EPAPER

Best OTT Movie: కూతురి శవం కోసం 15 ఏళ్లుగా ఆ తండ్రి తవ్వని ప్రాంతం లేదు.. క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే మెంటల్ ఎక్కుతుంది!

Best OTT Movie: కూతురి శవం కోసం 15 ఏళ్లుగా ఆ తండ్రి తవ్వని ప్రాంతం లేదు.. క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే మెంటల్ ఎక్కుతుంది!

Best OTT Movie: కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే? వారి శవం కూడా దొరక్కపోతే? ఫ్యామిలీ మెంబర్స్ అనుభవించే బాధ వర్ణనాతీతం. కనీసం డెడ్ బాడీ దొరికినా చివరిచూపులు చూసుకునే వాళ్లమని కన్నీరుమున్నీరు అవుతారు. అలాగే.. ఓ తండ్రి చనిపోయిన తన కూతురి శవం కోసం 15 ఏళ్లుగా వెతుకుతూనే ఉంటాడు. ఎప్పటికైనా దొరక్కపోదు, ఆమెకు మనస్ఫూర్తిగా అంత్యక్రియలు చేయకపోను.. అనే ఆశతో ప్రయత్నిస్తూనే ఉంటాడు. చివరకు ఆయన కూతురు శవం దొరికిందా? తన కూతురుని చంపిన కేసులో జైలుకు వెళ్లిన యువకుడు ఆమె శవం ఎక్కడ పాతిపెట్టాడో చెప్తాడా? నిజంగా ఆమెను అతడే చంపాడా? వేరెవరో చంపి నేరం అతడి మీద నెట్టేశారా? అనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన ఐరిష్ డ్రామా ‘ది డిగ్’. ఆండీ టోహిల్, ర్యాన్ టోహిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాగా ఆకట్టుకుంది. స్టువర్ట్ డ్రెన్నన్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను బ్రియాన్ J ఫాల్కనర్ నిర్మించారు.


సినిమా కథ ఏంటంటే..?

ఈ సినిమాలో హీరోగా నటించిన రోనన్ కల్లాహన్ (మో డన్‌ఫోర్డ్) మద్యం మత్తులో తన గర్ల్ ఫ్రెండ్ ను చంపేసి, జైలుకు వెళ్తాడు. 15 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత తన ఇంటికి వస్తాడు. తన ఇళ్లు పూర్తిగా శిథిలం అవుతుంది. అయినా, తన ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. అర్మరాల్లో మద్యం బాటిళ్లు కనిపిస్తాయి. మద్యం తాగడం వల్లే తన గర్ల్ ఫ్రెండ్ ను చంపేశాననే ఆవేదనతో ఆ మద్యం బాటిళ్లన్నీ సింక్ లో పారబోస్తారు. అదే సమయంలో ఆ ఇంటి పరిసరాల్లో ఆ అమ్మాయి వాళ్ల నాన్న సీన్(లోర్కాన్ క్రానిచ్), అతడి చిన్న కూరుతు రోబెర్టా(ఎమిలీ టాఫే) తవ్వుతూ కనిపిస్తారు. హీరో దాక్కుని ఏం చేస్తున్నారో చూస్తాడు. అతడి కూతురు శవం ఎక్కడైనా దొరుకుతుందేమోనని వాళ్లు ఇద్దరూ తవ్వుతూ ఉంటారు. గత 15 సంవత్సరాలుగా ఇదే పని చేస్తుంటారు. అయినా దొరకదు.


