BigTV English

Highest Collection Movies: రూ.1000కోట్ల క్లబ్ లో చేరిన టాప్-10 మూవీస్.. పుష్ప2 స్థానం ఎంతంటే..?

Highest Collection Movies: రూ.1000కోట్ల క్లబ్ లో చేరిన టాప్-10 మూవీస్.. పుష్ప2 స్థానం ఎంతంటే..?

Highest Collection Movies.. ప్రస్తుత కాలంలో సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఇండియన్ సినిమాలు అటు అంతర్జాతీయంగా కూడా భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. అంతేకాదు ప్రస్తుత కాలంలో రూ.1000 కోట్ల కలెక్షన్స్ కూడా చాలా సులభంగా అందుకుంటూ ఇంటర్నేషనల్ మార్కెట్లో సత్తా చాటుతూ మరింత పేరు దక్కించుకుంటున్నాయి.


మొత్తానికైతే రాబోయే కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా హాలీవుడ్ లెవెల్ మూవీస్ రావడం గ్యారెంటీ అని ప్రతి ఒక్కరు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మన ఇండియన్ సినిమాలు కూడా ఇంగ్లీషులో విడుదల అయ్యి, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఇకపోతే ఇండియాలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు అందుకున్న సినిమా జాబితా చూసుకుంటే.. అందులో మొదటి స్థానంలో అమీర్ ఖాన్ (Aamir Khan)’దంగల్’ సినిమా ఉంది. ఈ సినిమా రూ.1985 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఇండియాలో కంటే చైనాలోనే అత్యధిక కలెక్షన్స్ లో అందుకుంది .తద్వారా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమాకి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత రెండవ స్థానం ‘బాహుబలి 2’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1810 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రూపురేఖలను కూడా మార్చేసింది. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేసినా .. కంటెంట్ లో దమ్ముంటేనే లాభాలు వస్తాయని రాజమౌళి ‘బాహుబలి’ సీరీస్ తో ప్రూవ్ చేసి చూపించారు. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తోంది.


ఇదిలా ఉండగా ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు సౌత్ వైపు ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఎప్పుడైతే సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను అలరిస్తున్నాయో.. ఇక ఇప్పటినుంచి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సౌత్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే సౌత్ హీరోలకి కూడా ఇప్పుడు బాలీవుడ్ లో అగ్ర తాంబూలం లభిస్తోంది అని చెప్పవచ్చు. ఇక నిర్మాతలు కూడా వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇకపోతే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాలలో తాజాగా వచ్చిన పుష్ప -2 మూడవ స్థానాన్ని అందుకుంది. ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే రూ.1301 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక గట్టిగా ప్రయత్నం చేస్తే రూ.2000 కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంటోందనటంలో సందేహం లేదు.

ఇక హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా నాలుగవ స్థానంలో నిలిచింది. రూ.1290 కోట్లు రాబట్టింది. ఈ సినిమా ఆస్కార్ ,గోల్డెన్ గ్లోబ్ వంటి అవార్డులు కూడా అందుకొని, సరికొత్త శకానికి బాటలు వేసింది. ఇక ఐదవ స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 నిలిచింది. ఈ సినిమా రూ.1233 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు వచ్చాయి. ఇక టాప్ -6 లో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా నిలిచింది. రూ.1160 కోట్లు రాబట్టింది. ఇక ఏడవ స్థానంలో కల్కి 2898AD రూ.1061.5 కోట్లు, పఠాన్ రూ.1051 కోట్లు, యానిమల్ రూ. 913 కోట్లు, బజరంగీ భాయిజాన్ రూ.870 కోట్లు రాబట్టింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×