Horror Movie in OTT: హారర్ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువ. భయంకరమైన యాక్షన్ సీన్లు ఉండే సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే మేకర్స్ ఈ మధ్య ఇలాంటి సినిమాలనే అందిస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల కన్నా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా దెయ్యాల స్టోరీతో వచ్చే సినిమాలు మంచి వ్యూస్ ను రాబడుతున్నాయి. తాజాగా ఓ భయంకరమైన హారర్ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ మూవీ పేరేంటి? స్టోరీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..
స్టోరీ విషయానికొస్తే..
దెయ్యాల పేరు చెబితేనే చాలా మంది వణికిపోతారు. అయితే హాస్పిటల్ లో దెయ్యాలు ఉంటాయా? ఉంటే ఎక్కడ ఉంటాయి.. మనుషులకు ఏ మాత్రం హాని కలిగిస్తాయి. ఇలా అనేక సందేహాలు వస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకొనే మూవీ భయంకరమైన స్టోరీ ఇది. హాలీవుడ్‌లో మ్యాన్ ఈటర్ మూవీ అందరికి గుర్తు ఉంటుంది. అంటే మనుషులను పీక్కు తినే దెయ్యాలు.. అలాంటి స్టోరీతో ఈ మూవీ వచ్చింది. ఇదే భవాని వార్డు. హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఆడియన్స్‌ను భయపెట్టేలా ఈ సాగుతుంది. మనిషి చనిపోయిన తరువాత ఆత్మ దేవుడి దగ్గరకు వెళ్లాలి. కానీ, అలా వెళ్లకుండా అదే ఆత్మ ఈవిల్ స్పిరిట్‌గా మారిపోతుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. పగలంతా ప్రశాంతంగా ఉన్న ఆ వార్డులోకి రాత్రి 8 అయితే ఏ ఒక్కరూ ప్రవేశించరు. అక్కడ దెయ్యాలు ఉంటాయని జనాలు నమ్ముతుంటారు. అయితే ఈ విషయం తెలిసి కూడా ఒక డాక్టర్ పేషెంట్‌ను తీసుకుని వెళుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ డాక్టర్, పేషెంట్ కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది మిస్ అవ్వకుండా చూడాలి అంటే మాత్రం ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
Also Read : ఊహించని ట్విస్టులతో స్టోరీ.. దోపిడీ చేసే అమ్మాయిలు.. క్లైమాక్స్ పీక్స్..
అమెజాన్ ప్రైమ్ వీడియో..
ఈ దెయ్యాల స్టోరీతో వచ్చిన మూవీ థియేటర్లలో మిక్సీ్డ్ టాక్ ను తెచ్చుకుంది.. ఇందులో పేరున్న నటీనటులు లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో ఆడియెన్స్ ఈ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. గాయత్రీ గుప్తా, గణేశ్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి భవానీ వార్డ్ 1997 మూవీని మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. ఈ మధ్య కొత్త సినిమాలు ఇక్కడ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి.. స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా అమెజాన్ లోకి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. జూలైలో వచ్చేస్తున్న సినిమాలు ఈ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.