మరుసటి రోజు ఉదయం తన గర్ల్ ఫ్రెండ్ తండ్రి ఫ్రెండ్ అయిన పోలీస్ ఆఫీసర్( ఫ్రాన్సిస్ మాగీ) హీరో దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి శవం కోసం వాళ్ల నాన్ని 15 ఏండ్లుగా వెతుకుతున్నాడని, ఎక్కడ పూడ్చిపెట్టావో చెప్తే తను అంత్యక్రియలు చేసుకుంటాడని అడుగుతాడు. కానీ, తనకు తాగిన మైకంలో ఏం జరిగిందో తెలియదని, అసలు ఆ అమ్మాయిని తాను చంపానో? లేదో? కూడా తెలియదంటాడు. ఆమె శవాన్ని వెతికేందుకు తాను కూడా వాళ్లకు సాయం చేస్తానని చెప్తాడు.  వెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ల తండ్రితో పాటు తనూ శవం కోసం వెతుకుతాడు. ఆ శవం దొరికేంత వరకు తాను నిద్రపోనని చెప్తాడు. అదే సమయంలో రోబెర్టా మెడలో ఓ లాకెట్ చూస్తాడు. ఆ లాకెట్ తన గర్ల్ ఫ్రెండ్ ది. “ఈలాకెట్ నీకు ఎవరు ఇచ్చారు.?” అని అడుగుతాడు. తన తల్లి చనిపోయే ముందుకు తన జ్ఞాపకంగా ఇచ్చిందని చెప్తుంది. కానీ, తనకు ఎక్కడో అనుమానం వస్తుంది.

Also Read: ఒక షాపింగ్ మాల్.. ఒక మాస్క్ మ్యాన్.. దారుణ హత్యలు, ఇంట్రెస్టింగ్‌గా సాగిపోయే సిరియల్ కిల్లర్ మూవీ ఇది

హీరో అనుమానమే నిజం అయ్యిందా?

మరుసటి రోజు మళ్లీ తన గర్ల్ ఫ్రెండ్ శవం కోసం వెతుకుతారు. ఇన్ని సంవత్సరాలుగా వెతికినా తన సోదరి శవం దొరకడం లేదని, ఇంకా ఎంతకాలం వెతకాలంటూ తన తండ్రిపై రోబెర్టా కోప్పడుతుంది. వెంటనే ఈ వెతుకులాటను ఆపేయాలని చెప్తూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. అప్పుడే హీరోతో ఆమె తండ్రి ఓ విషయం చెప్తాడు. తన అక్క చనిపోయినప్పటి ఆమె డెడ్ బాడీ కోసం వెతుకుతుందని, కనీసం తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఇక్కడే ఉండి తవ్వుతుందని చెప్తాడు. హీరోకు అనుమానం బలపడుతుంది. ఇంటికి వెళ్లిపోతాడు.

అప్పుడే తన డైరీలో నుంచి ఓ ఫోటో బయటపడుతుంది. అందులో తన గర్ల్ ఫ్రెండ్ చివరగా తీసుకున్న ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ల చెల్లి రోబెర్టాతో ఉంటుంది. అప్పుడే తన అనుమానం నిజం అనుకుంటాడు. వెంటనే రోబెర్టా దగ్గరికి వెళ్లి అసలు తను చనిపోయిన రోజు ఏం జరిగిందో చెప్పాలని నిలదీస్తాడు. అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి హీరోను కొడతాడు. వాళ్ల అక్కను చంపావు.. ఇప్పుడు రోబెర్టా జీవితాన్ని నాశనం చేస్తావా? అంటూ గట్టిగా కొడతాడు. ఆ దెబ్బలకు హీరో స్పృహ కోల్పోతాడు. వెంటనే అతడిని తన కారులో తీసుకుని పోలీస్ ఆఫీసర్, రోబెర్టా ఓ షెడ్డుక తీసుకెళ్లారు. “ఫ్రెండ్ కూతురుని చంపడమే కాదు, మా ఫ్రెండ్ ను, అతడి మరో కూతురు నీ వల్ల చిత్రహింసలకు గురవుతున్నారు” కాల్చిపారేస్తా అంటూ గన్ తీస్తారు.  అప్పుడు హీరో అసలు విషయం చెప్తాడు. అసలు తన గర్ల్ ఫ్రెండ్ ను చంపింది తాను కాదంటాడు. దీంతో పోలీస్ ఆఫీసర్ ఆశ్చర్యపోతాడు.

అసలు హంతకురాలు చెల్లే!

