Best Sci-Fi movies on OTT : ఓటిటి ప్లాట్ ఫామ్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి వేదికగా మారింది. మనం ఊహించని సినిమాలు కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. రోజుకు ఒక కొత్త తరహాలో వస్తున్న ఈ సినిమాలను చూసి బాగా ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (A I) తో వచ్చే సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఓటీటి ప్లాట్ ఫామ్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.
ది క్రియేటర్ (The creator)
మనుషులు రోబోల మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలతో ఈ మూవీనీ చిత్రీకరించారు. అధునాతన అంతుచిక్కని ఆర్కిటెక్ట్ ఆయుధాన్నికనిపెట్టిన వారిని చంపడానికి మాజీ ప్రత్యేక దళాల ఏజెంట్ జాషువాని నియామిస్తాయి. ఆ ఆయుధానికి మానవాళిని అంతం చేయగల శక్తిని కలిగి ఉంటుంది. జాషువా బృందం శత్రు భూభాగంలోకి ప్రవేశించినప్పుడు, ప్రపంచాన్ని అంతం చేసే ఆయుధం చిన్నపిల్లల రూపంలో వుందని తెలుసుకుంటారు. ఆసక్తికరంగా ఉండే ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Desney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది.
మేగన్ (Megan)
2022 లో వచ్చిన ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మూవీకి గెరార్డ్ జాన్‌స్టోన్ దర్శకత్వం వహించారు. అల్లిసన్ విలియమ్స్, వైలెట్ మెక్‌గ్రా స్టార్, అమీ డోనాల్డ్ ప్రధాన పాత్రలు పోషించారు. వర్సల్ పిక్చర్స్ దీనిని యునైటెడ్ స్టేట్స్‌లో జనవరి 6, 2023న థియేట్రికల్‌గా విడుదల చేసింది. ఈ మూవీ $12 మిలియన్ల బడ్జెట్‌తో తీయగా, ప్రపంచవ్యాప్తంగా $181 మిలియన్లకు పైగా వసూలు చేసింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో పిల్లలకు మంచి ఫ్రెండ్ గా ఉంటుందని ఒక రోబో బొమ్మను తయారుచేస్తారు. ఆ బొమ్మ ద్వారా వచ్చే సమస్యలతో ఈ మూవీ స్టోరీ రన్ అవుతుంది.ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఐ యాం మదర్ (I Am Mother)
ఈ మూవీ 25 January 2019 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ మూవీకి గ్రాంట్ స్పుటోర్ దర్శకత్వం వహించారు. క్లారా రుగ్గార్ద, రోజ్ బిరనే, హిలెరీ ప్రధాన పాత్రలు పోషించారు. ఆధునిక రోబో ఒక పాపను పెంచుతుంది. అయితే ఆ పాపకి మనుషుల ఫీలింగ్స్ అర్థం చేసుకునే జ్ఞానం రాదు. మనుషులతో సంబంధం లేకుండా రోబోలతో గడిపితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఏ స్పేస్ ఒడిస్సీ (A Space Odyssey)
ఈ మూవీకి స్టాన్లీ కూబ్ రిక్ దర్శకత్వం వహించారు. మానవులు చంద్రుని ఉపరితలంలో, ఒక రహస్యమైన కృత్రిమ వస్తువును కనుగొంటుంది. తెలివైన కంప్యూటర్ అయిన HAL 9000 సహాయంతో మనుషులు ఒక ఆసక్తికరమైన అన్వేషణను ప్రారంభిస్తారు.ఈ మూవీ బెస్ట్ విజువల్ మూవీగా అకడమీ అవార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.