E-Paper
Advertisement

కనిపించిన ప్రతీ అబ్బాయితో సన్నిహితంగా ఉండే అమ్మాయి… చివరికి షాకింగ్ క్లైమాక్స్

కనిపించిన ప్రతీ అబ్బాయితో సన్నిహితంగా ఉండే అమ్మాయి… చివరికి షాకింగ్ క్లైమాక్స్
Advertisement

Mystery Thriller : ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లు చాలా ఉంటాయి. కానీ చివరి 15 నిమిషాల వరకు అసలు నిజం ఏంటో అర్థం కాకుండా ప్రేక్షకుడిని కన్ఫ్యూజ్ చేస్తూ, ఒక్క ట్విస్ట్‌తో మొత్తం కథనే తలకిందులు చేసే సినిమాలు మాత్రం చాలా అరుదు. అలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీ థ్రిల్లర్లలో  ఒకటి ‘My Client’s Wife’. 2020లో విడుదలైన ఈ హిందీ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌కు ప్రభాకర్ మీనా భాస్కర్ పంత్ దర్శకత్వం వహించారు. షరీబ్ హష్మీ, అంజలి పాటిల్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సైకలాజికల్ మిస్టరీలు, ట్విస్ట్ ఎండింగ్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్.

స్ట్రీమింగ్ ఎక్కడంటే?

My Client’s Wife 2020 జూలై 31న విడుదలైంది. ప్రస్తుతం భారత్‌లో ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ స్ట్రీమింగ్‌లో లేదు. గతంలో Amazon Prime Videoలో అందుబాటులో ఉండగా, ప్రస్తుతం అక్కడి నుంచి కూడా తొలగించారు.

కథలోకి వెళ్తే…

Advertisement

రఘురామ్ సింగ్ (అభిమన్యు సింగ్) తన భార్య సిందూరాపై గృహహింసకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పోలీస్ కస్టడీలో ఉంటాడు. అయితే తాను నిర్దోషినని, తన భార్యే తనను కావాలనే ఇరికించిందని చెబుతాడు. ఈ కేసును వాదించే లాయర్ మనస్ వర్మ (షరీబ్ హష్మీ) నిజం ఏంటో తెలుసుకోవడానికి తన క్లయింట్ భార్య సిందూరాను కలుస్తాడు. మొదట ఆమె చెప్పిన కథను విన్న తర్వాత రఘురామ్‌నే నేరస్థుడిగా భావిస్తాడు. కానీ కేసును లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభించిన కొద్దీ ఒక్కో ఆధారం ఒక్కో కొత్త అనుమానాన్ని తెరపైకి తీసుకొస్తుంది.

సిందూరా నిజంగానే బాధితురాలా? లేక ఆమె చెప్పిన కథ వెనుక ఇంకేదైనా కుట్ర దాగి ఉందా? రఘురామ్ నిజంగా క్రూరమైన భర్తేనా? లేక అతను కూడా ఒక పెద్ద ప్లాన్‌లో బలయ్యాడా? ప్రతి సాక్ష్యం బయటపడుతున్న కొద్దీ కేసు పూర్తిగా కొత్త మలుపులు తిరుగుతుంది. చివరికి మనస్ బయటపెట్టే నిజం ప్రేక్షకులను పూర్తిగా షాక్‌కు గురి చేస్తుంది. అసలు హంతకుడు ఎవరు? ఎవరు ఎవరిని మోసం చేశారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా క్లైమాక్స్. చివరి ట్విస్ట్ కోసం ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.

ఎందుకు చూడాలి?

Advertisement

ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండవు. కానీ మొదటి నుంచి చివరి వరకు సస్పెన్స్‌ను కొనసాగించే స్క్రీన్‌ప్లే ప్రధాన బలం. ప్రతి పాత్రపై అనుమానం వచ్చేలా కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. షరీబ్ హష్మీ, అంజలి పాటిల్, అభిమన్యు సింగ్ తమ పాత్రల్లో మంచి నటన కనబరిచారు.

స్లో బర్న్ మిస్టరీలు, కోర్ట్‌రూమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు, సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్లు, ఊహించని క్లైమాక్స్ ఉన్న సినిమాలు ఇష్టపడేవారికి ‘My Client’s Wife’ మంచి వాచ్. ముఖ్యంగా చివరి ట్విస్ట్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతుంది.

Read Also : నెట్‌ఫ్లిక్స్ లో తుక్కురేగ్గొడుతున్న యానిమేటెడ్ చిత్రాలు… ఇందులో మీరెన్ని చూశారు ?

Related News

అప్పుడే ఓటీటీలోకి రాబోతున్న జెన్ జీ మెచ్చిన మూవీ.. ఏది? ఎక్కడంటే?

ఆడుకుంటుంటే చేతికి చిక్కిన 5 కోట్ల అదృష్టం… రాత్రికి రాత్రే మారిపోయిన తలరాత… పక్కా ఫ్యామిలీ డ్రామా

కాళ్ళకి చెప్పులు లేవు… కానీ కళ్ళలో వరల్డ్ కప్ కల… ఏడుగురు కుర్రాళ్ల అన్స్టాపబుల్ గూస్బంప్స్ స్టోరీ

కళ్ళు తెరిచి చూస్తే నిజమైన గేమ్‌లో… కానీ రియల్ లైఫ్‌లో నరకం… డార్క్ యాక్షన్ సిరీస్

పవిత్రమైన చెట్టును నరికిన మూడ్రోజులకే ఇంటి పెద్ద మృతి… 16 రోజుల్లో ఐదుగురి చావులు… నవ్విస్తూ భయపెట్టే మలయాళ థ్రిల్లర్

చీకటి పడితే ఆ అడవిలోకి పోవద్దు… వనదేవత విలయతాండవం… ఒళ్లు గగుర్పొడిచే హారర్

బలవంతంగా పెళ్లి… వాయిస్‌ మెసేజ్‌తో కుప్పకూలిన సంసారం… హార్ట్ టచింగ్ రొమాంటిక్ మూవీ

చెస్‌ బోర్డ్‌ మీద ప్రపంచాన్ని జయించాలనుకుంటున్న పదేళ్ల పిల్లాడి కథ… ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×