Illu Illalu Pillalu Today Episode April 22 nd : నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి నా కోడళ్లు ఇస్తారులే అని వాళ్ల మధ్య పుల్ల పెడుతుంది. ఈమె చేసేవన్నీ ఇలాంటి వంకరపనులే. సాంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడుచే హారతి ఇస్తుంది. కానీ.. వేదవతి మాత్రం కోడళ్లతో హారతి ఇప్పిస్తుంది. నేను ఈ ఇంటి ఆడబిడ్డని నేను కదా హారతి ఇవ్వాలి.. వాళ్లని ఇవ్వమంటావ్ ఏంటి? కడిగిపారేస్తుంది కూతురు కామాక్షి. ఒసేయ్ వాళ్లు ఈ ఇంటి కొడళ్లే హారతి ఇస్తే బావుంటుంది అని ఫిటింగ్ పెడుతుంది వేదవతి. లేదు లేదు.. నేను ఒప్పుకోను.. ఇంటి ఆడపడుచుగా నేనే హారతి ఇస్తాను అని మొండికేస్తుంది కామాక్షి.. హారతి ఇచ్చిన తరువాత ప్లేట్‌లో డబ్బులు వేస్తారు కదా.. మరి అవి ఎవరికి ఇస్తారు? అని అడుగుతుంది కామాక్షి. దానికి అంతా పెద్దగా నవ్వుకుని.. నువ్వు సూపరెహే.. హారతి ఇస్తానంటే వాళ్లపై ప్రేమతో అనుకున్నా.. ఆ డబ్బులపై ప్రేమతోనా? .. ఆ డబ్బులు నువ్వే తీసుకుందువులే కానీ.. హారతి ఇవ్వనువ్వు అని అంటాడు రామరాజు. దాంతో సరేనని అంటుంది కామాక్షి.
ఆ తరువాత ఇద్దరు కోడళ్లు.. కొత్త కోడలికి హారతి ఇచ్చి లోపలికి తీసుకురావాలని అనుకుంటారు. కానీ కామాక్షి మాత్రం పేర్లు చెప్పేవరకు లోపలికి రానివ్వను అని అంటుంది. మొత్తానికి శ్రీవల్లి చందు పేరు చెప్పడానికి తెగ సిగ్గు పడిపోతుంది. అందరూ కలిసి శ్రీవల్లిని ఒక ఆట ఆడుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అందరూ సరదాగా భోజనం చేస్తూ ఉంటే శ్రీవల్లి మాత్రం కింద కూర్చొని భోజనం చేస్తే బాగుంటుందని అంటుంది.. అందరూ సరదాగా కింద కూర్చొని భోజనం చేస్తుంటారు. రామరాజు ఇలా కింద కూర్చొని భోజనం చేస్తుంటే ఎంత హాయిగా ఉందో అని శ్రీవల్లితో అంటాడు. నేలపై కూర్చుని భోజనం చేస్తారు. సీన్ అయితే చాలా చూడముచ్చటగా ఉంటుంది. కుటుంబం అంతా కలిసి ఇలా ఒకేచోట కూర్చుని తింటుంటే భలే ఉందమ్మా.. ఇక నుంచి అంతా కలిసి ఇలాగే దిందాం అని అంటాడు రామరాజు. ఇక శ్రీవల్లి కొత్త మొగుడికి తొలి ముద్ద పెట్టి.. వయ్యారంగా వడ్డిస్తుంది. ముచ్చటగా మూడు ముద్దలు తినాలి అంటూ కొసరికొసరి తినిపిస్తుంది.
