BigTV English
Advertisement

Crime Thriller OTT: ఐదు స్టోరీలతో మూవీ.. క్లైమాక్స్ లో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు..

Crime Thriller OTT: ఐదు స్టోరీలతో మూవీ.. క్లైమాక్స్ లో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు..

Crime Thriller OTT: మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమా గత ఏడాది నుంచి బ్లాక్ బాస్టర్ అందుకుంటుంది. ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమా ఒక స్టోరీ లైన్ తో సినిమా మొత్తం కదా మలుపులు తిరుగుతూ ఆసక్తిగా ఉంటాయి. తక్కువ బడ్జెట్ తో వచ్చి ఎక్కువ లాభాలను అందుకున్న సినిమాలు మలయాళం ఇండస్ట్రీ సొంతమనే చెప్పాలి. సస్పెన్స్ లతో కూడిన స్టోరీలు, క్రైమ్ త్రిల్లర్ స్టోరీస్, రొమాంటిక్ మూవీలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అయితే ఓటిటిలో మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన క్రైం థ్రిల్లర్ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ మంచి వ్యూస్ ని రాబడుతూ బాగానే సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటిటిలోకి వచ్చేసింది. ఆ సినిమా ఏంటి? ఆ సినిమా స్టోరీ గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి మూవీ భారీ విజయాన్ని అందుకున్నాయి. క్రైమ్ సీన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలు అయితే ఎంతగా ఆకట్టుకుంటాయో తెలిసిందే.. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మూవీ పేరు ‘త్రయం’.. గ తేడా అక్టోబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 5 నెలల తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్ వచ్చేసింది.. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సంజిత్ చంద్రసేనన్ దర్శకత్వం వహించారు.. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ పెద్దగా కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు ఈ త్రయం చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.. త్రయం చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. మలయాళం ఆడియోలో ఒక్కటే ప్రస్తుతం స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది..


Also Read : రన్యా స్మగ్లింగ్ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది అతనే..?

స్టోరీ విషయానికొస్తే.. 

మలయాళ నటులు ధ్యాన్ శ్రీనివాసన్, సన్నీ వేన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ త్రయం.. 5 నెలల క్రితం రిలీజ్ అయ్యింది.. అక్కడ యావరేజ్ టాక్ ను అందుకుంది. త్రయం మూవీని ఐదు కథలతో సంజిత్ చంద్రసేనన్ తెరకెక్కించారు. ఈ ఐదు కథలకు ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది. ఐడియా బాగానే ఉన్నా దాన్ని తెరపై ఎఫెక్టివ్‍గా చూపలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు కథను సరిగ్గా చూపించలేదనే టాక్ ను అందుకుంది. ధ్యాన్ శ్రీనివాసన్, సన్నీ వేన్‍తో పాటు అనువర్గీస్, రాహుల్ మాధవన్, చందూనాథ్, అనార్కలీ మరిక్కర్, ప్రతీ గినో, నిరంజ్ రాజు, షాలు రహీం, కార్తీక్ రామకృష్ణనన్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఈ మూవీ స్టోరీ మొత్తం ఒక్క రోజులోనే జరుగుతుంది. డ్రగ్స్ డీలర్ హ్యారీ.. డెలివరీ ఇచ్చేందుకు వెళ్లి ఓ వ్యక్తిని యాక్సిడెంట్ చేస్తాడు. అంజలిని బ్లాక్‍మెయిల్ చేసే విజయ్, అతడి ఫ్రెండ్ వల్ల కూడా ఓ రోడ్డు ప్రమాదం జరుగుతుంది. ఆషికీ ఓ షాప్‍లో దొంగతనం చేస్తాడు. తన లవర్ జోమోన్ చనిపోయి ఉండడాన్ని ఎల్సా చూస్తుంది.. ఇలా ఐదు స్టోరీలు ఒకదానికి మరొకటి సంబంధం కలిగి ఉంటాయి.. అయితే స్టోరీ కాస్త కన్ఫ్యూషన్ గా ఉండటంతో సినిమా పెద్దగా క్లిక్ అవలేదు. థియేటర్లలో పర్వాలేదు అనిపించిన ఈ మూవీ ఓటిటిలో మాత్రం భారీ అంచనాలని క్రియేట్ చేసుకుంది. మరి ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : భార్య చనిపోవడంతో మరో అమ్మాయితో… దెయ్యం పాపతో ఆ పనులేంటి భయ్యా ?

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Big Stories

×