Best 5 movies to watch on Hotstar : ఓటిటి ప్లాట్ ఫామ్ హాట్స్టార్ లో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ సినిమాలను తెలుసుకుందాం. ఈ సినిమాలను ఫ్యామిలీతో సహా చూసి వీకెండ్ ఎంజాయ్ చేయండి. యాక్షన్ సినిమాల నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు అన్ని సినిమాలు ఈ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి.
కిష్కింధ కాండం (kishkindha kaandam)
మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో కిష్కింధ కాండం థియేటర్లలో మంచి విజయం సాధించి ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో అపర్ణ ఎన్నో కలలు కని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె జీవితంలో విషాద సంఘటనలు చోటు చేసుకుంటాయి. దినజిత్ అయ్యాతన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఉత్కంఠంగా సాగిపోతూ ఉంటుంది.
ప్రేమలు (Premalu)
మమత బైజు, నస్లేన్ నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో సచిన్ చదువుకోవడానికి తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి సిటీకి వెళ్తాడు. అక్కడ సచిన్ కు రీను పరిచయం అవుతుంది. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. సచిన్ తన లవ్ ని వ్యక్తపరిచేలోగా రీను లైఫ్ లోకి మరొక వ్యక్తి వస్తాడు. ఈ చిత్రం మొదటి నుంచి చివరిదాకా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.ఈ సినిమాకు గిరీష్ ఏ.డి దర్శకత్వం వహించాడు. మూవీ లవర్స్ ఫ్యామిలీతో పాటు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసేయండి.
ఆవేశం (Aavesham)
ఈ మలయాళ యాక్షన్ కామెడీ మూవీలో ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంతోపాటు, ఎంటర్టైన్ కూడా చేస్తుంది. బెంగళూరులో నివసించే ముగ్గురు యువకుల జీవితాల నేపద్యంలో ఈ మూవీ తెరకెక్కింది. కొన్ని సమస్యలు ఎదుర్కోవడానికి ఈ స్నేహితులు ఒక గ్యాంగ్స్టర్ తో చేయగలుగుతారు. జిత్తు మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
మంజుమల్ బాయ్స్ (manjummal boys)
ఒక యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మంజుమల్ బాయ్స్. ఒక చిన్న పల్లెటూరులో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ కొడైకెనాల్ విహారయాత్రకు వెళ్తారు. అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తున్న వీళ్లకు అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఈ ట్రిప్ లో ఒక స్నేహితుడు ఒక పెద్ద గొయ్యిలో పడిపోతాడు. అతన్ని కాపాడడానికి స్నేహితులు చేసే ప్రయత్నం చాలా గొప్పగా ఉంటుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
రౌద్రం రణం రుధిరం (R R R)
ఈ మూవీ బాక్స్ ఆఫీసును బద్దలు చేస్తూ రికార్డులు క్రియేట్ చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించారు. బ్రిటిష్ దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడే భీమ్, రాజు స్నేహితుల కథతో మూవీ తిరుగుతుంది. పైన చెప్పిన సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడవలసిన సౌత్ ఇండియన్ బెస్ట్ సినిమాలు ఇవి. ఈ వీకెండ్ వీటిని చూసి ఎంజాయ్ చేయండి.