Best Action Movies on OTT : యాక్షన్ సినిమాలంటే మొదటగా గుర్తుకు వచ్చేది హాలీవుడ్ సినిమాలు. ఈ సినిమాలలో ఉండే యాక్షన్ సీన్స్, విజువల్స్ కి మన ప్రేక్షకులు ఫిదా అవుతారు. యాక్షన్ సినిమాలంటే సిల్వెస్టర్ స్టాలిన్, ఆర్నాల్డ్ కూడా గుర్తుకు వస్తారు. 2024 లో వచ్చిన అటువంటి యాక్షన్ సినిమాలను చూడాలనుకుంటున్నారా? అయితే ఈ సినిమాలు ఏ ఓటీటీ లో ఉన్నాయో తెలుసుకోండి. మీరు ఒకవేళ ఈ సినిమాలు, చూడకపోయినట్లయితే ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయండి.
ది బీకీపర్ (The Beekeeper)
2024లో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి డేవిడ్ అయర్ దర్శకత్వం వహించారు. ఇందులో జాసన్ స్టాథమ్, ఎమ్మీ రేవర్-లాంప్‌మన్, జోష్ హచర్సన్, బాబీ నాడెరి, ఫిలిసియా రషద్, జెమ్మా రెడ్‌గ్రేవ్, జెరెమీ ఐరన్స్ నటించారు. ఈ మూవీ రిటైర్డ్ రహస్య ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. ది బీకీపర్‌ని యునైటెడ్ స్టేట్స్‌లో జనవరి 12, 2024న విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా $40 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ $153 మిలియన్లను వసూలు చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
రోడ్ హౌస్ (Road House)
2024లో విడుదలైన ఈ అమెరికన్ యాక్షన్ మూవీకి డగ్ లిమాన్ దర్శకత్వం వహించారు. ఇందులో జేక్ గిల్లెన్‌హాల్ మాజీ UFC ఫైటర్‌గా నటించారు. ఇందులో హీరో ఫ్లోరిడా కీస్ రోడ్ హౌస్‌లో బౌన్సర్‌గా ఉద్యోగం చేస్తాడు. ఒక మాఫియాను ఎదుర్కొంటాడు. జోయెల్ సిల్వర్ నిర్మించిన ఈ మూవీలో డానియేలా మెల్చియర్, బిల్లీ మాగ్నస్సేన్, జెస్సికా విలియమ్స్, జోక్విమ్ డి అల్మెయిడా, జెడి పార్డో, ఆస్టిన్ పోస్ట్, కోనర్ మెక్‌గ్రెగర్‌లు నటించారు. రోడ్ హౌస్ మార్చి 21, 2024న ప్రైమ్ వీడియో ద్వారా విడుదల చేయబడింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
డెడ్‌పూల్ & వుల్వరైన్ (Deadpool and Deadpool & Wolverin)
మార్వెల్ కామిక్స్ ఆధారంగా 2024లో విడుదలైన ఈ అమెరికన్ సూపర్ హీరో మూవీకి షాన్ లెవీ దర్శకత్వం వహించారు. మార్వెల్ స్టూడియోస్, మాగ్జిమమ్ ఎఫర్ట్, 21 ల్యాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ మూవీ నిర్మించబడింది. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ ద్వారా పంపిణీ చేయబడింది. ఇందులో రెనాల్డ్స్, హ్యూ జాక్‌మన్, వేడ్ విల్సన్ నటించారు. టైమ్ వేరియెన్స్ అథారిటీ తన విశ్వాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తుందని డెడ్‌పూల్ తెలుసుకుంటాడు. వారిని ఆపడానికి మరొక విశ్వం నుండి వుల్వరైన్‌తో కలిసి పనిచేస్తాడు. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా (Furiosa: A Mad Max Saga)
2024లో విడుదలైన ఈ అపోకలిప్టిక్ యాక్షన్ మూవీకి నికో లాథౌరిస్‌తో స్క్రీన్‌ప్లే రాయగా, జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించి, నిర్మించారు. 2015లో విడుదలైన మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ అనే మూవీకి ఇది సీక్వెల్ గా వచ్చింది. ఈ యాక్షన్ మూవీ జియో సినిమా (Jio cinema) లో స్ట్రీమింగ్ అవుతుంది.