OTT Movie : సస్పెన్స్ తో బుర్ర బద్దలయ్యే ఒక సైకలాజికల్ హారర్ సినిమాను చుడాలనుకుంటే, ఓటీటీలో ఫ్రీగానే అందుబాటులోఉంది. ఇది ఒక రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ. అతను తన గతంలోని ఒక ట్రాజెడీని డీల్ చేస్తూ, భయంకరమైన సంఘటనలను ఎదుర్కొంటాడు. ఈ తమిళ స్టోరీ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా, ఉత్కంఠభరితంగా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
యూట్యూబ్ లో స్ట్రీమింగ్
‘బిగినింగ్’ (Beginning) ఒక తమిళ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఆనంద్ ఈకర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో వినీత్ శ్రీనివాసన్, సురాజ్ వెంజరమూడు, గౌరీ కిషన్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 24న థియేటర్ లలో విడుదలై, ప్రస్తుతం ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లలో స్ట్రీమింగ్ అవుతోంది. 128 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 8.3 /10 స్కోర్ పొందింది.
కథలోకి వెళ్తే
ఈ స్టోరి జోసఫ్ అనే రిటైర్డ్ పోలీసు ఆఫీసర్‌తో మొదలవుతుంది. అతను కేరళలోని ఒక మారుమూల గ్రామంలో ఉంటూ, తన గతంలో జరిగిన ఒక ట్రాజెడీతో బాధపడుతుంటాడు. జోసఫ్ తన కెరీర్‌లో ఒక హత్య కేసుని సాల్వ్ చేయలేకపోయాడు, అది అతన్ని మానసికంగా ఇంకా వెంటాడుతుంది. ఇలా ఉంటే ఆ ఊరిలో కొత్తగా వచ్చిన వినోద్ అనే ఒక యువకుడు, అతని జీవితంలోకి వస్తాడు. వినోద్‌కి కూడా తన గతంలో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. అవి జోసఫ్‌తో కనెక్ట్ అవుతాయి. ఆ ఊరిలో ఒక రాత్రి విచిత్రమైన సంఘటనలు మొదలవుతాయి. ఇంట్లో వింత శబ్దాలు, ఎవరో తిరుగుతున్నట్టు అనిపించడం వంటివి జరుగుతాయి. ఆ తర్వాత ఒక లేడీ శవం కనిపిస్తుంది. జోసఫ్ ఈ కేసుని తన గత ట్రాజెడీతో లింక్ చేసి, వినోద్ సహాయంతో దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ ఇన్వెస్టిగేషన్‌లో వినోద్ గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయటపడతాయి. ఇవి జోసఫ్‌ని మరింత కన్‌ఫ్యూజన్‌లో పడేస్తాయి.
Read Also : పౌర్ణమి వచ్చిందంటే పరుగో పరుగు… నవ వధువులు మిస్సింగ్… ఊర్లో జనాల్ని హడలెత్తించే బ్లాక్ మ్యాజిక్