E-Paper
Advertisement

చూడకూడని సీన్స్ లేవు… కడుపుబ్బా నవ్వించే కామెడీ… ఫ్యామిలీ ఆడియన్స్ కు మస్త్ మజా

చూడకూడని సీన్స్ లేవు… కడుపుబ్బా నవ్వించే కామెడీ… ఫ్యామిలీ ఆడియన్స్ కు మస్త్ మజా
Advertisement

Best Family Series : ఈ రోజుల్లో క్రైమ్, సస్పెన్స్, అశ్లీలత నిండిన కంటెంట్ ఓటీటీలో ఎక్కువైపోయింది. మన మనసుకు ప్రశాంతతను ఇచ్చే, కుటుంబం అంతా కలిసి సోఫాలో కూర్చొని చూసి నవ్వుకునే సిరీస్‌లు చాలా తక్కువనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇలాంటి సిరీస్ లు, సినిమాల కోసం వెతుకుతుంటారు. అలాంటి ఓటీటీలో ఉన్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సిరీస్‌లన్నీ IMDbలో 7కి పైగా రేటింగ్‌తో సూపర్ హిట్ అయ్యాయి.

యే మేరీ ఫ్యామిలీ (Yeh Meri Family) – Amazon Prime Video

1990ల నాటి మధుర జ్ఞాపకాలు, ఆ కాలపు జీవన విధానం, కుటుంబ బంధాలు వంటి అంశాలను గుర్తు చేసే సిరీస్ ఇది. ఈ సిరీస్ 12 ఏళ్ల హర్షు గుప్తా కోణం నుంచి సాగుతుంది. మధ్యతరగతి కుటుంబంలో తల్లిదండ్రుల ప్రేమ, పిల్లలపై ఒత్తిడి, చిన్ననాటి అమాయకపు రోజులు చాలా హార్ట్ టచింగ్‌గా చూపించారు. ఒక్కసారి చూస్తే చిన్నప్పటి రోజులు గుర్తుకు రావడం ఖాయం.

పంచాయత్ (Panchayat) – ప్రైమ్ వీడియో

Advertisement

ఇండియాలోనే బెస్ట్ వెబ్ సిరీస్‌ల్లో ఇది కూడా ఒకటి. ఐఎండీబీలో రేటింగ్: 9.0 ఉంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్) సిటీలో ఉద్యోగం దొరకక, విధిలేక ఉత్తరప్రదేశ్‌లోని ‘ఫులేరా’ గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా చేరాల్సి వస్తుంది. పల్లెటూరి జీవితం, గ్రామ రాజకీయాలు, స్థానికులతో ఏర్పడే బంధాలు… హాస్యం, ఎమోషన్, సామాజిక సందేశాలు అన్నీ బ్యాలెన్స్‌గా ఉంటాయి.

ది ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ (The Aam Aadmi Family) – ZEE5

శర్మది ఢిల్లీలోని సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి, తల్లి, నానమ్మ, పిల్లలు… ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో జరిగే రోజువారీ గొడవలు, చిన్న చిన్న సంతోషాలు, ప్రేమ అన్నీ చాలా సహజంగా చూపించారు. చూస్తుంటే మన పక్కింటి వాళ్లనో లేదా మన కుటుంబాన్నో చూసిన ఫీలింగ్ వస్తుంది. ఐఎండీబీలో 8.4 రేటింగ్ ఉంటుంది.

ఘర్ వాప్సీ (Ghar Waapsi) – Jio Hotstar

Advertisement

బెంగళూరులో టాప్ కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్న శేఖర్ జాబ్ కోల్పోయి, తన సొంత ఊరైన ఇండోర్‌కు తిరిగి వస్తాడు. అక్కడ తల్లిదండ్రులు, తోబుట్టువులతో మళ్లీ కనెక్ట్ అయ్యి, జీవితం అసలైన అర్థాన్ని ఎలా తెలుసుకున్నాడో చాలా హార్ట్ టచింగ్‌గా చూపించారు. దీనికి ఐఎండీబీలో 8.8 రేటింగ్ ఉండడం విశేషం.

టీవీఎఫ్ ట్రిప్లింగ్ (TVF Tripling) – ZEE5

విభిన్న మనస్తత్వాలు కలిగిన ముగ్గురు తోబుట్టువులు చందన్, చంచల్, చిత్రవన్. వారి వ్యక్తిగత సమస్యల మధ్య అనుకోకుండా ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. ఆ ప్రయాణంలో పాత కోపాలు పోయి, తోబుట్టువుల బంధం ఎంత బలపడిందో హాస్యంగా చూపించారు. దీనికి ఐఎండీబీలో రేటింగ్: 8.5. ఇవన్నీ హిందీ సిరీస్ లు. అయితే తెలుగులోనూ ‘సేవ్ ది టైగర్స్’తో పాటు మరికొన్ని సిరీస్ లు ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంటాయి. ప్రస్తుతం ‘సేవ్ ది టైగర్స్ 3’ స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : కనిపించిన ప్రతీ అబ్బాయితో సన్నిహితంగా ఉండే అమ్మాయి… చివరికి షాకింగ్ క్లైమాక్స్

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×