BigTV English

OTT Movies : ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు.. కన్నడలో బెస్ట్ థ్రిల్లర్ స్టోరీలు..

OTT Movies : ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు.. కన్నడలో బెస్ట్ థ్రిల్లర్ స్టోరీలు..

OTT Movies : ఈ మధ్య ఓటీటీల్లోకి కొత్త సినిమాలతో పాటుగా..పాత సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని థ్రిల్లర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈమధ్య డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. థ్రిల్లర్ స్టోరీ టైప్ లో వస్తున్న సినిమాలు కైతే ఇక రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనవసరం లేదు. గత ఏడాది నుంచి ఈ ఏడాది వరకు కన్నా చిత్రపరిశ్రమ నుంచి బోలెడు థ్రిల్లర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.. అందులో కొన్ని బెస్ట్ సినిమాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


కేస్ ఆఫ్ కొండన..

ఇది మొత్తం పోలీసుల చుట్టూ తిరిగే ఒక డిఫరెంట్ స్టోరీ.. లోకల్ గ్యాంగ్ లీడర్ ని పట్టుకునేందుకు ఎస్ఐ ట్రై చేస్తే.. మెయిన్ గ్యాంగ్ స్టర్ ను పట్టుకోవడం కోసం ఏఎస్ ఐ ప్రయత్నిస్తాడు.. ఈ రెండింటికి సంబంధం ఉంటుంది. వ్యక్తిగత జీవితాలకు కూడా ముడిపడి ఉంటాయి. కేస్ ఆఫ్ కొండన మూవీకి దేవీ ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జియోహాట్‍స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది…


వ్రిత్ర..

సినిమాలో నిత్య శ్రీ, ప్రకాశ్ బెలవాది, సుధారాణి లీడ్ రోల్స్ చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఆర్.గౌతమ్ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఓ సూసైడ్ కేసును పోలీస్ ఆఫీసర్ ఇందిరా రావు విచారణ చేపడుతారు. అయితే ఈ కేసు ఎన్నో మలుపులతో సాగుతుంది. మిస్టరీని ఛేదించేందుకు ఇందిరా ప్రయత్నిస్తుంది. సవాళ్లు ఎదురవుతుంటాయి. ఈ వ్రిత్ర అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 2019లో వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది..

బీర్బల్ ట్రయాలజీ కేస్ 1..

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ సినిమాలు అయితే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.. అలాంటి సినిమాలల్లో బీర్బల్ ట్రయాలజీ కేస్ 1 ఒకటి. ఎంజీ శ్రీనివాస్, రుక్మిణి వసంత్, వినీత్ కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ద్వారానే రుక్మిణి తెరంగేట్రం చేశారు. ఓ హత్య గురించి విష్ణు ఓ బార్ టెండర్ పోలీసులకు సమాచారం ఇస్తాడు.. అయితే అనుమానంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. లీడ్ రోల్ చేసిన ఎంజీ శ్రీనివాసే దర్శకుడు కూడా. బీర్బల్ ట్రయాలజీ స్టోరీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది..

Also Read:ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. చిరు ఫ్యాన్స్ కు పండగే..

కవాలుదారి.. 

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో థ్రిల్లర్ మూవీ కవాలు దారి.. హేమంత్ రావ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రిషి ప్రధాన పాత్ర పోషించారు. ట్రాఫిక్ పోలీస్‍గా పని చేసే శ్యామ్కి ఓ రోడు రోడ్డు నిర్మాణ పనుల్లో ఓ అస్తిపంజరం కనిపిస్తుంది.. క్రైమ్ పోలీసులకు దాని గురించి చెప్పినా కూడా పెద్దగా పట్టించుకోరు.. దాంతో తానే స్వయంగా రంగంలోకి దిగి ఆ కేసును చేదించే పనిలో ఉంటాడు. చివరికి కేసును చేదించాడా లేదా అన్నది ఈ మూవీ స్టోరీ. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది..

ఇవే కాదు కన్నడ ఇండస్ట్రీ నుంచి బోలెడు సినిమాలు ఓటీటీ సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ప్లాట్ ఫామ్ లో చూసి ఎంజాయ్ చేయండి..

Tags

Related News

OTT Movie : ఆగస్టు లాస్ట్ వీక్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : కొడుకు గర్ల్ ఫ్రెండ్ తో తండ్రి.. ఇదెక్కడి దిక్కుమాలిన సినిమారా అయ్యా ? అన్నీ అవే సీన్లు

OTT Movie : బాబా భాస్కర్ అరాచకం… వయోలెన్స్ తో పాటు ఆ సీన్లు కూడా… ఇంత ఓపెన్ గా చూపించారేంటి భయ్యా ?

OTT Movie : పోలీస్ స్టేషన్ లో ట్యూషన్… అమ్మాయితో అలాంటి పని… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్

Trail OTT: కాజోల్ ట్రయల్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OTT Movie: సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. ఎక్కడంటే?

Big Stories

×