BigTV English

Pawan Kalyan : నిర్మాతలకు పవన్ కళ్యాణ్ షాక్.. ఇలా చేస్తారని అనుకోలేదు డిప్యూటీ సీఏం సార్..

Pawan Kalyan : నిర్మాతలకు పవన్ కళ్యాణ్ షాక్.. ఇలా చేస్తారని అనుకోలేదు డిప్యూటీ సీఏం సార్..

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే… గత ఏడాది వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఏం అవ్వడం తో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా తన బాధ్యతలను నిర్వర్థిస్తున్నారు. అయితే ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు. గతంలో అనౌన్స్ చేసిన సినిమాలను కూడా పూర్తి చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం పై పవన్ కూడా అనేక సార్లు ప్రస్థావించాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం గా మారింది. తాజాగా ఆయన నిర్మాతలకు క్షమాపణలు చెప్పాడు.


రీసెంట్ గా పవన్ కళ్యాణ్ జరిగిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి శాసనపక్ష సమావేశం లో మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. యాభై రోజులకు పైగా చంద్రబాబునాయుడుని అప్పటి సర్కార్ జైలు పాలు చేసిన సంఘటన గుర్తు చేసుకున్నారు. ఆ కారణంతోనే సినిమాలు చెయ్యలేక పోయానని చెప్పాడు. అంతేకాదు ఆయనలా బాధ పడుతూ ఉంటే తాను సెట్లలో ఉత్సాహంగా పాల్గొనలేనని గుర్తించి వెంటనే తన నిర్మాతల కు ఇచ్చిన డేట్లకు రాలేనని చెబుతూ వాళ్లను క్షమాపణ చెప్పారు. నిజానికి పవన్ కు ఆ అవసరం లేదు. నేను రాలేను అని ఒక మాట చెబితే అయిపోయేది. కానీ ఇలా చెప్పడం పై ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది.

Pawan Kalyan apologized to Tollywood producers
Pawan Kalyan apologized to Tollywood producers

గతంలో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ఇలాంటి మాట్లాడలేదు. ఇలాంటి సందర్భాలు రాలేదు. క్షమాపణ చెప్పానని పవన్ కళ్యాణ్ బహిరంగంగా పంచుకున్న సందర్భం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. ఇంకోవైపు చంద్రబాబు సైతం పవన్ ని పొగడ్తల తో ముంచెత్తడం విశేషం.. నిజంగా పవన్ కళ్యాణ్ ఎవరైనా ఇష్టపడితే వారికోసం ఎంతవరకైనా వెళ్తారు అన్న విషయం తెలిసిందే. అదే ప్రజలు ఆయనను నాయకుడిగా ఎన్నుకొనేలా చేసింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకొనేలా చేసింది. ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపట్టారు.. ఇక ఈయన గతంలో ఒప్పుకున్నా సినిమాల్లో ఓజీ సినిమాను త్వరలోనే విడిదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ముందు సినిమాలు చెయ్యడని అర్థం అవుతుంది. మిగిలిన సినిమాలు షూటింగ్ పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటిలో విడుదల అయ్యే అవకాశాలు అయితే లేవు.. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం కూడా ప్రయోజనం ఉండదు.. దీంతో ఫ్యాన్స్ నిరాశ లో ఉన్నారు. దీంతో ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు. సినిమాలు చేస్తారు అనుకున్నాం కానీ ఇలాంటి చేస్తారు అనుకోలేదు డిప్యూటీ సీఏం సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ ఆశను అర్థం చేసుకొని ఒక్క సినిమా అయిన చేస్తాడేమో చూడాలి.. పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన మెగా హీరోలు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.


Related News

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Big Stories

×