E-Paper
Advertisement

YouTube Musicలో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి.. ప్లేలిస్ట్ మజా డబుల్!

YouTube Musicలో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి.. ప్లేలిస్ట్ మజా డబుల్!
Advertisement

YouTube Music: మీకు నచ్చిన పాటలతో ఒక మంచి ప్లేలిస్ట్ తయారు చేసుకున్న తర్వాత, చివరి పాట పూర్తవగానే మరో పాట ఆటోమేటిక్‌గా మొదలైతే ఎలా ఉంటుంది? ముఖ్యంగా మనం సెట్ చేసుకున్న మూడ్‌కు అసలు సంబంధం లేని పాట వస్తే చిరాకు తప్పదు. YouTube Musicలోని Autoplay ఫీచర్ వల్ల చాలామందికి ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. అయితే దీన్ని సులభంగా ఆఫ్ చేయొచ్చు.

ఫోన్‌లో ఆఫ్ చేయడమెలా?

ముందుగా యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో ఏదైనా పాట లేదా ప్లేలిస్ట్ ప్లే చేయండి. స్క్రీన్ కింద కనిపించే ప్లేయర్‌పై ట్యాప్ చేసి Now Playing స్క్రీన్‌ను తెరవాలి. అక్కడ పైకి స్వైప్ చేసి Up Next క్యూలోకి వెళ్లి, కిందివరకు స్క్రోల్ చేస్తే ఆటోప్లే టోగుల్ కనిపిస్తుంది. దాన్ని ఆఫ్ చేస్తే చాలు.

Advertisement

Also Read: మూడు సార్లు మడతపెట్టే ఫోన్.. Huawei Mate XT 2లో ఇవన్నీ ఉంటాయా?

డెస్క్‌టాప్‌లోనూ ఇదే విధానం..

బ్రౌజర్‌లో YouTube Music ఓపెన్ చేసి, కింద ఉన్న మీడియా ప్లేయర్‌ను విస్తరించాలి. Up Next ట్యాబ్‌లోకి వెళ్లిన తర్వాత క్యూలో పైనే Autoplay స్విచ్ కనిపిస్తుంది. దాన్ని ఆఫ్ చేస్తే ప్లేలిస్ట్ ముగిసిన తర్వాత మ్యూజిక్ ఆటోమేటిక్‌గా కొనసాగదు. కొత్త ఆర్టిస్టుల పాటలు వినాలకుంటున్న వారికి ఆటోప్లే ఉపయోగపడుతుంది. యూట్యూబ్ మ్యూజిక్ మనం వినే అలవాట్ల ఆధారంగా కొత్త ట్రాక్‌లను సూచించగలదు.

డీప్ కట్స్ ఎందుకు ప్రత్యేకం?

Advertisement

ఒకవేళ ఆటోప్లే ఆన్‌లో ఉండాలి అనుకుంటే Up Nextలో కనిపించే Familiar, Popular, Discover, Deep cuts వంటి ఫిల్టర్లను ఉపయోగించవచ్చు. వీటితో మనకు కావాల్సిన రకం పాటలను ఎంచుకోవడం సులభమవుతుంది. Deep Cuts ఎంపిక చేస్తే ఎక్కువగా వినిపించే హిట్ పాటల కంటే ఆర్టిస్టుల అరుదైన, తక్కువగా తెలిసిన పాటలు వినిపిస్తాయి. కొత్త మ్యూజిక్‌ను ఆస్వాదించాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.

Also Read: Poco F9 Ultraపై భారీ అంచనాలు.. కొత్త చిప్‌సెట్, ప్రీమియం డిజైన్‌తో ఎంట్రీ!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×