E-Paper
Advertisement

Bharat Bhhagya Viddhaata OTT : 26/11 దాడి అన్ టోల్డ్ స్టోరీ… కంగనా మూవీ స్ట్రీమింగ్ డేట్

Bharat Bhhagya Viddhaata OTT : 26/11 దాడి అన్ టోల్డ్ స్టోరీ… కంగనా మూవీ స్ట్రీమింగ్ డేట్
Advertisement

Bharat Bhhagya Viddhaata OTT : ప్రస్తుతం హిందీ సినిమా ప్రపంచంలో వరుస వివాదాస్పద కామెంట్స్ తో మారుమ్రోగుతున్న పేరు కంగనా రనౌత్. ఆమె అప్ కమింగ్ చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ (Bharat Bhhagya Viddhaata) ట్రైలర్ విడుదలైన తర్వాత అభిమానులు తెగ హైప్ చేస్తున్నారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి వస్తోంది. కానీ అంతకంటే ముందే దాని OTT ప్లాన్స్ గురించిన ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.

OTT విడుదల ఎప్పుడు ?

‘భారత్ భాగ్య విధాత’ సినిమా థియేటర్లలో విడుదలైన కొద్ది వారాల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం Zee5 OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతుంది. అయితే నిర్మాతలు ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కాగానే Zee5లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్ట్రీమింగ్ ఎప్పుడు అన్నది కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ద్వారానే తెలిసే ఛాన్స్ ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ సినిమా 2008లో ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడుల నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ముఖ్యంగా ఒక ఆసుపత్రిలో పని చేస్తున్న నర్సులు ఎదుర్కొన్న భయంకర పరిస్థితులు, వారు ఎంత ధైర్యంగా రోగుల ప్రాణాలను కాపాడారు ? ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు ? అని ఇప్పటిదాకా ప్రపంచానికి తెలియని కోణంలో ఈ దాడుల కథను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కంగనా రనౌత్ ఈ సినిమాలో నర్స్ పాత్రలో నటిస్తున్నారు. దేశభక్తి, ధైర్యం, త్యాగం అనే అంశాలను ఇందులో బలంగా చూపిస్తుండడం వల్ల ఈ సినిమా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ సృష్టిస్తోంది.

థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడు?

‘భారత్ భాగ్య విధాత’ సినిమా 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించారు. కంగనా ఈ చిత్రంలో కథానాయికగా నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా పని చేశారు. దర్శకుడుగా మనోజ్ తపారియా వ్యవహరించారు. సినిమాలో ఇతర ముఖ్య నటీనటుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ట్రైలర్ చూసిన వాళ్లంతా “ఇది సాధారణ పేట్రియాటిక్ సినిమా కాదు, భావోద్వేగాలు ఉన్న ఇంటెన్స్ థ్రిల్లర్” అంటూ ప్రశంసిస్తున్నారు. కంగనా తన డైలాగ్ డెలివరీతోనే ట్రైలర్‌లో దుమ్ము దులిపేసింది. మొత్తం మీద, 26/11 ఘటనపై కొత్త కోణంలో వచ్చే ఈ సినిమా థియేటర్లలో ఎలా రాణిస్తుందో, Zee5లో ఎప్పుడు వస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతంవిడుదలైన ట్రైలర్ అయితే కంగనా ఫ్యాన్స్‌కి పండగే.

Advertisement

Read Also : భర్త గదిలోకి వెళ్లాలంటేనే వణికిపోయే భార్య… ఒంటరిగా చూడాల్సిన తెలుగు మూవీ

Tags

Related News

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

Big Stories

Advertisement
×