E-Paper
Advertisement

వయసు పైబడిన తండ్రికి తల్లిగా మారిన కూతురు… బాధ్యతలు, భావోద్వేగాల మధ్య నలిగిపోయిన ఆడబిడ్డ కథ

వయసు పైబడిన తండ్రికి తల్లిగా మారిన కూతురు… బాధ్యతలు, భావోద్వేగాల మధ్య నలిగిపోయిన ఆడబిడ్డ కథ
Advertisement

Bengali Family Drama on OTT: ఇటీవల ఓటీటీలో హృదయాన్ని కదిలించే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలకు ఆదరణ బాగా పెరుగుతోంది. ఈ క్రమంలో థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న బెంగాలీ మూవీ ‘హాతీ హాతీ పా పా’ (Haati Haati Paa Paa) ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌లో అలరిస్తోంది. బెంగాలీ స్టార్ హీరోయిన్ రుక్మిణి మైత్ర, సీనియర్ నటుడు చిరంజీత్ చక్రవర్తి తండ్రీకూతుళ్లుగా నటించిన ఈ సినిమా, ఓటీటీలో విడుదలైనప్పటి నుంచే కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. వయసు పైబడిన తండ్రికి తల్లిలా మారి సేవ చేసే ఒక కూతురి భావోద్వేగ ప్రయాణమే ఈ సినిమా ప్రధాన ఆకర్షణ. ఈ హార్ట్ టచింగ్ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది, అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళ్తే…

దీపక్ చక్రవర్తి (చిరంజీత్ చక్రవర్తి) భార్యను కోల్పోయిన తర్వాత తన కూతురు మధుర (రుక్మిణి మైత్ర)తో కలిసి జీవిస్తుంటాడు. స్వతంత్ర భావాలు కలిగిన మధుర ఉద్యోగం చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూనే తండ్రి బాగోగులను చూసుకుంటుంది. ఆయన ఒంటరితనాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. తండ్రికి ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తూ, ఆయనకు తోడుగా నిలుస్తుంది. వీరిద్దరి మధ్య చిన్నచిన్న సరదా గొడవలు, అలకలు ఉన్నప్పటికీ ఒకరిపై మరొకరికి అపారమైన ప్రేమ ఉంటుంది.

Advertisement

అయితే తండ్రి వయసు పెరుగుతున్న కొద్దీ మధుర బాధ్యతలు కూడా పెరుగుతాయి. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితం, భవిష్యత్తు గురించి కూడా ఆమె ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కూతురు తన కోసమే జీవితాన్ని అంకితం చేసుకుంటుందేమోనని దీపక్ ఆందోళన చెందుతుంటాడు. ఆమెకు తనకంటూ ఓ కుటుంబం, సంతోషకరమైన జీవితం ఉండాలని కోరుకుంటాడు. కానీ తండ్రిని ఒంటరిగా వదిలి వెళ్లడం మధురకు అంత సులభం కాదు.

ఈ క్రమంలో తండ్రీకూతుళ్ల మధ్య చోటుచేసుకునే భావోద్వేగాలు, చిన్నచిన్న మనస్పర్థలు వారి బంధానికి కొత్త పరీక్ష పెడతాయి. ఒకవైపు తండ్రి పట్ల బాధ్యత.. మరోవైపు తన జీవితంపై ఆశలు.. ఈ రెండింటి మధ్య మధుర ఎలాంటి నిర్ణయం తీసుకుంది? కూతురి భవిష్యత్తు కోసం దీపక్ ఏం చేశాడు? వారి మధ్య ఉన్న అనుబంధం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది? అనేదే ఈ సినిమా కథ. ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.

జీ5లో స్ట్రీమింగ్

Advertisement

‘హాతీ హాతీ పా పా’ సినిమాలో మధురగా రుక్మిణి మైత్ర, దీపక్‌గా చిరంజీత్ చక్రవర్తి నటించారు. అంజనా బసు, తులికా బసు, విశ్వరూప్ బందోపాధ్యాయ, సందీప్ భట్టాచార్జీ, ఇషికా డే, స్వాగతా బసు, సయన్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అర్ణబ్ కె. మిద్య దర్శకత్వం వహించగా, ప్రియాంక పొద్దార్ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. రణజోయ్ భట్టాచార్య సంగీతం సమకూర్చారు. ఈ సినిమా 2025 నవంబర్ 28న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. అధికారిక ప్లాట్‌ఫామ్ వివరాల ప్రకారం ఒరిజినల్ బెంగాలీ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఉన్నట్లు సమాచారం లేదు.

Read Also: భర్తకు పిల్లలు పుట్టరని తెలిసినా భార్య ప్రెగ్నెంట్.. మాజీ భార్య ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… ఓటీటీలో అస్సలు మిస్ కావద్దు

Tags

Related News

అమ్మాయిల మనసులో ఏముందో చదివే వింత శక్తి… కుర్రాడి జీవితంలో వరం తెచ్చిన చిలిపి కష్టాలు… ఫాంటసీ కామెడీ

ఒంటరి జీవితాల్లో కొత్త వెలుగులు… వయసుతో సంబంధం లేని స్వచ్ఛమైన బంధం… ఎమోషనల్ మలయాళం మూవీ

భర్తకు పిల్లలు పుట్టరని తెలిసినా భార్య ప్రెగ్నెంట్.. మాజీ భార్య ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… ఓటీటీలో అస్సలు మిస్ కావద్దు

చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న మాఫియా డాన్… దేశాన్నే గడగడలాడించిన రక్తచరిత్ర

పులివేషాల సంస్కృతి మాటున ప్రతీకార జ్వాలలు… ఓటీటీలోకి సంచలనం సృష్టించిన యాక్షన్ థ్రిల్లర్

ప్రపంచాన్ని మారుస్తామని 8 బిలియన్ డాలర్ల కుంభకోణం.. ఇది చిన్న కథ కాదు భయ్యా

ఆన్‌లైన్‌లో అజ్ఞాత ప్రేమికుడు… కట్ చేస్తే కాలేజీ సూపర్ స్టార్… ఓటీటీలో ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ కామెడీ

Big Stories

Advertisement
×