తన గర్ల్ ఫ్రెండ్ ను చంపింది రోబెర్టా అంటాడు. ఆమెను చంపి, తన మెడలోని చైన్ లాకెట్ ను తీసుకుని తన మెడలో వేసుకుందంటాడు. “లేదు.. ఈ చైన్ తనకు తన తల్లి చనిపోయేటప్పుడు ఇచ్చింది” అని చెప్తుంది రోబెర్టా. అసలు వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు తను ఆమె పక్కనే లేదని, ఇక్కడే తన తండ్రితో అక్క శవం కోసం వెతుకుతుందని చెప్తాడు హీరో. చివరకు అసలు నిజం చెప్పేస్తుంది రోబెర్టా. చిన్నప్పటి నుంచి తనకు హీరో అంటే ఇష్టం అని, అతడిని  తన అక్క ఇష్టపడటాన్ని తట్టుకోలేక చంపేశానని చెప్తుంది. ఒక అమాయకురాలని చంపడమేకాదు, మరో అమాయకుడు 15 ఏండ్లు జైల్లో ఉండటానికి కారణం అయ్యింది. తన ఫ్రెండ్ ను 15 ఏండ్లుగా హింసిస్తుందంటూ కోపంతో పోలీస్ ఆఫీసర్ రోబెర్టాను కాల్చి చంపేస్తాడు.

మర్రిచెట్టు కింద గర్ల ఫ్రెండ్ శవం

రోబెర్టా వాళ్ల నాన్న వెంట ఉంటూ అక్కశవం పాతిపెట్టిన చోటు తవ్వకుండా జాగ్రత్తపడుతుంది. ఆమెను చంపి గోతిలో పెట్టిన తర్వాత దాని మీద చెట్టు నాటుతుంది. ఆ చెట్టు ఇప్పుడు చాలా పెద్దది అవుతుంది. ఆమె తండ్రికూడా ఆ చెట్టు దగ్గర కాకుండా మిగతా చోట్ల శవం కోసం తవ్వుతాడు. అక్కడికి వెళ్లిన హీరో, “ మీ చిన్న కూతురు మీతో ఉండలేక పట్టణానికి వెళ్లిపోయింది” అని చెప్తాడు. అలా వెల్లడమే కరెక్ట్ అంటారు రోబెర్టా తండ్రి. వెంటనే హీరో వెళ్లి మర్రిచెట్టు కింద తవ్వుతాడు. తన గర్ల్ ఫ్రెండ్ చేయి కనిపిస్తుంది. పూర్తిగా తవ్వడంతో ఆమె శవం బయటపడుతుంది. ఆ కొండ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత కారణంగా ఆమె శవం ఏమాత్రం చెడిపోదు. దాన్ని చూసి హీరోతో పాటు ఆమె తండ్రి ఎమోషనల్ అవుతారు” అక్కడితో ఈ సినిమా అయిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : పుట్టినరోజు వేడుకలో కొట్టి చంపే స్నేహితులు.. బాబోయ్ ఇలాంటి బర్త్ డే వద్దురా అని పారిపోయేలా చేసే మూవీ

OTT Movie : ఒకే అబ్బాయితో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ రొమాన్స్.. కిక్కెక్కించే ట్రయాంగిల్ బో*ల్డ్ లవ్ స్టోరీ

OTT Movie : ఈ ఇద్దరమ్మాయిల మధ్య రొమాన్స్ అరాచకం భయ్యా… పిచ్చెక్కించే బో*ల్డ్ మూవీ

OTT Movie : డేటింగ్ యాప్ లో పాపను గుడ్డిగా నమ్మితే ఇదే గతి… ఫహద్ ఫాజిల్ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 25 సినిమాలు.. ఆ రెండు సినిమాలను తప్పకుండా చూడాలి..

OTT Movie : పగ తీర్చుకోవడానికి ఒంటరి అమ్మాయి బీభత్సం… రక్తాన్ని మరిగించే రివేంజ్ డ్రామా

OTT Movie : ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే ఆ అబ్బాయి నుంచి కాల్… క్రేజీ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

×