OTT Movie : బెంగాల్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న వెబ్ సిరీస్ లు, సినిమాలు ఇటీవల కాలంలో డిఫెరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఓటీటీలో వీటిని కూడా ఎక్కువగా ఫాలో అవుతున్నారు మూవీ లవర్స్. ప్రేక్షకులను మెప్పించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు అక్కడి దర్శకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో ఒక విగ్రహం చేసే రచ్చ మామూలుగా ఉండదు. మొదటి ఎపిసోడ్ తో మొదలు పెడితే, చివరి ఎపిసోడ్ వరకూ వదిలిపెట్టకుండా చూస్తూనే ఉంటారు. ఓటీటీలో కూడా ఈ వెబ్ సిరీస్ దూసుకుపోతోంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
హోయ్‌చోయ్ (Hoichoi) లో
ఈ బెంగాలీ సూపర్ నాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘భోగ్’ (Bhog). 2025 లో వచ్చిన ఈ సిరీస్ ను అవిక్ సర్కార్ రాసిన కథ ఆధారంగా తెరకెక్కించారు. పరంబ్రత చటోపాధ్యాయ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో అనిర్బన్ భట్టాచార్య, పర్నో మిత్రా ప్రధాన పాత్రల్లో నటించగా, రాజతవ దత్తా, సుదీపా బసు, సుభాషిష్ ముఖోపాధ్యాయ సహాయక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ హోయ్ చోయ్ (Hoichoi) ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
కోల్‌కతాకు చెందిన అతిన్ అనే వ్యక్తికి పెళ్లి వయసు వచ్చినా , ఇంకా బ్యాచిలర్ గానే ఉంటాడు. అతను పార్క్ స్ట్రీట్ లోని ఒక క్యూరియో షాప్ లో, ఒక దేవత ఇత్తడి విగ్రహాన్ని కొంటాడు. ఆ దేవత విగ్రహానికి పూజా ఎలా చేయాలో కూడా అతిన్ కు తెలియదు. అతని సన్నిహితులు, పని మనిషి పుష్పా ఆ విగ్రహాన్ని చూసి, దానిని పూజించవద్దని హెచ్చరిస్తారు.
ఈ విగ్రహం అతని జీవితంలో అనూహ్యమైన మార్పులను తెస్తుంది. ఇంతలో నిస్సహాయ స్థితిలో ఉన్న దామ్రి అనే ఒక మహిళని, తన ఇంట్లో ఉండటానికి అతిన్ అనుమతిస్తాడు. ఆ తర్వాత పని మనిషి పుష్పా ఉన్నట్టుండి అదృశ్యమవుతుంది. అతిన్ సరైన పద్ధతి తెలియకుండా ఈ విగ్రహాన్ని పూజించడం, తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
అతిన్ కు ఈ విషయం తెలియకపోవడంతో, అతని జీవితం చీకటి మలుపు తీసుకుంటుంది. ఈ విగ్రహం ఆకలి అంటూ భయపెడుతూ ఉంటుంది. అతిన్ ఇప్పుడు కొన్ని అతీంద్రియ శక్తులతో పోరాడాల్సి వస్తుంది. మరి అతిన్ కి దొరికిన విగ్రహం దేవతదా లేకపోతే దుష్ట శక్తిదా ? చివరికి అతిన్ ఈ విగ్రహం వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటాడు ? అతిన్ ఇంట్లోకి కొత్తగా వచ్చిన మహిళ ఎవరు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : అమ్మాయిల పిచ్చితో దిక్కుమాలిన పని… ఈ మలయాళ సైకో థ్రిల్లర్ క్లైమాక్స్ కు ఫ్యూజులు అవుట్ భయ్యా