Best Vampire Movies on OTT : రక్తపిశాచి కథలతో వచ్చే సినిమాలు మూవీ లవర్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. మనుషుల మధ్య ఉండే ఈ పిశాచాలు, మనుషుల రక్తాన్ని తాగుతూ బ్రతుకుతూ ఉంటాయి. మనుషులను భయపెడుతూ, ఎంటర్టైన్ చేసే బెస్ట్ వ్యాంపైర్ సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్విలైట్ (Twilight)
2008 లో వచ్చిన ఈ అమెరికన్ ఫాంటసీ మూవీకి కేథరీన్ హార్డ్‌విక్ దర్శకత్వం వహించారు. స్టెఫెనీ మేయర్ రాసిన నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ది ట్విలైట్ సాగా ఫిల్మ్ సిరీస్‌లో ఇది మొదటి భాగం. ఈ మూవీలో బెల్లా స్వాన్ అనే టీనేజ్ అమ్మాయిగా క్రిస్టెన్ స్టీవర్ట్, రక్త పిశాచిగా ఎడ్వర్డ్ కల్లెన్ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్ నటించారు. రక్త పిశాచుల నుండి బెల్లాను సురక్షితంగా ఉంచడానికి, ఎడ్వర్డ్ అతని కుటుంబం చేసిన ప్రయత్నాలతో మూవీ నడుస్తుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
అండర్‌వరల్డ్ (Under World)
2003 లో వచ్చిన ఈ యాక్షన్ హారర్ అండర్‌వరల్డ్ మూవీకి లెన్ వైస్‌మాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కేట్ బెకిన్‌సేల్, స్కాట్ స్పీడ్‌మాన్, మైఖేల్ షీన్, షేన్ బ్రోలీ, ఎర్విన్ లెడర్, బిల్ నైఘీ నటించారు. లైకాన్‌లను వేటాడే రక్త పిశాచి, డెత్ డీలర్ సెలీన్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. లైకాన్‌లను లక్ష్యంగా చేసుకున్న మైఖేల్ ని అనే వ్యక్తిని హీరోయిన్ ఇస్టపడుతుంది. మైఖేల్‌ను చంపాలా లేక తన వంశానికి వ్యతిరేకంగా వెళ్లి అతన్ని రక్షించాలా అనే ఆలోచనలో పడుతుంది హీరోయిన్. యునైటెడ్ స్టేట్స్‌లో 2003 సెప్టెంబర్ 19న సోనీ పిక్చర్స్ విడుదల చేసింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
బ్లేడ్ (Blade)
1998లో వచ్చిన ఈ అమెరికన్ సూపర్ హీరో మూవీకి స్టీఫెన్ నోరింగ్‌టన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వెస్లీ స్నిప్స్ టైటిల్ పాత్రలో స్టీఫెన్ డార్ఫ్, క్రిస్ క్రిస్టోఫర్సన్, ఎన్’బుషే రైట్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో బ్లేడ్ రక్త పిశాచులకు వ్యతిరేకంగా పోరాడుతాడు. బ్లేడ్ ఆగస్టు 21, 1998న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలై వాణిజ్యపరంగా విజయవంతమైంది. U.S. బాక్సాఫీస్ వద్ద $70 మిలియన్లు, ప్రపంచవ్యాప్తంగా $131 మిలియన్లు వసూలు చేసింది. ప్రేక్షకుల నుండి సానుకూల ఆదరణతో కల్ట్ ఫాలోయింగ్‌ను పొందింది. మార్వెల్ తెరకెక్కించిన ఈ మూవీకి సీక్వెల్‌గా బ్లేడ్ II, బ్లేడ్: ట్రినిటీ వచ్చాయి. ఆ తరువాత 2024లో, డెడ్‌పూల్ & వుల్వరైన్ మూవీలో స్నిప్స్ బ్లేడ్ పాత్రను తిరిగి పోషించాడు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
వాన్ హెల్సింగ్ (Van Helsing)
2004 లో వచ్చిన ఈ హారర్ వాన్ హెల్సింగ్ మూవీకి సొమర్స్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కథానాయకుడిగా ప్రముఖ నటుడు హ్యూ జాక్మాన్ నటించారు. కేట్ బెకింసేల్ “అనా వెలారియస్” గా నటించింది. ఈ మూవీ 1930, 40ల కాలంలో యూనివర్సల్ స్టూడియోస్ లో వచ్చిన హారర్ చిత్రాలకు నివాళిగా సొమర్స్ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.