Best Horror Movies : రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాల కంటే హారర్ సినిమాలకు ఎక్కువగా డిమాండ్ ఉంది.. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా.. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కి వచ్చేసి భారీ వ్యూస్ ని సొంతం చేసుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది ఓటీటీలోకి వచ్చేసిన కొన్ని హారర్ సినిమాలు మంచి వ్యూస్ ని అందుకోవడంతోపాటుగా పాజిటివ్ టాక్ ని కూడా సొంతం చేసుకున్నాయి. అలాంటి సినిమాలు ఏంటో? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..
భార్గవి నిలయం..
ఓ ప్రేమికుల స్టోరీని రచయిత ఎలా బయటకు తీసుకొచ్చాడు అన్నది ఈ భార్గవి నిలయం స్టోరీ. ఈ ప్రేమ జంట ఎలా చనిపోయారు? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? అన్నది మిస్టరీగానే ఉంటుంది.. ప్రేమ జంట ఆత్మలుగా మారి ఎలా రివెంజ్ తీర్చుకుంటాయి అన్నది ఈ స్టోరీలో చూపించారు. టైటిల్ కి తగ్గట్లే ఇదంతా ఒక ఇంట్లోనే జరుగుతుంది.. ఈ మూవీ ప్రముఖ ఓటిటి సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది..
105 మినిట్స్..
టాలీవుడ్ ముద్దుగుమ్మ హన్సిక మోత్వానీ నటించిన భయంకరమైన హారర్ సినిమా 105 మినిట్స్.. సింగిల్ క్యారెక్టర్ తో ఈ సినిమా మొత్తం కొనసాగుతుంది. హన్సిక జాను అనే పాత్రలో నటించింది. ఓ అతీత శక్తి వల్ల ఆమె ఇంట్లోనే బందీగా ఉండిపోతుంది. అయితే ఆమెను ఆ శక్తి ఏం చేయాలనుకుంటున్నాది ఈ సినిమా స్టోరీ గా ఉంటుంది. జాను ఆ శక్తి నుంచి ఎలా బయటపడింది అనేది ఇందులో చూడాలి. సింగిల్ క్యారెక్టర్ తో సినిమా మొత్తం ఉండడంతో సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఇది ఆహా తో పాటు అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
పిండం మూవీ..
ఒక పాత పడ్డ ఇంట్లోకి హీరో ఫ్యామిలీ వస్తారు. ప్రతిరోజు బాగానే ఉన్నా ఆ తర్వాత ఆ ఇంట్లో ఏదో తేడాగా ఉందని హీరో కనిపెడతాడు. ఆ ఇంట్లో ఆత్మలు ఉండటం వాటి నుంచి హీరో తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అన్నది ఈ పిండం స్టోరీ. టాలీవుడ్ హీరో శ్రీరామ్ ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీతో ఈయన కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో అందుబాటులో ఉంది..
Also Read :
మాసూద..
మసూద, 2022 నవంబరు 18న విడుదలయిన తెలుగు సినిమా. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరులో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. హారర్ డ్రామా జానర్ లో రూపొందిన ఈ సినిమాలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.. రియలేస్టిక్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇది కూడా ఆహా లోనే స్ట్రీమింగ్ అవుతుంది..
వీటితోపాటు కాజల్ అగర్వాల్ నటించిన కార్తీక సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఈ సినిమాలన్నీ కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..