంచి పారిపోయి, ఒక ఆలయంలోకి రక్షణ కోసం వెళతారు. అక్కడ ఒక సన్యాసి వీళ్ళను కాపాడటానికి ప్రయత్నిస్తుంది. పవిత్ర బియ్యం, జలం సహాయంతో ఆత్మను ఎదుర్కొంటారు. ఈ క్రమంలో వారు జైని లేఖ ఆత్మ నుండి రక్షించడానికి ఒక మంత్రగత్తె సహాయం కూడా తీసుకుంటారు. చివరికి లేఖ ఆత్మను వీళ్ళు బంధిస్తారా ? లేఖ ఆత్మ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.