BigTV English
Advertisement

Best Web Series on OTT : 2024లో మిస్ కాకుండా చూడాల్సిన బెస్ట్ వెబ్ సిరీస్ లు ఇవే… ఏ ఓటీటీలో ఉన్నాయంటే?

Best Web Series on OTT : 2024లో మిస్ కాకుండా చూడాల్సిన  బెస్ట్ వెబ్ సిరీస్ లు ఇవే… ఏ ఓటీటీలో ఉన్నాయంటే?

Best Web Series on OTT : ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఇప్పుడు వెబ్ సిరీస్ ల సందడి నడుస్తోంది. థియేటర్లతో సంబంధం లేకుండా డైరెక్టుగా ఓటీటీలోకి వస్తున్న ఈ వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. 2024లో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఈ వెబ్ సిరీస్ లను చూడకపోయి ఉంటే మిస్ కాకుండా చూడండి. ఈ సీరీస్ లను చూడటం మొదలుపెట్టాక, ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తారు.


ది పెంగ్విన్ (The penguin)

8 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ వెబ్ సీరీస్ జియో సినిమా (Jio cinema) లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ అమెరికన్ క్రైమ్ డ్రామా వెబ్ సీరీస్ లో గోథమ్ సిటీకి చెందిన ఒక క్రిమినల్ అండర్ వరల్డ్‌లో పై స్తాయికి వచ్చిన తరువాత, అతడు చేసే పనులతో ఈ వెబ్ సీరీస్ నడుస్తుంది. ఈ వెబ్ సీరీస్  ది బాట్‌మాన్ కి  సీక్వెల్‌గా చెప్పుకోవచ్చు. వార్నర్ బ్రదర్స్ తో కలసి DC స్టూడియోస్ ఈ సీరీస్ నిర్మించారు. ఈ వెబ్ సీరీస్ లో  క్రిస్టిన్ మిలియోటి, రెంజీ ఫెలిజ్, డెయిర్‌డ్రే ఓ’కానెల్, క్లాన్సీ బ్రౌన్, కార్మెన్ ఎజోగో, మైఖేల్ జెగెన్, బెర్టో కొలోన్, స్కాట్ కోహెన్, షోహ్రే అగ్దాష్లో, జాహ్రేహ్ అగ్దాష్లో నటించారు. బ్యాట్‌మ్యాన్ పాత్రలో కోలిన్ ఫారెల్ ఆదరగొట్టారు. ఈ వెబ్ సీరీస్ కి మాట్ రీవ్స్ దర్శకత్వం వహించారు.


Gyaarah Gyaarah

2024 లో వచ్చిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ సిరీస్ కు ఉమేష్ బిస్ట్ దర్శకత్వం వహించారు.  సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సిరీస్‌లో కృతికా కమ్రా, రాఘవ్ జుయల్, ధైర్య కర్వా, ఆకాష్ దీక్షిత్ ప్రధాన పాత్రలు పోషించారు. అదితి అనే ఒక అమ్మాయి కనిపించకుండా పోవడంతో, ఈ కేసును పోలీస్ ఆఫీసర్ ఛేదించే క్రమంలో వెబ్ సిరీస్ స్టోరీ రన్ అవుతుంది. ఈ సిరీ స్ జి ఫైవ్ (zee 5) లో స్ట్రీమింగ్ అవుతుంది.

బెంచ్ లైఫ్ (Bench Life)

2024 లో వచ్చిన ఈ తెలుగు కామిడీ డ్రామా సీరీస్ కు మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సీరీస్ లో వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్, రాజేంద్ర ప్రసాద్, నయన్ సారిక, వెంకటేష్ కాకుమాను, తనికెళ్ల భరణి నటించారు. సాఫ్ట్వేర్ కథాంశంతో తెరకెక్కిన ఈ కామిడీ వెబ్ సిరీస్, ఐదు ఎపిసోడ్లతో ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీ లీవ్ (Sony LIV) లో స్ట్రీమింగ్ అవుతుంది.

వికటకవి (Vikatakavi)

2024 లో విడుదలైన ఈ డిటెక్టివ్ కిల్లర్ వెబ్ సిరీస్ కు, ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై, రజిని తాళ్లూరి ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు. అడవిలో ఒక ప్రాంతంలోకి వెళ్లే వ్యక్తులు గతాన్ని మర్చిపోతూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నమే ఈ  వికట కవి సిరీస్. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జి ఫైవ్ (zee 5) లో స్ట్రీమింగ్ అవుతుంది.

Related News

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

Big Stories

×