OTT Movie : దెయ్యాల సినిమాలు అన్ని భాషల్లో వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ జానర్ సినిమాలకు ఏమాత్రం క్రేజ్ తగ్గట్లేదు. ముఖ్యంగా ఇండోనేషియన్ హారర్-థ్రిల్లర్ సినిమాలకు అస్సలు తగ్గట్లేదు. ఇక్కడి నుంచి వచ్చే దెయ్యాల సినిమాలను చుస్తే గూస్ బంప్స్ వస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో ఖంజాబ్ అనే దుష్ట శక్తి, నమాజు సమయంలో ఒక అమ్మాయిని భయపెడుతుంటుంది. ఈ సీన్స్ చూడాలంటే గుండె గట్టిగా ఉండాల్సిందే. ఈ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
ఈ కథ 1998లో ఇండోనేషియాలోని బన్యువాంగీలో జరిగిన డుకున్ సంతెట్ (మంత్రగాళ్ల ఊచకోత) ఘటనల నేపథ్యంలో జరుగుతుంది. ఇక్కడ అనేక మంది మంత్రగాళ్లను నింజాలు హత్య చేశారని ఆరోపణలు వస్తాయి. రహాయు అనే ఒక యువతి, తన తండ్రిని నింజాలు శిరచ్ఛేదం చేయడం స్వయంగా చూస్తుంది. ఈ దారుణ ఘటన రహాయును తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. ఆమె నమాజు సమయంలో ఏకాగ్రతను కోల్పోతుంది. ఈ సమయంలో ఖంజాబ్ (నమాజు సమయంలో ఏకాగ్రతను భంగపరిచే జిన్) అనే దుష్ట శక్తి, ఆమెను భయపెట్టడం ద్వారా ఆమె నమాజ్ ను అడ్డుకుంటుంది. ఆమె భయపడి తన సవతి తల్లి నూనింగ్, చెల్లెలు రిరితో కలిసి, బన్యువాంగీని విడిచి తన సొంత గ్రామం జెటిస్‌కు తిరిగి వస్తుంది. అయితే జెటిస్‌లో ఈ కుటుంబం మంత్రగాళ్ల కుటుంబంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీనివల్ల వీళ్ళు సామాజికంగా ఒంటరిగా మారతారు.
ఈ ఒంటరితనం రహాయు మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. అంతేకాకుండా ఆమె నమాజు చేస్తున్న సమయంలో, అక్కడ కూడా ఖంజాబ్ రూపంలో ఆత్మలు వేధిస్తాయి. అయితే ఈ ఆత్మ రహాయు తండ్రిదని సూచనలు వస్తాయి. ఇది ఆమెను, ఆమె శత్రువులను (ముఖ్యంగా స్థానిక మార్కెట్‌లోని వ్యక్తులను) వేధిస్తుంది. రహాయు తన ఆధ్యాత్మిక శాంతిని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఖంజాబ్ ఆమెను నిరంతరం భయపెడుతుంటుంది. ఈ క్లైమాక్స్ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. రహాయుని ఖంజాబ్ ఎందుకు వేధిస్తోంది ? ఆమె తండ్రి ఆత్మగా ఎందుకు వచ్చాడు ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను, ఈ ఇండోనేషియన్ హారర్-థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
‘ఖంజాబ్’ (Khanzab) అంగ్గీ ఉంబార దర్శకత్వంలో విడుదలైన ఇండోనేషియన్ హారర్-థ్రిల్లర్ చిత్రం. ఇది డీ కంపెనీ ద్వారా నిర్మించబడింది. ఈ చిత్రంలో యసమిన్ జసెమ్ (రహాయు), టికా బ్రవాణి (నునింగ్), ఆర్స్‌వెండీ బెనింగ్ స్వర (పాక్ సెంటాట్), రిజ్కీ హంగోనో (సెమెడి) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1998లో ఇండోనేషియాలోని బన్యువాంగీలో జరిగిన మంత్రగాళ్ల ఊచకోత ఘటనల నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రం 2023 ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైంది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : ఇంత కరువులో ఉన్నారేంట్రా ? అబ్బాయి అని కూడా చూడకుండా ఆ పాడు పని… పెద్దలకు మాత్రమే