Parliament Ambedkar Row| పార్లెమెంటులోని రెండు సభలు గురువారం వాయిదా పడ్డాయి. లోక్ సభ, రాజ్యసభ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు పట్టుబట్టారు. ఈ క్రమంలో లోక్ సభలో ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక ఎంపీ తలకు గాయాలయ్యాయి.
కాంగ్రెస్, బిజేపీ పోటాపోటీ నిరసనలు
మంగళవారం రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి రాజ్యాంగం 75వ వార్షికోత్సవాల్లో మాట్లాడుతూ.. అంబేడ్కర్ పేరు చెప్పుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయిందని.. ఆయన పేరు తలుచుకోవడం కంటే దేవుడిని తలుచుకుంటే 7 జన్మల వరకు స్వర్గం దక్కుతుందని వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో అంబేడ్కర్ ఫొటోలు పట్టుకొని నిరసన చేశారు. హోం మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలి డిమాండ్ చేశారు.
మరోవైపు కాంగ్రెస్ చేస్తున్న నిరసనలను నిర్వీర్యం చేయడానికి బిజేపీ ఎంపీలు కూడా నిరసనలు చేయడం ప్రారంభించారు. అమెరికా వ్యాపారవేత్త జార్జి సోరోస్ తో కలిసి దేశాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్ కుట్రచేస్తోందని బిజేపీ ఎంపీలు ఆరోపణలు చేస్తూ నిరసనలు చేశారు. పైగా పార్లమెంటు ఆవరణలో అంబేడ్కన్ ఫొటోలను చేతిలోపట్టుకొని ఉన్నా కాంగ్రెస్ ఎంపీల ఫోటోలను బిజేపీ సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసింది. దీంతో కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలో గురువారం బిజేపీ క్షమాపణలు చెప్పాలని నిరసన చేశారు. కాంగ్రెస్ ఎంపీలకు పోటీగా బిజేపీ ఎంపీలు కూడా నిరసనకు దిగారు.
ALSO READ: సంక్షోభంలో విద్యారంగం.. దేశంలో 10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీ.. లక్ష విద్యార్థులు ఫెయిల్
లోక్ సభ స్పీకర్ వెల్ వరకు నిరసనకారులు చేరుకొవడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశా బిజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి తలకు గాయాలయ్యాయి. ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా.. రాహుల్ గాంధీ లోక్ సభలో మరో ఎంపీని తోశారని.. ఆయన తోసిన ఎంపీనే తనపె పడ్డారని ఎంపీ ప్రతాస్ సారంగి మీడియా ముందు ఆరోపణలు చేశారు.
బిజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పందించారు. తాను స్పీకర్ వెల్ వరకు వెళుతుంటే బిజేపీ ఎంపీలు తనను అడ్డుకున్నారని.. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సైతం వారు తోసేశారని ఆరోపించారు. ఏం జరిగిందో కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందని.. అందరూ అది చూడాలని మీడియా ముందు స్పష్టం చేశారు.
అంతకుముందు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడుతూ.. అమిత్ షా చేసిన వ్యాఖ్యలలో నుంచి కొంత భాగం చూపి… కాంగ్రెస్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను పదపదే బిజేపీ మంత్రులు అవమానిస్తున్నారని అన్నారు. తమ నిరసనల్లో అంబేడ్కర్ ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో ఈ విషయం స్పష్టమవుతోందన్నారు.