OTT Movie : రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా హాలీవుడ్ సినిమాలు ముందు ఉంటాయి. ఎందుకంటే ఈ సినిమాలలో వచ్చే రొమాన్స్ మామూలుగా ఉండదు. ఈ సీన్స్ కోసమే ఈ సినిమాలను, మళ్లీమళ్లీ చూసే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలు, టీచర్ స్టూడెంట్ ల మధ్య జరిగే లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతాయి. ఈ సినిమాలలో రొమాన్స్, లవ్, ఎమోషన్స్ వంటివి ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మనం టీచర్, స్టూడెంట్ ల లవ్ స్టోరీలతో వచ్చిన, ట్రెండింగ్ లో ఉన్న టాప్ సినిమాల గురించి తెలుసుకుందాం.
An Affair (అన్ అఫ్ఫైర్)
హైస్కూల్ టీచర్ అనిత, తన విద్యార్థులలో ఒకరికి తనపై పిచ్చి ఉందని గ్రహిస్తుంది. త్వరలోనే ఆమె తన ఉద్యోగం, వివాహం రెండింటినీ లెక్క చేయకుండా, స్టూడెంట్ తో సంబంధం పెట్టుకుంటుంది. ఆ పిచ్చి ఒక వ్యసనం లా మారుతుంది. 2018 లో వచ్చిన ఈ మూవీకి హేన్రిక్ మార్టిన్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
The French teacher (ది ఫ్రెంచ్ టీచర్)
ఒక ఫ్రెంచ్ టీచర్ తన వయసులో సగం వయసున్న విద్యార్థితో ప్రేమాయణం ప్రారంభిస్తుంది. అటు మొగుడు, ఇటు ప్రేమికుడు మధ్యలో టీచర్ ఈ వ్యవహారం చాలా మలుపులు తీసుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Black island (బ్లాక్ ఐలాండ్)
2021 లో వచ్చిన ‘బ్లాక్ ఐలాండ్’ మూవీకి మిగ్యుల్ అలెగ్జాండ్రే దర్శకత్వం వహించారు.దీనిని మిగ్యుల్ అలెగ్జాండ్రే, లిసా కార్లైన్ హోఫర్ రచించారు. ఇందులో హన్స్ జిష్లర్, ఆలిస్ డ్వైర్, మెర్సిడెస్ ముల్లర్ నటించారు. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
The violen player (ది వయోలిన్ ప్లేయర్)
శాస్త్రీయ సంగీత రంగంలో ఒక తారలా ఉండే టీచర్ తనకన్నా చిన్నవాడైన విద్యార్థితో ప్రేమలో పడుతుంది. 2018 లో వచ్చిన ఈ మూవీకి పావో వెస్టర్బర్గ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆపిల్ టివి లో స్ట్రీమింగ్ అవుతోంది.
A Teacher (ఎ టీచర్)
2013లో విడుదలైన ఈ అమెరికన్ రొమాంటిక్ మూవీకి హన్నా ఫిడెల్ దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ ఒక మగ విద్యార్థితో, ఒక మహిళా హైస్కూల్ టీచర్ అక్రమ లైంగిక సంబంధం చుట్టూ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
The English teacher (ది ఇంగ్లీష్ టీచర్)
2013 లో వచ్చిన ఈ మూవీ కి క్రెయిగ్ జిస్క్ దర్శకత్వం వహించారు. ఇందులో జూలియన్ మూర్, మైఖేల్ అంగరానో, గ్రెగ్ కిన్నేర్, లిల్లీ కాలిన్స్ నటించారు . ఒక చిన్న పట్టణం లో ఉండే ఇంగ్లీష్ టీచర్ లిండా, ఒక స్టూడెంట్ తో రొమాన్స్ చేస్తూ సమస్యల్లో చిక్కుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.