SSMB 30: ..స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న మహేష్ బాబు (Mahesh Babu), ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 29 (SSMB 29) అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కీలకపాత్ర పోషిస్తూ ఉండగా.. మలయాళ స్టార్ నటుడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్ గా నటిస్తున్నారు. అంతేకాదు ఇందులో మెయిన్ విలన్ గా నల్లజాతీయుడిని తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక రోజు రోజుకి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఎప్పటిలాగే ఎం.ఎం. కీరవాణి (M.M.Keeravani)సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad)కథను అందించారు.
మహేష్ బాబు కోసం రంగంలోకి నలుగురు డైరెక్టర్లు..
ఇదిలా ఉండగా మహేష్ బాబు , రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 తర్వాత ఎవరికి అవకాశం ఇవ్వనున్నారు అనే వార్త తెరపైకి వచ్చింది. ఎస్ఎస్ఎంబి 30 సినిమాను ఎవరు లీడ్ చేస్తున్నారు? దర్శకుడు ఎవరు? అసలు కథ ఏంటి ? అనే విషయాలపై చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు మహేష్ బాబు కోసం ఏకంగా నలుగురు డైరెక్టర్లు లైన్ లో ఉన్నట్లు సమాచారం. అసలు విషయంలోకెళితే, రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ – 29 సినిమా విజయంతో ఇండియన్ సినిమా మార్కెట్ రూపురేఖలే మారిపోతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సక్సెస్ తరువాత మహేష్ రీజినల్ సినిమాలు చేసే అవకాశం కూడా ఉండదు. పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ సినిమాలకు మాత్రమే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే మహేష్ బాబు 30వ సినిమాకి దర్శకుడు ఎవరు అవుతారు అన్నది ఇప్పటినుంచే ఆసక్తికరంగా మారింది.
ALSO READ; Bollywood: ఏకంగా ‘దీవి’నే సొంతం చేసుకున్న హీరోయిన్.. ఎక్కడ.. ఎన్ని కోట్లు.. మాట నిజమైందా.?
ఆ లక్కీ ఛాన్స్ ఎవరికంటే..?
మరి ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి రేస్ లో ఉన్నది ఎవరు అంటే.. ఒక నలుగురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇక వారిలో మొదటి పేరు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga). ఇప్పటికే ఈయనతో మహేష్ బాబు సినిమా చేయాల్సి ఉంది. కానీ అది సాధ్యపడలేదు. యానిమల్ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి సందీప్ క్రియేటివ్ స్టోరీ నచ్చితే మహేష్ నో చెప్పే అవకాశం ఉండదు. ఇక ప్రస్తుతం సందీప్ ప్రభాస్ (Prabhas)తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మరో డైరెక్టర్ సుకుమార్(Sukumar). ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియాలో సంచలనం సృష్టించిన ఈయన.. గతంలో మహేష్ బాబుతో ‘వన్’ సినిమా కోసం పనిచేశారు. అయితే అది సరైన ఫలితం ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి మరో అటెంప్ట్ చేయలేదు. ప్రస్తుతం మహేష్ కి సుకుమార్ ప్రతిభావంతుడు అన్న విషయం పుష్ప , పుష్ప2 సినిమాలతో అర్థమైంది. ఒకవేళ సుకుమార్ చెప్పే క్రియేటివ్ స్టోరీ నచ్చితే.. అదే 30వ చిత్రం అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇక మరోవైపు బుచ్చి బాబు సనా (Bucchibabu sana) పేరు కూడా వినిపిస్తోంది. రెండో సినిమాతోనే ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ని లాక్ చేసిన ఈయన కూడా లైన్లో ఉన్నారు. ఇక ఈ ముగ్గురితో పాటు అనూహ్యంగా తెరపైకి వచ్చిన మరో పేరు హను రాఘవపూడి (Hanu Raghavapudi). ఈయన కూడా మంచి క్రియేటివ్ డైరెక్టర్. ప్రస్తుతం ప్రభాస్ తో ఫౌజీ చేస్తున్నారు.. ప్రభాస్ కూడా తన బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి ఫౌజీ కి డేట్ ఇచ్చారు. సరైన కథతో మహేష్ ని అప్రోచ్ అయితే అవకాశం ఉంది. కాబట్టి ఇలా ఒక నలుగురు దర్శకుడు మహేష్ బాబును లైన్లో పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. మరి ఆ లక్కీ ఛాన్స్ ఏ డైరెక్టర్ కి వరిస్తుందో చూడాలి.