Paradha Movie : టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. ట్రెడిషనల్ లుక్ లో ఈమె నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఈ మధ్య ఈమె గ్లామర్ గేట్లు ఎత్తేసింది. గత ఏడాది రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ మూవీ… బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఈ మూవీతో ఒక్కసారిగా గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత ఎలాంటి మూవీలో నటిస్తుందో అని అందరూ అనుకున్నారు. కానీ ఈమె ప్రస్తుతం పరదా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది.. ఈ సినిమా ఈనెల 22న థియేటర్లలోకి రాబోతుంది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఓటీటీ హక్కుల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. మరి ఈ మూవీ ఓటీటీ వివరాలను ఒకసారి చూస్తే..
‘పరదా ‘ ఓటీటీ..
అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పరదా.. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రం రేపు శుక్రవారం థియేటర్లలోకి రాబోతుంది. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేయగా సోషల్ డ్రామా చిత్రంగా రూపొందిస్తున్న ‘పరదా’ ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ హక్కుల గురించి ఓ న్యూస్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి.. సినిమా టాక్ ని బట్టి ఈ సినిమా 4 లేదా 8 వారాలలో ఓటీటీలోకి రాబోతుంది.
Also Read: ఒక్కరోజుకు సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్.. వంటలక్కకు పోటీగా నటిగా..!
‘పరదా’ మూవీ స్టోరీ..
గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో అనుపమ నటించబోతున్నట్లు ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. ఇందులో ఈమె సుబ్బు’ అనే ఓ పల్లెటూరి అమ్మాయి చుట్టూ ఈ ‘పరదా’ స్టోరీ ఉండబోతుంది.. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఊరిలో కఠినమైన కట్టుబాట్లు, మగవారికి మాత్రమే ఉండే వెసులుబాట్లు నుంచి విసిగిపోయిన ఓ అమ్మాయి ఇద్దరు అపరిచితులతో కలిసి ట్రిప్ కు వెళ్తుంది. అక్కడ ఆమె అదృశ్యం అవుతుంది. ఆ తర్వాత ఊరిలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. మరి ఆమె ఎలా బయటపడ్డది..? ఊరిలో సమస్యలకు కారణం ఏంటి అనేది ఈ స్టోరీలో చూడవచ్చు. ఆసక్తికరమైన స్టోరీ తో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. మరి సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో రేపు చూడాల్సిందే.. ఇప్పటికే ఈ మూవీకి వివాదాలు చుట్టుముట్టాయి. అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాపై వ్యతిరేకత మొదలైంది కూడా. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని రేపు గ్రాండ్గా థియేటర్లలోకి రాబోతుంది. ఇది హిట్ అయితే అనుపమ కథలో మరో హిట్ పడినట్లే.. చూద్దాం ఏం జరుగుతుందో..