BigTV English

OTT Movie : భర్త అనుకుని మరొకరితో అలాంటి పని చేసే భార్య … నిజం తెలిసాక ఆమె చేసే పనికి మైండ్ బ్లాక్

OTT Movie : భర్త అనుకుని మరొకరితో  అలాంటి పని చేసే భార్య … నిజం తెలిసాక ఆమె చేసే పనికి మైండ్ బ్లాక్

OTT Movie : ఒకప్పుడు మలయాళం సినిమాలంటే షకీలా లాంటి శృంగార తార నటించిన సినిమాలు గుర్తుకు వచ్చేవి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మంచి కథలను స్క్రీన్ మీద చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ భార్య భర్తల చుట్టూ తిరుగుతుంది. స్టోరీ కూడా సుత్తి లేకుండా నడుస్తూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


జియో హాట్ స్టార్ (Jio hotstar) లో

ఈ మలయాళ డ్రామా మూవీ పేరు ‘జానకి జానే’ (Jaanaki Jaane). 2023 లో వచ్చిన ఈ మూవీకి అనీష్ ఉపాసన దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌లో నవ్య నాయర్‌తో పాటు సైజు కురుప్, షరాఫ్ యు ధీన్, అనార్కలి మరికర్, జానీ ఆంటోనీ, కొట్టాయం నజీర్, జార్జ్ కోరా, స్మిను సిజో, ప్రమోద్ వెలియనాడు, జేమ్స్ ఎలీ తదితరులు నటించారు. విడుదలయ్యాక ఈ సినిమా యావరేజ్ టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఈ మూవీ జియో హాట్ స్టార్ (Jio hotsar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

జానకి అనే అమ్మాయికి ఒంటరిగా ఉండడం అంటే భయం, చీకటి అంటే కూడా భయపడుతూ ఉంటుంది. ఆమెకు ఫాంటోఫోబియా అనే డిసీజ్ ఉంటుంది. దానివల్ల ఎక్కువగా భయపడి స్పృహ కోల్పోతూ ఉంటుంది. ఒకసారి ఆటోలో ఒక రాజకీయ నాయకున్ని కలవడానికి వెళుతుంది. ఆ ప్రాంతం నిర్మానుషంగా ఉంటుంది. ఆటో డ్రైవర్ ఆమెను ఆ ఇంటికి దగ్గరలో వదిలి వెళ్ళిపోతాడు. అక్కడ ఒంటరిగా భయపడి కళ్ళు తిరిగి పడిపోతుంది. అక్కడికి దగ్గర్లో ఉండే ఉన్ని ముకుందన్ ఆమెను చూసి జాగ్రత్తగా ఇంటికి చేరుస్తాడు. అలా వీళ్ళిద్దరూ ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకుంటారు. ఆమెకు ఉన్న సమస్యలు అతను పెద్దగా పట్టించుకోకుండా, ఆమెకు సపోర్ట్ గా ఉంటాడు. అదే ఊరిలో ఉంటే ఒక రాజకీయ నాయకుడు తన కొడుకుని రాజకీయాల్లోకి దింపుతాడు.

ఒకరోజు ఒక ఫంక్షన్ లో కరెంటు పోవడంతో జానకి భయపడి భర్త అనుకుని, మరొకరిని గట్టిగా కౌగిలించుకొని పట్టుకుంటుంది. కరెంటు వచ్చాక అతడు రాజకీయ నాయకుడి కొడుకు అని తెలుసుకుని దూరంగా జరుగుతుంది. అప్పటినుంచి ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు ఆ పొలిటికల్ లీడర్. ఆ తర్వాత ఆ జంటకి ఈ లీడర్ ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు. ఉన్ని కాంట్రాక్టు బిల్లులను కూడా ఆపుతూ ఉంటాడు. ఓ పక్క ఆమెకున్న భయాలు, మరోపక్క ఆ పొలిటికల్ లీడర్తో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి ఈ జంట ఈ సమస్యల నుంచి ఎలా బయటపడుతుంది ? పొలిటికల్ లీడర్ కి ఎలా బుద్ధి చెప్తారు? తన భయాలను ఎలా పోగొట్టుకుంటుంది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ మూవీని చూడండి.

Read Also : అబ్బాయిపై మనసు పడే ఆడ నక్క… రాక్షస లోకంలో ప్రేమ పోరాటం … దిమ్మతిరిగిపోయే ఫ్యాంటసీ థ్రిల్లర్

Related News

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×