IPL 2025 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ( IPL 2025 Auction ) సంబంధించిన మెగా వేలం ఇవాళ జరగనుంది. ఇవాళ అలాగే రేపు కూడా ఈ మెగా వేలం నిర్వహించబోతున్నారు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) అధికారులు. ఈ నేపథ్యంలో ఏ ప్లేయర్లను కొనుగోలు చేయాలి అనే దాని పైన పది ఫ్రాంచైజీ ఓనర్లు… కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని సెలెక్ట్ చేసుకుని… వారిని కొనుగోలు చేసేందుకు కూడా రెడీగా ఉన్నారు.
Also Read: IPL Auction 2025: రేపే వేలం.. అందరికన్ను ఈ వికెట్ కీపర్లపైనే.. పంత్ పై కోట్ల వర్షం గ్యారెంటీ?
ఇక ఐపీఎల్ 2025 మెగా వేలం ( IPL 2025 Auction ) ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. వాస్తవంగా 12:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండేది. కానీ పెర్త్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రెండున్నరకు అయిపోతుంది… పెర్త్ టెస్ట్ కారణంగా ఐపీఎల్ మెగా వేలం డిస్టర్బ్ అవుతుంది. అందుకే మెగా వేలాన్ని మూడున్నర గంటలకు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
Also Read: IND vs Aus BGT Trophy: బుమ్రా దెబ్బకు 104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్..!
దీంతో ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఐపీఎల్ మెగా వేలం ( IPL 2025 Auction ) ప్రారంభమవుతుంది. అయితే ఈ మెగా వేలం నేపథ్యంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ అలాంటి ప్లేయర్ లపై కోట్ల వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు మొత్తం 10 జట్ల చేతిలో 641 కోట్లు ఉన్నాయి. 574 మంది వేలంలోకి వస్తారు. ఇందులో 300కు పైగా ఇండియన్స్ ఉన్నారు. వీరందరినీ కొనుగోలు చేసేందుకు 10 జట్ల ఓనర్లు… రెడీగా ఉన్నారు.
Also Read: Bumrah – Kapil Dev: ఆసీస్ గడ్డపై జస్ప్రీత్ బుమ్రా చరిత్ర..కపిల్ దేవ్ రికార్డు బ్రేక్ !
INR 120 కోట్ల పర్స్‌తో ఫ్రాంచైజీలు బరిలోకి దిగాయి. అయితే.. రిటెన్షన్ సమయంలో.. కొన్ని జట్లు ఎక్కువ ప్లేయర్లను సెలక్ట్ చేసుకున్నాయి. దీంతో INR 120 కోట్లలో కాస్త తగ్గాయి. ఇక రిటెన్షన్ తర్వాత పంజాబ్ కింగ్స్ (PBKS) వద్ద INR 110.5 కోట్లు ఉన్నాయి. పంజాబ్ ఎక్కువ ప్లేయర్లను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) INR 83 కోట్లతో బరిలోకి దిగుతుంది. RCB కూడా ప్రభావవంతమైన ప్లేయర్లను కొనుగోలు చేయడానికి వీలు ఉంటుంది.
Also Read: IND vs AUS 1st Test: పెర్త్ టెస్ట్‌లో చేతులెత్తేసిన టీమిండియా.. 150 పరుగులకే ఆలౌట్
IPL 2025 Auction స్ట్రీమింగ్ వివరాలు