OTT Movie : ఇప్పుడు ఎక్కడ చూసినా సస్పెన్స్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు వీటిని ఆదరిస్తుండటంతో, కొత్త కొత్త స్టోరీలతో ముందుకు వస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా ఇటువంటి సినిమాలు థియేటర్లలో, ఓటిటిలలో దూసుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక స్పై ఏజెన్సీ చుట్టూ తిరుగుతుంది. సినిమా చివరి వరకూ ట్విస్ట్ లతో అదరగొడుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే …
జీ 5 (Zee 5) లో
ఈ స్పై థ్రిల్లర్ మూవీ పేరు ‘బెర్లిన్’ (Berlin). 2024 లో వచ్చిన ఈ మూవీకి అతుల్ సభర్వాల్ దర్శకత్వం వహించారు. అపర్శక్తి ఖురానా,ఇష్వాక్ సింగ్, రాహుల్ బోస్,అనుప్రియా గోయెంకా, కబీర్ బేడీ ఇందులో నటించారు. 1993లో న్యూ ఢిల్లీలో జరిగే ఒక గూఢచర్యం స్టోరీతో ఈ మూవీ తెరకెక్కింది. జీ స్టూడియోస్, యిప్పీ కి యాయ్ మోషన్ పిక్చర్స్ ద్వారా దీనిని నిర్మించారు. సంగీతం K. కృష్ణ కుమార్ అందించారు. సెప్టెంబర్ 13, 2024 నుంచి జీ5 (Zee 5) ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది.
స్టోరీలోకి వెళితే
ఢిల్లీలోని ఒక బెర్లిన్ కేఫే గూఢచారులు, రహస్య సమాచార ఏజెంట్ లకు సమావేశ స్థలంగా ఉంటుంది. 1993 లో ఈ కేఫేలో పనిచేసే ఒక చెవిటి-మూగ వ్యక్తి అయిన అశోక్ కుమార్ ను విదేశీ గూఢచారిగా అనుమానిస్తారు. రష్యన్ అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్ భారత్ సందర్శన సమయంలో, హత్యాయత్నం కుట్రలో భాగమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటాడు. అతన్ని విచారించడానికి అధికారులకు తలనొప్పిగా ఉంటుంది. అతనికి చెవి మూగ ఉండటంతో అతనిదగ్గర రహస్యాలు రాబట్టడానికి ఒక మనిషి కోసం వెతుకుతారు. సైన్ లాంగ్వేజ్ నిపుణుడైన పుష్కిన్ వర్మాని బ్యూరో అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తీసుకువస్తుంది. ఇతను ఒక స్కూల్ లో సైన్ లాంగ్వేజ్ తో పిల్లలకు పాఠాలు చెప్తుంటాడు. అయితే ఇప్పుడు, ఈ విచారణ జగదీష్ సోంధి నేతృత్వం లో జరుగుతుంది. పుష్కిన్, అశోక్‌తో సైన్ లాంగ్వేజ్ ద్వారా సంభాషిస్తూ, అతనితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరుచుకుంటాడు.
విచారణ ముందుకు సాగుతున్నప్పుడు, బెర్లిన్ కేఫేలో జరిగే రహస్య కార్యకలాపాల గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. బ్యూరో, వింగ్ అనే రెండు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల మధ్య రాజకీయ ఆధిపత్య పోరుజరుగుతుంది. ఒక అమ్మాయి ఇంటిమేట్ వీడియొ కలకలం రేపుతుంది. అసలు ఇన్వెస్టిగేషన్ పక్కదారి పడుతుంది. అలాగే వ్యక్తిగత లాభాల కోసం జరిగే కుట్రలు వెలుగులోకి వస్తాయి. పుష్కిన్, తనకు తెలియకుండానే, ఈ గూఢచార్యం, రాజకీయ కుట్రల చిక్కుకుంటాడు. చివరికి అశోక్ నిజంగా గూఢచారినా, అతను కేవలం రాజకీయ కుట్రలో బలిపశువా అనే అనుమానం పెరుగుతుంది. పుష్కిన్ తను నమ్మిన దేశభక్తి, నీతి సూత్రాలకు, ఇక్కడ జరుగుతున్నదానికి తేడా చూసి చాలా బాధపడతాడు. ఇందులో వచ్చే ట్విస్ట్‌లు, రివీల్‌లు అశోక్, పుష్కిన్ జీవితాలను శాశ్వతంగా మార్చివేస్తాయి. ఒక మంచి స్పై థ్రిల్లర్ సినిమాను చూడాలి అనుకుంటే, ఈ మూవీ బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు.
Read Also : భర్త అనుకుని మరొకరితో అలాంటి పని చేసే భార్య … నిజం తెలిసాక ఆమె చేసే పనికి మైండ్ బ్లాక్