అది చూసిన సాగర్ నాక్కూడా అలా కావాలని నర్మదని అడుగుతాడు. కొసరి కొసరి పెట్టనా గోరుముద్దలు పెట్టనా అని నర్మదా అడుగుతుంది. అలాంటి ఆశలు ఏమి పెట్టుకోకు అని సాగర్ తో నర్మదా అంటుంది. అటు ప్రేమ కూడా నీకు ఇలాంటి ఆశలు ఉన్నాయా ఏంటి అని అడుగుతుంది. దానికి ధీరజ్ నీకలా గోరుముద్దలు తినిపించాలని అనుకుంటున్నావా అని ప్రేమ అనే రివర్స్లో అంటాడు. నీ చెత్త తింటారని ఆలోచిస్తుంటేనే డోక్ వస్తుంది కడుపులో తిప్పేస్తుంది అని ప్రేమతో అంటాడు ధీరజ్. నీకు ఏదో ఒక రోజు చెయ్యికి దెబ్బ తగలకుండా పోదా అప్పుడు నేను తినిపించకుండా పోదాం అప్పుడు చెప్తాను మీ సంగతి అని ప్రేమ అంటుంది.
ఇక అందరూ సరదాగా అబ్బాయిలు ఒకచోట అమ్మాయిలు ఒకచోట పడుకుంటారు. అబ్బాయిలు తమ పెళ్లిళ్ల గురించి నెమరు వేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ముగ్గురు పెళ్లిళ్లు జరగడానికి కారణం ధీరజ్ అని ధీరజ్ని పొగిడేస్తూ ఉంటారు.. మా పెళ్లి ఒక ప్రశ్నల మీద ట్విస్టులతో జరిగిందని సాగర్ అంటాడు. చెందు పెళ్లయితే ఇంకా చేజింగ్లు పందిట్లో అవమానాలు కిడ్నాప్లు బాబోయ్ చాలా గొప్పగా జరిగిందని అందరూ వాళ్ళ పెళ్లిల గురించి మరోసారి గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు.
అటు ప్రేమ నర్మదా శ్రీవల్లి కూడా ఒకచోట పడుకొని పడుకుందామని అనుకుంటారు. ప్రేమ ఇంకా పడుకోలేదు ఏంటక్కా అని శ్రీవల్లిని అడుగుతుంది. కానీ శ్రీవల్లి మాత్రం నిద్ర ఎలా వస్తుంది ప్రేమ ఇంత జరిగిన తర్వాత అని కోపంగా అరుస్తుంది. మీ వాళ్లు మనుషులా రాక్షసులా? కడుపుకి అన్నంత తింటున్నారా? గడ్డి తింటున్నారా? మా బావని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తారా? మీ అన్నయ్య ఒక్కడేనా? లేదంటే మీ ఫ్యామిలీలో అందరూ ఇంతేనా? అని తిట్టేస్తుంది శ్రీవల్లి. మధ్యలో ప్రేమని ఎందుకు అంటున్నావ్ అని నర్మద తిరగబడటంతో.. ప్రేమ ధీరజ్‌ని పెళ్లి చేసుకోవడం వల్లే కదా.. ఈ గొడవలన్నింటికీ మూలం. ధీరజ్ బుద్ది ఏమైందో ఏంటో.. పోయి పోయి.. శత్రువుల అమ్మాయిని పెళ్లి చేసుకుని నట్టింట్లో నిప్పుల కుంపటి పెట్టాడు అంటూ నోరుపారేసుకుంటుంది.
ప్రేమ వెంటనే ధీరజ్ దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని ధీరజ్ కి చెప్పాలని అక్కడికి వెళుతుంది కానీ ధీరజ్ మొదట రానంటాడు. ఆ తర్వాత వాళ్ళ మామ చెప్పడంతో అక్కడికి వెళ్తాడు. మీ వదిన నన్ను ఇలా అంది అనగానే ధీరజ్ మా వదిన అన్నం లో తప్పు లేదు కదా అని అంటాడు. ఇంట్లో వాళ్ళు నిజంగానే అలాంటి వాళ్ళు కాబట్టే ఇలా అంది దానితో తప్పేమీ లేదు కదా అని ధీరజ్ అనగానే ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను ఇంట్లో ఒంటరి దానన్న ఆఖరికి నువ్వు కూడా ఇలా మాట్లాడతావా అని ప్రేమ ధీరజ్ని అంటుంది. ఇంట్లో ఎవరికీ నేను అక్క లేనప్పుడు నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను అని ప్రేమ పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. కానీ ఒక్కసారి వెళ్తే మళ్లీ తిరిగి రావడం ఉండదని ఆలోచిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..