E-Paper
Advertisement

OTT Movie : ప్రపంచాన్ని తలక్రిందులు చేసే మందు … వాడితే పూనకాలే… నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్

OTT Movie : ప్రపంచాన్ని తలక్రిందులు చేసే మందు … వాడితే పూనకాలే… నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్
Advertisement

OTT Movie : ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఆసక్తికరమైన కథనంతో ఆకట్టుకుంటోంది. ఇది ఒక ఔషధాన్ని ఉపయోగించడం ద్వారా తన మెదడు సామర్థ్యాన్ని పూర్తిగా (100%) ఉపయోగించుకునే ఒక రచయిత కథ. ఈ సినిమాలో హీరో అరుదైన డ్రగ్ తో ఉన్నత శిఖరాలను చేరుకుంటాడు. అంతే ప్రమాదాలు కూడా వస్తాయి. థ్రిల్లర్ ఆడియన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2011లో విడుదలైన ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లిమిట్‌లెస్’. నీల్ బర్గర్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో బ్రాడ్లీ కూపర్, రాబర్ట్ డి నిరో, అబ్బీ కార్నిష్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా అసలు వెర్షన్ ఇంగ్లీష్‌లో ఉంది, అయితే ఇది హిందీ, తమిళం, తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లలో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాను JioHotstar, Prime Video వంటి ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమ్ చేయవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఎడ్వర్డ్ అనే రచయిత న్యూయార్క్‌లో నివసిస్తూ, ప్రస్తుతం కష్టాల్లో ఉంటాడు. అతని కెరీర్లో సమస్యలు మొదలవుతాయి. అతని గర్ల్ ఫ్రెండ్ లిండీ కూడా అతన్ని వదిలివేయడంతో అతని జీవితం మరింత దిగజారుతుంది. ఈ సమయంలో అతని బావమరిది వెర్నాన్ అతనికి NZT-48 అనే ఒక కొత్త ఔషధాన్ని ఇస్తాడు. ఈ ఔషధాన్ని తీసుకున్న వెంటనే, ఎడ్డీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. NZT-48 అతని మెదడు పూర్తి సామర్థ్యాన్ని 100% వరకు ఉపయోగించుకునే శక్తిని ఇస్తుంది. ఫలితంగా అతనికి అపారమైన తెలివితేటలు, వేగవంతమైన నైపుణ్యాలను పొందుతాడు. అతను కొన్ని రోజుల్లో తన నవల పూర్తి చేస్తాడు. స్టాక్ మార్కెట్‌లో అద్భుతాలు సృష్టిస్తాడు త్వరలోనే ఆర్థిక ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు.

Read Also : ముసలి మొగుడిపై గూఢచర్యం… ఈ జనరేషన్ ప్రేమ కథ… పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్

Advertisement

అయితే ఈ కొత్త శక్తితో పాటు తీవ్రమైన దుష్ప్రభావాలు, ప్రమాదాలు కూడా ఎదురవుతాయి. ఔషధం ప్రభావం తగ్గినప్పుడు, ఎడ్డీ జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. అతని ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఎడ్డీ వరుస విజయాల వల్ల రష్యన్ మాఫియా అతని మీద ఓ కన్నేస్తుంది. వాళ్ళు కూడా ఆ డ్రగ్ కోసం ఎడ్డీని వెంటాడతారు. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి, ఎడ్డీ తన తెలివితేటలను ఉపయోగించి వారందరినీ తెలివిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి ఎడ్డీ ఈ ప్రమాదం నుంచి బయట పడతాడా ? డ్రగ్ మాఫియా చేతికి వెళ్తుందా ? ఈ స్టోరీ ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×