OTT Movies : ఓటీటీల్లో బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అందులో కొన్ని హారర్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. స్క్రిప్ట్ బాగుంటే అడియన్స్ సైతం కుర్చీకే అతుక్కుపోతున్నారు. ఇక ఇప్పుడు ఓ భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. ప్రధాన హీరో లేకపోయినా కొన్నిరోజులుగా ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్ అవుతుంది.. ఆ మూవీ పేరు భక్షక్.. ఈ మూవీ స్టోరీ, ఓటీటీ వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం..
స్టోరీ విషయానికొస్తే..
ఈ భక్షక్ మూవీ బీహార్ లో జరిగిన వాస్తవ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్ ముజఫర్‌పూర్ షెల్టర్ కేసు ఆధారంగా తెరకెక్కించారు. డైరెక్టర్ పుల్కిత్ దర్శకత్వం వహించారు. ఈ డార్క్ స్టోరీ అడియన్స్ నుంచి ఎక్కువగా ప్రశంసలు అందుకుంది.. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. ఐఎండిబిలో 7.3 రేటింగ్ ను సొంతం చేసుకుంది. స్టోరీ విషయానికొస్తే.. బీహార్ రాష్ట్రంలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అక్రమ రవాణా వంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. అదే సమయంలో మహిళల భద్రత కోసం షెల్టర్ హెమ్స్ ఏర్పాటు చేస్తారు. వాటి అసలు లక్ష్యం అమ్మాయిలను సురక్షితంగా ఉంచడం. కానీ ఈ ఆశ్రయాల పేరుతోనే అమ్మాయిలను ఆక్రమంగా రవాణా చేస్తుంటారు. ఓ మహిళా జర్నలిస్టు ఈ చీకటి కోణాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. అలాంటి సమయంలో ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది? ఆ ముఠా నుంచి ఎలా బయటపడుతుంది.. ఆశ్రమాల్లో చిక్కుకున్న అమ్మాయిలు ఎలా బయటపడతారు? అనేది . స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిసీన్ ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తుంది. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే జర్నలిస్ట్ పాత్రలో భూమి పెడ్నేకర్ చక్కగా నటించారు. ఆ ముఠా నుంచి అమ్మాయిల్ని కాపాడిందా? లేదా అన్నది తెలియాలంటే కచ్చితంగా స్టోరీలో చూడాల్సిందే..
నెట్ ఫ్లిక్స్ ( Netflix )..
అమ్మాయిల అక్రమ రవాణా గురించి జర్నలిస్టు బయట పెట్టే ప్రయత్నం ఈ సినిమా స్టోరీ. ఈ మూవీలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను డైరెక్టర్ చక్కగా చూపించాడు.. ఇలాంటి పరిస్థితులలో కూడా అమ్మాయిలు ఉంటారా అని చాలామంది నమ్మశక్యం కాని స్టోరీని చూపించడంతో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ మూవీ.. ఈమధ్య ఈ ప్లాట్ ఫామ్ లోకి బోలెడు కొత్త సినిమాలు వచ్చేసాయి. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరించేందుకు ఇంట్రెస్టింగ్ సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తుంది..