OTT Movie : కొరియన్ సినిమాలను యూత్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. యూత్ ని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ, ఒక స్మార్ట్ ఫోన్ ఆధారంగా నడుస్తుంది. చివరి వరకూ ట్విస్ట్ లతో ఈ స్టోరీ క్రేజీగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అన్‌లాక్డ్’ (Unlocked). 2023 లో విడుదలైన ఈ మూవీ కిమ్ తే జూన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో చున్ వూ-హీ, యిమ్ సీ-వాన్, కిమ్ హీ-వోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జపాన్ నవల ‘స్టోలెన్ ఐడెంటిటీ’ ఆధారంగా రూపొందింది. ఈ కథ స్మార్ట్ ఫోన్‌లపై ఆధారపడటం వల్ల ఏర్పడే ప్రమాదాల గురించి, సైబర్ నేరాల గురించి కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో 2023 ఫిబ్రవరి 17 నుంచి అందుబాటులోకి వచ్చింది.
స్టోరీలోకి వెళితే
లీనా అనే యువతి ఒక స్టార్టప్ కంపెనీలో మార్కెటింగ్ చేస్తుంటుంది. ఆమె తన తండ్రి కేఫ్‌లో కూడా పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తుంది. ఒక రోజు రాత్రి తన స్నేహితులతో పార్టీ చేసుకున్న తర్వాత, మద్యం మత్తులో బస్సులో తన స్మార్ట్‌ఫోన్‌ను మర్చిపోతుంది. ఆ ఫోన్‌ను ఓ జున్-యోంగ్ అనే వ్యక్తి తీసుకుంటాడు. అతను ఆమెను సోషల్ మీడియా ద్వారా కలసి, మీ ఫోన్ తీసుకోవడానికి ఒక రిపేర్ షాప్ కు రావలసిందిగా కోరతాడు. ఆమె తన ఫోన్‌ను తిరిగి తెచ్చుకోవడానికి, ఫోన్ రిపేర్ షాప్ కి వెళ్తుంది. అక్కడ ఆమె తనని గుర్తు పట్టకుండా, ఆ ఫోన్ ను ఆమెకు ఇస్తాడు.
అయితే జున్-యోంగ్ ఆమె ఫోన్‌లో సీక్రెట్ గా ఒక స్పైవేర్ ఇన్‌స్టాల్ చేస్తాడు. ఆమె పాస్‌వర్డ్‌ను సులభంగా పొంది, ఆమె ఫోన్‌ను క్లోన్ చేస్తాడు. దీంతో ఆమె ప్రతి కదలికను ట్రాక్ చేయగలుగుతాడు. నిజానికి జున్-యోంగ్ ఒక సీరియల్ కిల్లర్. గతంలో ఎనిమిది మందిని ఇలాగే వేధించి చంపి ఉంటాడు. ఇప్పుడు అతను లీనా జీవితంలో జరిగే ప్రతి కదలికనూ గమనిస్తూ, ఆమె జీవితంలోకి చొరబడతాడు. ఈ సమయంలో పోలీస్ డిటెక్టివ్ జీ-మాన్ ఒక అమ్మాయి హత్య కేసును విచారిస్తుంటాడు. అతను కనిపెట్టిన సాక్ష్యాలు, తన నుంచి విడిపోయిన కొడుకు జున్-యోంగ్‌పై సందేహం కలిగిస్తాయి. ఇప్పుడు జీ-మాన్ తన కొడుకును రహస్యంగా ట్రాక్ చేయడం ప్రారంభిస్తాడు.
మరోవైపు లీనా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు జున్-యోంగ్. ఆమె సోషల్ మీడియా ఖాతాల నుంచి, ఆమె స్నేహితులకు అసభ్యకరమైన సందేశాలు పంపుతాడు. ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయే విధంగా చేస్తాడు. ఆమె తండ్రిని కూడా లక్ష్యంగా చేసుకుంటాడు ఈ సైకో. ఇప్పుడు లీనా జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. ఆమె సన్నిహితులు, ఆమె నుండి దూరమవుతారు.
Read Also : జనాభా లెక్కల కోసం వెళ్తే ఫ్యూజులు అవుట్ అయ్యే ట్విస్ట్… వీడు మనిషేనా?
లీనా తన ఫోన్ హ్యాక్ అయిన విషయం గుర్తిస్తుంది. రిపేర్ షాప్‌లో జున్-యోంగ్ స్పైవేర్ ఇన్‌స్టాల్ చేసినట్లు అనుమానిస్తుంది. ఆమె పోలీసులతో కలిసి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. చివరికి లీనా ఆ సైకోని పట్టుకుంటుందా ? అతను నిజంగా డిటెక్టివ్ కొడుకేనా ? ఈ స్టోరీ చివరికి ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.