OTT Movie : ఓటీటీలోకి ఒక సరికొత్త వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్‌ను విడుదల చేయడంతో ఈ సిరీస్ హైప్ సృష్టించింది. 1998 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్, బ్లాక్ మ్యాజిక్, అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీతో ఒక చిల్లింగ్ థ్రిల్లర్ ని అందిస్తోంది. వర్ష బొల్లమ్మ నటన, రాజీవ్ కనకాల సపోర్టింగ్ పాత్రతో ఈ సిరీస్ దూసుకుపోతోంది. ఈ సిరీస్ కథ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
1998లో శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లె గ్రామంలో ఈ కథ జరుగుతుంది. కనకమహాలక్ష్మి అలియాస్ కనకం తన గ్రామంలో మొదటి మహిళా కానిస్టేబుల్‌గా, రేపల్లెలోని ఒక చిన్న పోలీస్ స్టేషన్‌లో చేరుతుంది. ఈ గ్రామంలో యువతులు మాయమవుతున్న సంఘటనలు జరుగుతుంటాయి. ఇక్కడ సమీపంలోని అడవి గుట్టకు వెళ్లడం నిషేధించబడింది. ఈసమయంలో కనకం, హెడ్ కానిస్టేబుల్ సాంబశివ రావు ఇంట్లో ఉంటూ, సీనియర్ కానిస్టేబుల్ సత్తిబాబు నుండి శత్రుత్వాన్ని ఎదుర్కొంటుంది. మరోవైపు గ్రామంలో ఒకపక్క జాతర జరుగుతుంటే, కనకం స్నేహితురాలు చంద్రిక మిస్సింగ్ అవుతుంది. ఒక వ్యక్తి హత్యకు గురవుతాడు. ఈ సంఘటనలు కనకంను ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రేరేపిస్తాయి, అయినప్పటికీ ఆమె సహోద్యోగుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది.
Read Also : ప్రైవేట్ ఐలాండ్ లో అరాచకం… అమ్మాయిలకే తెలియకుండా ఆ పని… మైండ్ బెండయ్యే ట్విస్టులు
కనకం దర్యాప్తు అడవి గుట్ట వద్ద మొదలవుతుంది. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్, గ్రామంలోని పెద్దలు దాచిన సీక్రెట్స్ బయటపడతాయి. పంచాయతీ అధ్యక్షుడు ప్రకాష్ రావు, సబ్-ఇన్‌స్పెక్టర్ సదాశివం కథలో కీలక పాత్రలు పోషిస్తారు. వాళ్ళ పర్సనల్ సీక్రెట్స్ ఈ కేసును మరింత సంక్లిష్టం చేస్తాయి. చంద్రిక తండ్రి, గ్రామస్థుల మధ్య ఉన్న భయం, మూఢనమ్మకాలు కనకం దర్యాప్తును అడ్డుకుంటాయి. కనకం తన గతంలోని ఒక బాధాకరమైన సంఘటనను ఎదుర్కొంటూ, బ్లాక్ మ్యాజిక్ వెనుక ఉన్న విలన్‌ను కనిపెడుతుంది. క్లైమాక్స్‌లో ఒక షాకింగ్ ట్విస్ట్ తో గ్రామంలోని అతిపెద్ద రహస్యం బయటపెడుతుంది. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతున్నారు ? కనకం దర్యాప్తు ఎలా సాగుతుంది ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే
‘కానిస్టేబుల్ కనకం’ (Constable kanakam) అనేది ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో నడిచే ఒక తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ప్రశాంత్ కుమార్ దిమ్మల దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, రాజీవ్ కనకాల, మేఘ లేఖ, శ్రీనివాస్ అవసరాల, రమణ భార్గవ, ప్రేమ్ సాగర్ వంటి నటులు నటించారు. ఆరు ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్, 2025 ఆగస్టు 14న ETV విన్‌లో విడుదలై, IMDbలో 7.5/10 రేటింగ్ సాధించింది.