E-Paper
Advertisement

Vande Bharat Express: 8 కోచ్ ల స్ధానంలో 20 కోచ్ లు.. వందేభారత్ ప్రయాణీకులకు గుడ్ న్యూస్

Vande Bharat Express: 8 కోచ్ ల స్ధానంలో 20 కోచ్ లు.. వందేభారత్ ప్రయాణీకులకు గుడ్ న్యూస్
Advertisement

Vande Bharat Express News: భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చేసిన వందేభారత్ రైళ్లు.. రోజు రోజుకు అప్ డేట్ అవుతూ.. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తున్నది. ఈ రైళ్లు ప్రారంభం అయిన అన్ని రూట్లలో నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మరికొన్ని చోట్ల సీట్లు దొరక్క ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 8 కోచ్ లతో నడిచే రైళ్ల స్థానంలో 20 కోచ్ ల రైళ్లను తీసుకురావాలని భావిస్తున్నది. త్వరలో 8 కోచ్ ల రైళ్ల స్థానం 20-కోచ్ వెర్షన్‌ రైళ్లు భర్తీ చేయనుంది.

తొలుత తిరువనంతపురం-మంగళూరు రూట్ లోకి..

Advertisement

దేశంలో తొలి 20 కోచ్ ల రైలు ఇప్పటికే ప్రారంభం కాగా, రెండో రైలును తిరువనంతపురం- మంగళూరు రూట్ లో పరిచయం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం ఈ రూట్ లో 8 కోచ్ ల వందేభారత్ రైలు నడుస్తున్నది. ఈ రైలు ప్రారంభం అయినప్పటి నుంచి 100 శాతం అక్యుపెన్సీతో నడుస్తున్నది. సీట్లు లేక చాలా మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 20 కోచ్ రైలును పరిచయం చేయబోతున్నారు. అప్‌ గ్రేడ్ చేసిన రైలులో మొత్తం 1,246 సీట్లు ఉంటాయి.

మరికొన్ని రూట్లలోనూ..

Advertisement

అటు తిరునెల్వేలి-చెన్నై మార్గంలో నడిచే ఎనిమిది కోచ్‌ల వందే భారత్ రైలును కూడా కొత్తగా ప్రవేశపెట్టిన 20-కోచ్ వెర్షన్‌ తో భర్తీ చేయనున్నట్లు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేరళలోని  తిరువనంతపురం-కాసరగోడ్ మార్గంలో 16 కోచ్ ల రైలు నడుస్తున్నది. ఇందులో 1,016 సీటింగ్ కెపాసిటీ ఉన్నది. 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నది. దీని స్థానంలోనూ కొత్త రైలు రాబోతోంది. దేశ వ్యాప్తంగా అత్యధిక రద్దీ ఉన్న 17 రూట్లలో 20 కోచ్ ల రైళ్లను తీసుకురావాని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వందేభారత్ రైళ్ల గురించి  ఆసక్తికర విషయాలు

⦿ 20 కోచ్ లతో రాబోతున్న వందేభారత్ రైళ్లు తెలుపు-నీలం రంగు స్థానంలో బూడిద-నలుపు-ఆరెంజ్ కలర్ తో రానున్నాయి.

⦿ త్రివేండ్రం – మంగళూరు రైలు 8 గంటల 35 నిమిషాల పాటు ప్రయాణించనుంది. మొత్తం 620 కి.మీ దూరంలో తొమ్మిది హాల్ట్‌ లను కలిగి ఉంది.

⦿ దేశంలో తొలి 20 కోచ్ ల వందేభారత్ రైలును వారణాసి-న్యూ ఢిల్లీ మార్గంలో ప్రారంభించారు. దీని సగటు వేగం గంటకు 72 కి.మీ.

⦿ త్వరలో 24 కోచ్‌ల వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది.

⦿ న్యూఢిల్లీ-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైలు త్వరలో ప్రారంభం కానుంది

⦿ ఢిల్లీ నుంచి శ్రీనగర్ వరకు నేరుగా వెళ్లే వందే భారత్ జనవరి 2025లో ప్రారంభమవుతుంది.

⦿న్యూఢిల్లీ- శ్రీనగర్ రైలు ఢిల్లీ నుంచి రాత్రి 7 గంటలకు బయలుదేరి ఉదయం 8 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. ఈ రైలు అంబాలా, లూథియానా, జమ్ము, కత్రా స్టేషన్లలో ఆగుతుంది. చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోని ఎత్తైన రైల్వే బ్రిజ్జి మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ వంతెన ఎత్తు దాదాపు 359 మీటర్లు. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది.

Read Also: 13 దేశాలను కలిపే ఏకైక రైలు, ప్రపంచంలో ఇదే లాంగెస్ట్ ట్రైన్ జర్నీ!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×